అన్వేషించండి

NED vs AFG: అఫ్గాన్‌పై పోరులో నెదర్లాండ్స్‌ రనౌట్‌ , స్వల్ప స్కోరుకే కుప్పకూలిన డచ్‌ జట్టు

ODI World Cup 2023: నెదర్లాండ్స్‌పై ఘన విజయం సాధించి నెట్‌ రన్‌రేట్‌ పెంచుకుని సెమీస్‌లో అడుగు పెట్టాలని పట్టుదలగా ఉన్న అఫ్గానిస్థాన్‌ ఆ దిశగా తొలి అడుగు వేసింది.

నెదర్లాండ్స్‌పై ఘన విజయం సాధించి నెట్‌ రన్‌రేట్‌ పెంచుకుని సెమీస్‌లో అడుగు పెట్టాలని పట్టుదలగా ఉన్న అఫ్గానిస్థాన్‌ ఆ దిశగా తొలి అడుగు వేసింది. లక్నోలోని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఎకానా స్టేడియంలోజరుగుతున్న మ్యాచ్‌లోనూ నెదర్లాండ్స్‌ను అఫ్గాన్‌ తక్కువ పరుగులకే కట్టడి చేసింది.46.3 ఓవర్లలో 179 పరుగులకే డచ్‌ జట్టు కుప్పకూలింది. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన డచ్‌ బ్యాటర్లు... చేజేతులా అవుటై అఫ్గాన్‌ బౌలర్లకు శ్రమ తగ్గించారు. టాపార్డర్‌లో నలుగురు బ్యాటర్లు రనౌట్‌ అయ్యారు. లేని పరుగు  కోసం యత్నించి నెదర్లాండ్స్ బ్యాటర్లు వికెట్లను సమర్పించుకున్నారు. అఫ్గాన్‌ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి డచ్ జట్టుపై ఒత్తిడి పెంచారు.
 తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్‌కు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు మూడు పరుగుల వద్ద వెస్లీ బారేసీని ముజీబుర్ రెహ్మన్‌ వికెట్ల ముందు బలిగొన్నాడు. దీంతో తొలి ఓవర్‌లోనే నెదర్లాండ్స్‌ వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత డచ్‌ బ్యాటర్లు మరో వికెట్‌ పడకుండా బాధ్యతాయుతంగా బ్యాటింగ్‌ చేశారు.

మాక్స్ ఓ'డౌడ్, కొలిన్ అకెర్మాన్, రెండో వికెట్‌కు విలువైన భాగస్వామ్యం నెలకొల్పి డచ్‌ జట్టులో ఆశలు రేపారు. వీరిద్దరి భాగస్వామ్యంతో నెదర్లాండ్స్‌ గౌరవప్రదమైన స్కోరు దిశగా పయనించింది. కానీ వీరిద్దరూ లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అవ్వడం డచ్‌ జట్టు కొంపముంచింది. 40 బంతుల్లో 9 ఫోర్లతో 42 పరుగులు చేసిన మాక్స్ ఓ'డౌడ్... 35 బంతుల్లో నాలుగు ఫోర్లతో 29 పరుగులు చేసిన కొలిన్ అకెర్మాన్ రనౌట్‌ అయి వెనుదిరిగారు. మంచి ఫామ్‌లో ఉన్న సారధి స్కాట్ ఎడ్వర్డ్స్‌ ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగాడు. స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ కూడా రనౌట్‌గానే వెనుదిరగడంతో నెదర్లాండ్స్‌ 92 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మిగిలిన బ్యాటర్లు కూడా ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు వెళ్లిపోయారు. కానీ సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ ఒంటరి పోరాటం చేశాడు. 86 బంతుల్లో 6 ఫోర్లతో 58 పరుగులు చేసిన సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ కూడా రనౌట్‌ అయి వెనుదిరిగాడు.

నెదర్లాండ్స్‌ బ్యాటర్లలో నలుగురు టాపార్డర్‌ బ్యాటర్లు రనౌట్‌గానే వెనుదిరిగారు. ఈ రనౌట్లే డచ్‌ జట్టు భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశాయి. మైదానంలో చురుగ్గా కదిలిన అఫ్గాన్‌ ఫీల్డర్లు నలుగురు బ్యాటర్లను రనౌట్‌ చేశారు. మరోవైపు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి డచ్‌ జట్టుపై ఒత్తిడి పెంచారు.  ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయిన నెదర్లాండ్స్‌ ది. 46.3 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది. డచ్‌ జట్టులో ఏడుగురు బ్యాటర్లు రెండంకెలు స్కోరు కూడా చేయలేక పోయారు. అఫ్గాన్ బౌలర్లలో మొహమ్మద్ నబీ 3,  నూర్ అహ్మద్  రెండు వికెట్లు తీశారు.

 పాయింట్ల పట్టికలో డచ్ జట్టు ఎనిమిదో స్థానంలో ఉంది. ఈరోజు ఆఫ్ఘానిస్థాన్‌ను ఓడిస్తే.. నెదర్లాండ్స్‌కు సెమీఫైనల్‌ చేరే అవకాశాలు మెరుగవుతాయి. కానీ డచ్‌ జట్టు ఇక్కడ ఓడిపోతే సెమీస్‌ ఆశలకు తెరపడుతుంది. ఈ మైదానంలో జరిగిన 12 మ్యాచుల్లో  రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లే తొమ్మిది సార్లు గెలిచాయి. కాబట్టి అఫ్గాన్‌ కూడా విజయంపై నమ్మకంతో ఉంది. ఇప్పటికీ అఫ్గాన్‌కు.. నెదర్లాండ్స్‌కు  సెమీస్‌ అవకాశాలు సజీవంగా ఉండడంతో ఈ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించి  ముందడుగు వేయాలని అఫ్గాన్‌ భావిస్తోంది. ఈ ప్రపంచకప్‌లో ఆఫ్ఘన్ జట్టు ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడగా 3 గెలిచింది. ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక వంటి పెద్ద జట్లకు షాక్‌ ఇచ్చి విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న అఫ్గాన్‌ నేడు నెదర్లాండ్స్‌పై గెలిస్తే ఐదో స్థానానికి చేరుకుంటుంది. పాయింట్ల పట్టికో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు సమానంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కంగారూ, కివీస్ జట్లు తమ తదుపరి మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శన చేస్తే అప్గాన్‌కు సెమీస్‌ అవకాశాలు మెరుగవుతాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Pushpa 2: హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
Afifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలుRail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Pushpa 2: హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
Afifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
CID VijayPal: ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Pushpa Actor Shritej: మోసం చేశాడు... ఎఫైర్ల విషయంలో
మోసం చేశాడు... ఎఫైర్ల విషయంలో "పుష్ప" నటుడు శ్రీతేజ్ మీద బాంబు పేల్చిన భార్య
Embed widget