అన్వేషించండి

Shubman Gill: 'బరువు తగ్గా.. మళ్లీ పెరుగుతా' - గిల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Shubman Gill: టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫామ్‌ను అందుకున్నాడు. డెంగ్యూ కారణంగా తాను కొన్ని కిలోలు బరువు తగ్గానని.. తిరిగి ఆ పుంజుకుంటానని వ్యాఖ్యానించాడు.

టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌ బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫామ్‌ను అందిపుచ్చుకున్నాడు. డెంగ్యూ కారణంగా ప్రపంచకప్‌ తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన గిల్‌... దాయాది పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరాడు. కానీ బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధ శతకంతో సత్తా చాటాడు. మ్యాచ్‌ అనంతరం గిల్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. డెంగ్యూ కారణంగా తాను కొన్ని కిలోలు బరువు తగ్గానని.. తిరిగి ఆ బరువు పెరగాలని చూస్తున్నట్లు వ్యాఖ్యానించాడు. మెగా టోర్నీలో తొలి రెండు మ్యాచులు దూరం కావడంతో తాను నిరాశ చెందానని గిల్‌ తెలిపాడు. ఇప్పుడు మళ్లీ జట్టులో భాగం కావడం, బంగ్లాతో మ్యాచ్‌లో ప్రపంచకప్‌లో తొలి అర్ధ శతకం సాధించడం తనకు మంచి అనుభూతిని కలిగించిందని గిల్‌ అన్నాడు.

తాను అనారోగ్యానికి గురైనప్పుడు ప్రపంచకప్‌లాంటి మెగా టోర్నమెంట్‌లో జట్టులో భాగం కాలేకపోవడం తనకు నిరాశ కలిగించిందని గిల్‌ అన్నాడు. కానీ తొలి రెండు మ్యాచుల తర్వాత బంగ్లాపై రాణించడం తనకు ఆనందంగా ఉందని మ్యాచ్ తర్వాత మీడియా ఇంటరాక్షన్‌లో గిల్ చెప్పాడు. తాను డెంగ్యూ కారణంగా బరువు తగ్గానని కూడా తెలిపాడు. గత 15 రోజుల్లో తాను మానసికంగా సిద్ధం కావడానికి చాలా శ్రమించానని వెల్లడించాడు. తాను బరువు తగ్గినా మైదానంలో కానీ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు కానీ అది ఎలాంటి ప్రభావం చూపడం లేదని స్పష్టం చేశాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మంచి టచ్‌లో కనిపించిన గిల్‌ భారీ స్కోరు చేసేలా కనిపించాడు. కానీ, 16 పరుగులకే అవుట్ అయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో చాలా మంచి ఆరంభాన్ని అందించడమే కాక హాఫ్ సెంచరీ కూడా సాధించాడు. బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు గిల్‌ చాలా సౌకర్యవంతంగా కనిపించాడు. తన ఇన్నింగ్స్‌లో రెండు భారీ సిక్సర్లు కూడా బాదాడు. 

ప్రపంచకప్‌లో రోహిత్‌శర్మ అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తున్నాడన్న గిల్‌.. లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు తమకు అదిరే ఆరంభం అందుతోందని తెలిపాడు. ప్రపంచ కప్‌లో దిగ్గజ బ్యాటర్లు ఎలా ఆటను నిర్మిస్తారో తాను ఎప్పుడూ గమనిస్తూ ఉంటానని, వారి నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు. కొన్నిసార్లు దూకుడుగా ఉండటం.. కొన్ని సార్లు రక్షణాత్మకంగా ఆడడం వ్యూహంలో భాగమని గిల్‌ అన్నాడు. వన్డేల్లో శుభమన్ గిల్ రికార్డు అద్భుతంగా ఉంది. 24 ఏళ్ల శుభ్‌మన్ గిల్‌ 35 వన్డేల్లో 66.1 బ్యాటింగ్ సగటుతో 1917 పరుగులు చేశాడు. వన్డేల్లో గిల్‌ స్ట్రైక్ రేట్ కూడా 102.84 ఉండడం అతను ఎంత స్థిరంగా రాణిస్తున్నాడో చెబుతుంది. ప్రస్తుతం గిల్‌ ICC వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్-2 ర్యాంక్‌లో ఉన్నాడు.

ఇటీవల శుభ్‌మన్‌ గిల్‌ ప్రతిష్టాత్మకమైన ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డును కూడా దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ ఓపెనర్‌ డేవిడ్‌ మలాన్‌, టీమిండియా పేస్‌ స్టార్ మహ్మద్‌ సిరాజ్‌ను వెనక్కి నెట్టి... సెప్టెంబర్ నెలకు ఉత్తమ ఆటగాడిగా గిల్‌ నిలిచాడు. సెప్టెంబర్‌ నెలలో గిల్‌ను బెస్ట్ ప్లేయర్‌గా ఎంపిక చేసినట్లు ఐసీసీ ట్వీట్‌ చేసింది. సెప్టెంబర్ నెలలో శుభ్‌మన్ అద్భుతమైన బ్యాటింగ్‌త అదరగొట్టాడు. భీకర ఫామ్‌లో ఉన్న గిల్‌ 80 సగటుతో 480 పరుగులు చేశాడు. సెప్టెంబర్‌లో ఆడిన ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ గిల్‌ నిలిచాడు. ఆసియా కప్‌లో 75.5 బ్యాటింగ్ సగటుతో ఈ స్టార్‌ ఓపెనర్‌ 302 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లలో గిల్ 178 పరుగులు చేశాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Karthika Pournami Pooja Vidhanam: కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
Embed widget