అన్వేషించండి
Advertisement
NZ vs SL: లంకకు చెలగాటం, కివీస్‌కు ప్రాణ సంకటం - సెమీస్ చేరాలంటే నెగ్గాల్సిందే!
ODI World Cup 2023: ప్రపంచకప్‌లో చావో రేవో తేల్చుకునే మ్యాచ్‌కు న్యూజిలాండ్ సిద్ధమైంది. శ్రీలంకతో జరిగే ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీస్‌లో అడుగు పెట్టాలని భావిస్తోంది.
ప్రపంచకప్‌లో చావో రేవో తేల్చుకునే మ్యాచ్‌కు న్యూజిలాండ్ సిద్ధమైంది. ఈ ప్రపంచకప్‌లో తొలుత వరుస విజయాలు సాధించిన కివీస్... తర్వాత వరుస పరాజయాలతో పీకల మీదకు తెచ్చుకుంది. శ్రీలంకతో జరిగే ఈ మ్యాచ్‌లో భారీ విజయం సాధించి సెమీస్‌లో అడుగు పెట్టాలని కివీస్ భావిస్తోంది. న్యూజిలాండ్ ప్రస్తుతం ఉన్న ఫామ్‌కు ఇది పెద్ద విషయం కాకపోయినా వరుస పరాజయాలతో ఇప్పుడు కివీస్ సతమతమవుతోంది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 400 పరుగులు చేసిన ఓడిపోవడం న్యూజిలాండ్ ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసింది. ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధిస్తే ఎలాంటి సాంకేతికతలతో అవసరం లేకుండా కివీస్ సెమీస్‌లో అడుగుపెడుతుంది. ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్ర్కమించిన శ్రీలంక చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది.
ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందన్న వార్తలు న్యూజిలాండ్ జట్టును కలవరపరుస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడినా... వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా కివీస్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించడం ఖాయం. పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో కివీస్ ఉండగా.. తర్వాతి స్థానాల్లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. కివీస్... లంకపై భారీ విజయం సాధిస్తే పాక్, అఫ్గాన్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమిస్తాయి. ఈ మ్యాచ్‌లో విజయం కివీస్‌ను సెమీఫైనల్ రేసులో ఉంచుతుంది. ఇప్పటివరకూ న్యూజిలాండ్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. బెంగళూరు వేదికగా జరిగిన గత మ్యాచ్‌లో కివీస్ పాకిస్థాన్‌పై 400 పరుగులు చేసింది. అయితే బౌలర్లు విఫలమయ్యారు. ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ.. పాక్‌పై విఫలమవ్వడం న్యూజిలాండ్‌ను కలవరపెడుతోంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ ఈ టోర్నమెంట్‌లో పర్వాదేనపిస్తున్నాడు. గ్లెన్ ఫిలిప్స్ కూడా పార్ట్-టైమ్ స్పిన్నర్‌గా రాణిస్తున్నాడు.
బలహీనంగా ఉన్న శ్రీలంకపై విజయం న్యూజలాండ్‌కు తేలికే. అయితే న్యూజిలాండ్ బౌలర్లు బౌన్స్ బ్యాక్ అవ్వకపోతే కష్టాలు తప్పవు. పాతుమ్ నిస్సాంక, సదీర సమరవిక్రమ వంటి సమర్ధవంతమైన బ్యాటర్‌లు లంకలో ఉన్నారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్, జేమ్స్ నీషమ్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్ వంటి కీలక ఆటగాళ్లు గాయాల బారినపడడం కివీస్‌కు నష్టం కలిగించింది. విలియమ్సన్ మళ్లీ జట్టులో చేరడంతో బ్యాటింగ్ బలం మరింత పెరిగింది. రచిన్ రవీంద్ర భారీ స్కోర్లు సాధిస్తున్నాడు. ఫిలిప్స్ విధ్వంసకరంగా ఆడుతున్నాడు. టోర్నమెంట్ ఇంగ్లండ్‌పై భారీ సెంచరీ చేసిన తర్వాత కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే పెద్దగా రాణించకపోవడం కివీస్‌ను కలవరపెడుతోంది. శ్రీలంక జట్టుకు ఇప్పటికే సెమీస్ ద్వారాలు మూసుకుపోయాయి. పలువురు కీలక ఆటగాళ్లు గాయపడటంతో వారు చాలా నష్టపోయారు. టోర్నమెంట్‌ను గెలుపుతో ముగించాలని లంక భావిస్తోంది.
న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, కైల్ జామీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, శాంట్నర్, ఇష్ సోధి, టిమ్ విల్ యంగ్.
శ్రీలంక: కుసాల్ మెండిస్ (కెప్టెన్), కుశాల్ పెరీరా, పాతుమ్ నిస్సాంక, దుష్మంత చమీర, దిముత్ కరుణరత్నే, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, మహేశ్ తీక్షణ, దునిత్ వెల్లలాగే, కసున్ రజిత, ఏంజెలో మాథ్యూస్, దిల్షన్ మాథ్యూస్, దిల్షన్ మాథ్యూస్ కరుణరత్నే.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
హైదరాబాద్
సినిమా
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion