అన్వేషించండి

Mohammed Siraj News: ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లకు ముందు ఇండియా టీమ్‌లో సడన్ చేంజ్, ఆ స్టార్ బౌలర్ అవుట్.. రీప్లేస్‌మెంట్‌గా దూసుకొచ్చిన కొత్త స్పీడ్‌స్టర్!

ఇండియా స్టార్ పేసర్ సిరాజ్ ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌ల నుంచి తప్పుకోగా, అతని ప్లేస్‌లోకి ప్రసిద్ధ్ కృష్ణను సెలెక్టర్లు టీమ్‌లోకి తీసుకున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బీసీసీఐ వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కొరకు సిరాజ్‌కు విశ్రాంతినిచ్చింది.
  • ఐపీఎల్, టెస్ట్ ఆడిన సిరాజ్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ.
  • శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్.

BCCI Major Update on Indian Squad: టీమిండియా ఫ్యాన్స్‌కు బిసిసిఐ (BCCI) ఒక ఊహించని షాక్ ఇచ్చింది. అప్కమింగ్ ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్ల నుంచి స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్‌ను తప్పిస్తున్నట్లు మంగళవారం అనౌన్స్ చేసింది. ఐర్లాండ్‌తో రెండు, ఇంగ్లాండ్‌తో ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్ కోసం సిరాజ్ మొదట సెలెక్ట్ అయ్యాడు. అయితే బిసిసిఐ మెడికల్ టీమ్, టీమ్ మేనేజ్‌మెంట్ డిస్కషన్స్ తర్వాత అతనికి రెస్ట్ ఇవ్వాలని డిసైడ్ చేశారు. రాబోయే లాంగ్ ఇంటర్నేషనల్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, ముందస్తు జాగ్రత్తగా ఈ వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసినట్లు బోర్డు ఒక స్టేట్‌మెంట్‌లో చెప్పాడు.

Read Also:  FIFA World Cup 2026 Schedule: ఫీఫా ప్రపంచకప్‌లో 48 జట్లు, 104 మ్యాచ్‌లు! ముందెన్నడూ చూడని మెగా ఈవెంట్‌ రెడీ! 

సిరాజ్ ప్లేస్‌లోకి ప్రసిద్ధ్ కృష్ణ
సిరాజ్ స్థానాన్ని భర్తీ చేయడానికి మెన్స్ సెలెక్షన్ కమిటీ రైట్ ఆర్మ్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను ఎంపిక చేసింది. రెండు టి20 సిరీస్‌లకు అతను అందుబాటులో ఉంటాడు. ఇటీవల ముగిసిన ఐపిఎల్ 2026 (IPL 2026) సీజన్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున సిరాజ్ అన్ని మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు పడగొట్టాడు. ఆ వెంటనే ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్-ఆఫ్ టెస్ట్ మ్యాచ్‌లోనూ భాగమయ్యాడు. బ్యాక్ టు బ్యాక్ మ్యాచులు ఆడటం వల్ల బాడీకి రికవరీ టైమ్ ఇవ్వడానికే ఈ డెసిషన్ తీసుకున్నట్లు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్క‌ర్ స్పష్టం చేశాడు. మరోవైపు ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన భువనేశ్వర్ కుమార్ ను పరిగణనలోకి తీసుకోకపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు.

Read Also: FIFA World Cup 2026 Schedule: ఫీఫా ప్రపంచకప్‌లో 48 జట్లు, 104 మ్యాచ్‌లు! ముందెన్నడూ చూడని మెగా ఈవెంట్‌ రెడీ!

అప్‌డేటెడ్ ఇండియన్ స్క్వాడ్ వివరాలు
ఈ మార్పు తర్వాత ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లకు వెళ్లే ఫైనల్ టీమ్ రెడీ అయింది. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చూసుకోనున్నారు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లాంటి హిట్టర్లతో బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. ఆల్‌రౌండర్లుగా శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ సెలెక్ట్ అయ్యారు. స్పిన్ డిపార్ట్‌మెంట్‌లో వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ ఉండగా, పేస్ బాధ్యతలను హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ పంచుకోనున్నారు. జపాన్‌లో జరిగే ఏషియన్ గేమ్స్‌కు సిరాజ్‌ను ముందే పక్కన పెట్టడం గమనార్హం.

 

Frequently Asked Questions

మహమ్మద్ సిరాజ్‌ను ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్ల నుంచి ఎందుకు తప్పించారు?

రాబోయే అంతర్జాతీయ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ కింద సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వాలని BCCI మెడికల్ టీమ్ నిర్ణయించింది. బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్‌లు ఆడటం వల్ల అతని శరీరానికి కోలుకునే సమయం అవసరమని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపారు.

మహమ్మద్ సిరాజ్ స్థానంలో ఏ ఆటగాడిని ఎంపిక చేశారు?

సిరాజ్ స్థానంలో కుడిచేతి వాటం పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను మెన్స్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అతను రెండు T20 సిరీస్‌లకు అందుబాటులో ఉంటాడు.

నవీకరించబడిన భారత జట్టులో ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లకు కెప్టెన్, వైస్ కెప్టెన్ ఎవరు?

ఈ మార్పుల తర్వాత, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చూసుకోనున్నారు.

విశ్రాంతి తీసుకునే ముందు మహమ్మద్ సిరాజ్ ఏ టోర్నమెంట్‌లలో ఆడాడు?

ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున సిరాజ్ అన్ని మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లోనూ భాగమయ్యాడు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget