అన్వేషించండి

Mayank Agarwal: ఆసుపత్రి నుంచి మయాంక్‌ అగర్వాల్ డిశ్చార్జ్

Mayank Agarwal: విమానంలో మంచి నీళ్లని భ్రమించి హానికర ద్రవం తాగిన భారత క్రికెటర్‌ మయాంక్‌ అగర్వాల్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు.

Mayank Agarwal discharged: విమానంలో మంచి నీళ్లని భ్రమించి హానికర ద్రవం తాగిన భారత క్రికెటర్‌ మయాంక్‌ అగర్వాల్‌(Mayank Agarwal) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు. ప్రయాణం చేసేందుకు ఎటువంటి ఇబ్బందులూ లేకపోవడంతో  బుధవారం సాయంత్రం అతడు బెంగళూరు చేరుకొన్నాడు.తాను  కోలుకుంటున్నా అని మయాంక్‌ అభిమానుల కోసం సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని... త్వరలోనే బయటకు వస్తానని మయాంక్‌ తెలిపాడు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన వారికి.. తనపై ప్రేమ చూపుతున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలని ’ మయాంక్‌ అగర్వాల్‌ పోస్ట్‌ చేశాడు. విమానంలో కూర్చుని తన ముందున్న హానికర ద్రవాన్ని మంచి నీళ్లు అనుకొని తాగి మయాంక్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ద్రవం కారణంగా గొంతులో బొబ్బలు వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. అతడి పరిస్థితి నిలకడగా ఉండి ప్రయాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా  ఉండడంతో  బెంగళూరుకు తీసుకురాగా స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేరి మరోసారి పరీక్షలు చేయించుకొంటాడని సమాచారం. ప్రస్తుతం అతడికి విశ్రాంతి తప్పనిసరి కావడంతో శుక్రవారం నుంచి సూరత్‌లో రైల్వే్‌సతో జరిగే రంజీ మ్యాచ్‌కు దూరమయ్యాడు. 


ఇంతకీ ఏమైందంటే..?
టీమిండియా (Team India) క్రికెటర్‌ మయాంక్‌ అగర్వాల్‌(Mayank Agarwal) తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. రంజీ ట్రోఫీ(Ranji Trophy) లో కర్నాటకకు సారథిగా వ్యవహరిస్తున్న మయాంక్‌ అగర్వాల్‌ .. అగర్తల నుంచి న్యూఢిల్లీకి వెళ్లే విమానంలో అనారోగ్యం బారిన పడ్డాడు. అగర్తలాలో త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో గెలిచిన అనంతరం కర్నాటక జట్టు సూరత్‌కు ప్రయాణమైంది. విమానంలో కర్నాటక జట్టుతో ఉన్న అగర్వాల్‌.. నోటి, గొంతులో మంటతో ఇబ్బందిపడ్డాడు. మయాంక్.. విమానంలో కూర్చున్న తర్వాత మయాంక్‌ విపరీతమైన గొంతు నొప్పి, మంటతో బాధపడినట్లు తెలుస్తోంది. అదే విధంగా వాంతులు కూడా చేసుకున్నట్లు సమాచారం. దీంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. 

విమానంలోనే...
కలుషిత నీటిని తాగడం వల్లే మయాంక్‌ అగర్వాల్‌ అస్వస్థతకు గురైనట్టు సమాచారం. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన కర్నాటక గోవాతో పాటు త్రిపురపైనా గెలిచింది. ‘త్రిపురతో మ్యాచ్‌ ముగిసిన తర్వాత కర్నాటక జట్టు సూరత్‌కు ప్రయాణమైంది. ఇదే సమయంలో వాంతులతో ఇబ్బందిపడ్డ అగర్వాల్‌ తనకు గొంతులో మంటగా ఉందని చెప్పాడు. కర్నాటక టీమ్‌ అధికారులు మాకు ఈ విషయం చెప్పడంతోనే వెంటనే విమానం నుంచి కిందకు దించి అగర్తలాలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం అగర్వాల్‌ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు..’ అని త్రిపుర క్రికెట్‌ అసోసియేషన్‌(Tripura Cricket association) ప్రతినిధి తెలిపారు. మయాంక్‌ అగర్తలలోని ఐఎల్‌ఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అగర్వాల్‌కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. విమానంలో మయాంక్‌కు ఇలా జరగడానికి గల స్పష్టమైన కారణాలైతే ఇంకా తెలియలేదు. అయితే ప్రస్తుతం మయాంక్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. మయాంక్‌కు పెద్దగా ప్రమాదం లేదని, కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఈ ఘటనపై మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తోందని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ షావీర్ తారాపూర్ తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Prasidh Krishna Out : ఫిట్‌నెస్ పరీక్షలో ఫెయిలైన స్పీడ్‌స్టర్ వన్డేలకు దూరం.. ప్రసిద్ధ్ కృష్ణపై బీసీసీఐ వేటు
ఫిట్‌నెస్ పరీక్షలో ఫెయిలైన స్పీడ్‌స్టర్ వన్డేలకు దూరం.. ప్రసిద్ధ్ కృష్ణపై బీసీసీఐ వేటు.. అతని ప్లేస్ లో..
Malinga, Mhambrey Exit:  మలింగ సహా ముగ్గురు కీలక కోచ్ లకు MI గుడ్ బై.. భారీ ప్రక్షాళన దిశగా మాజీ చాంపియన్
 మలింగ సహా ముగ్గురు కీలక కోచ్ లకు MI గుడ్ బై.. భారీ ప్రక్షాళన దిశగా మాజీ చాంపియన్
Gill Temple Gadget: నుదిటిపై వింత పరికరంతో ప్రాక్టీస్ చేసిన శుభ్‌మన్ గిల్.. జొమాటో సీఈవో కొత్త హెల్త్ వేరబుల్ చూసి కెప్టెన్ ఫిదా, వైరల్ అవుతున్న క్రేజీ ఫీచర్లు
నుదిటిపై వింత పరికరంతో ప్రాక్టీస్ చేసిన శుభ్‌మన్ గిల్.. జొమాటో సీఈవో కొత్త హెల్త్ వేరబుల్ చూసి కెప్టెన్ ఫిదా, వైరల్ అవుతున్న క్రేజీ ఫీచర్లు

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Comrade Kalyan Movie OTT : ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
CM Revanth Reddy: మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడినందుకు నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
BRS హయాంలో మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడితే నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
Arnab Cyclone Effect: అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
Embed widget