అన్వేషించండి

Ranji Trophy: శతక్కొటిన పడిక్కల్‌, మనీశ్‌పాండే - పంజాబ్‌పై కర్ణాటక భారీ స్కోరు

Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటక ఆటగాళ్లు రెచ్చిపోయారు. కర్ణాటక బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌, .మనీశ్‌ పాండే మెరుపు శతకంతో టీమిండియా తలుపు తట్టారు.

2024 Ranji Trophy: రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో పరుగుల వరద పారుతుంది. సీనియర్‌ బ్యాటర్లు, టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లు, యువ క్రికెటర్లు చెలరేగిపోతున్నారు. పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటక ఆటగాళ్లు సైతం రెచ్చిపోయారు. కర్ణాటక బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ భారీ శతకంతో చెలరేగాడు. కేవలం 216 బంతుల్లో 24 ఫోర్లు, 4 సిక్సర్లతో 193 పరుగులు చేసి సత్తా చాటాడు. మనీశ్‌ పాండే సైతం మెరుపు శతకంతో టీమిండియా తలుపు తట్టాడు. కేవలం 165 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో మనీశ్‌ పాండే 118 పరుగులు చేశాడు. మరో యువ బ్యాటర్‌ శ్రీనివాస్‌ శరత్‌ కూడా 76 పరుగులతో రాణించడంతో కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 514 పరుగుల వత్తా ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో కర్ణాటక కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ డకౌట్‌ కాగా.. ఓపెనర్‌ ఆర్‌ సమర్థ్‌ 38 త్వరగానే అవుటయ్యాడు. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ 3 వికెట్లు పడగొట్టగా.. ప్రేరిత్‌ దత్‌, నమన్‌ ధిర్‌ తలో 2 వికెట్లు, సిదార్థ్‌ కౌల్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పంజాబ్‌ సైతం పరుగుల వరద పారిస్తుంది. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (85), ప్రభసిమ్రన్‌ సింగ్‌ (83) శతకాల దిశగా సాగుతున్నారు. మూడో రోజు టీ విరామం సమయానికి పంజాబ్‌ ఒక్కవికెట్‌ కూడా నష్టపోకుండా 169 పరుగులు చేసి ధీటుగా స్పందిస్తోంది.

పుజరా ద్వి శతకం
స్పెష‌లిస్ట్ టెస్ట్‌ బ్యాటర్ అయిన పూజారా 243 ర‌న్స్‌తో విరుచుకుప‌డ్డాడు. ప్రపంచ టెస్టు చాంపియ‌న్‌షిప్ వైఫ‌ల్యంతో జ‌ట్టుకు దూర‌మైన నయావాల్ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో 17వ ద్విశ‌త‌కం న‌మోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల‌ సిరీస్‌కు తాను సిద్దంగా ఉన్నానంటూ సెలెక్ట‌ర్లుకు సందేశాలు పంపాడు. జార్ఘండ్ బౌల‌ర్లను ఉతికారేస్తూ 356 బంతుల్లో డ‌బుల్ సెంచ‌రీ బాది జ‌ట్టుకు భారీ స్కోర్ అందించాడు. మరో సౌరాష్ట్ర ఆటగాడు ప్రేర‌క్ మ‌న్కడ్ కూడా శతకం చేయడంతో సౌరాష్ట్ర 5784 వ‌ద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. నయావాల్ Pujara ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో 17వ ద్విశ‌త‌కం న‌మోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల‌ సిరీస్‌కు తాను సిద్దంగా ఉన్నానంటూ సెలెక్టర్లుకు సందేశాలు పంపాడు. జార్ఘండ్ బౌల‌ర్లను ఉతికారేస్తూ 356 బంతుల్లో డ‌బుల్ సెంచ‌రీ బాది జ‌ట్టుకు భారీ స్కోర్ అందించాడు. దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న పుజారా.. తొలి మ్యాచ్‌లోనే ద్వి శతకం చేయడం విశేషం. ఈ డబుల్‌ సెంచరీతో చెలరేగిన పుజారా అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు.

పుజారా రికార్డులు
ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యధిక డబుల్‌ సెంచరీలు చేసిన నాలుగో ఆటగాడిగా పుజారా నిలిచాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా లెజెండ్‌ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ (Don Bradman) 37 డబుల్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా పుజారా 19, 730 రన్స్‌తో రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్‌ లక్ష్మణ్‌ 19,729ను పుజారా అధిగమించాడు.

టాప్ హెడ్ లైన్స్

Shami Career End..!.: షమీ ఇంటర్నేషనల్ కంబ్యాక్ కి కంప్లీట్ చెక్.. 15 మంది యంగ్ పేసర్లతో బిసిసిఐ మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, సెలెక్టర్ల షాకింగ్ ట్విస్ట్!
షమీ ఇంటర్నేషనల్ కంబ్యాక్ కి కంప్లీట్ చెక్.. 15 మంది యంగ్ పేసర్లతో బిసిసిఐ మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, సెలెక్టర్ల షాకింగ్ ట్విస్ట్!
Ajinkya Rahane Retirement: టీమ్ ఇండియా వెటరన్ స్టార్ సంచలన నిర్ణయం.. అన్ని ఫార్మాట్లకు రహానే గుడ్ బై
టీమ్ ఇండియా వెటరన్ స్టార్ సంచలన నిర్ణయం.. అన్ని ఫార్మాట్లకు రహానే గుడ్ బై
KKR Big Move: టీమ్ ఇండియా కోచ్ పదవి వీడిన మరుసటి రోజే ఆ ఐపీఎల్ టీమ్ లోకి రీ-ఎంట్రీ.. హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా టెన్ డోషేట్
టీమ్ ఇండియా కోచ్ పదవి వీడిన మరుసటి రోజే ఆ ఐపీఎల్ టీమ్ లోకి రీ-ఎంట్రీ.. హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా టెన్ డోషేట్
Shubman Gill Reclaims No1 ODI Rank: వన్డేల్లో నంబర్ వన్ ను తిరిగి దక్కించుకున్న‌ గిల్.. భారీగా జంప్ చేసిన‌ వైభవ్ సూర్యవంశీ 
వన్డేల్లో నంబర్ వన్ ను తిరిగి దక్కించుకున్న‌ గిల్.. Rankingsలో భారీగా జంప్ చేసిన‌ వైభవ్ సూర్యవంశీ 

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Gade Saikrishna Case: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్... 9 తెలుగు మూవీస్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్... 9 తెలుగు మూవీస్ డోంట్ మిస్
Objection My Lord Series OTT : ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
Kidney Health : కిడ్నీ వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా.. శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే పెద్ద ప్రమాదమే, జాగ్రత్త
కిడ్నీ వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా.. శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే పెద్ద ప్రమాదమే, జాగ్రత్త
Embed widget