![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Manoj Tiwary: మనోజ్ తివారీ గుడ్‌బై, ఇక నో యూ టర్న్
Manoj Tiwary retirement : పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ బిహార్‌తో మ్యాచ్ తనకు చివరిదన్నాడు.
![Manoj Tiwary: మనోజ్ తివారీ గుడ్‌బై, ఇక నో యూ టర్న్ Manoj Tiwary to bid adieu to all formats of cricket after Ranji Trophy fixture against Bihar Manoj Tiwary: మనోజ్ తివారీ గుడ్‌బై, ఇక నో యూ టర్న్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/18/02f34827caa3872a1f0464d2473dd8261708216001027872_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Manoj Tiwary has announced his retirement from all forms of cricket : పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ(Manoj Tiwary ) ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బిహార్‌తో మ్యాచ్ తనకు చివరిదని మనోజ్ తివారీ ప్రకటించేశాడు. గతంలో ఓసారి రిటైర్మెంట్ ప్రకటించి వెనక్కి తీసుకున్న మనోజ్ తివారీ... ఈసారి మాత్రం రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోనని తెలిపాడు. తన రంజీ కెరీర్.. ఈడెన్ గార్డెన్స్‌తో తనకున్న అనుబంధాన్ని చెప్తూ ఓ భావోద్వేగ పోస్ట్ చేశాడు. 2006లో రంజీల్లో అరంగేట్రం చేసిన తివారీ 2008లో టీమిండియాలో అరంగేట్రం చేశాడు. అయితే.. అతడికి కేవలం 12 వన్డేలు, 3 టీ20లు ఆడే అవకాశం వచ్చింది. భారత జట్టు తరఫున 2015లో జింబాబ్వేపై చివరి మ్యాచ్ ఆడేసిన తివారీ రంజీలపై దృష్టి పెట్టాడు. 141 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన మనోజ్ తివారీ... 30 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు బాదాడు. టీమిండియాలో చోటు కోల్పోయిన తివారీ ఐపీఎల్‌లో మెరిశాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రైసింగ్ పూణే సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)