అన్వేషించండి
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
KL Rahul: తొలి విదేశీ బ్యాటర్ రాహులే , అరుదైన ఘనత సాధించిన కేఎల్
KL Rahul: రాహుల్ అరుదైన రికార్డును సృష్టించాడు. దక్షిణాఫ్రికాలో ఆసియా బ్యాటర్లలో అత్యధిక శతకాలు బాదిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో, కఠిన సవాళ్లను ఎదుర్కొని కేఎల్ రాహుల్ అద్భుత శతకంతో టీమిండియాకు గౌరవప్రమదమైన స్కోరు అందించాడు. పేసర్లకు స్వర్గధామంగా మారిన పిచ్‌పై ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కోవడంలో టాప్‌ఆర్డర్ విఫలమవడంతో జట్టు 92 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన రాహుల్.. జట్టుకు పోరాడే స్కోరు అందించి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. రాహుల్ రాణించకపోతే టీమిండియా 150 పరుగుల లోపే ఆలౌట్ అయ్యేది. ఈ క్రమంలోనే రాహుల్ అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచులో సెంచరీ తో ఈ మైదానంలో రెండు సెంచరీలు చేసిన ఏకైక విదేశీ బ్యాటర్‌గా రాహుల్ నిలిచాడు. 2021,22 పర్యటనలో ఇదే మైదానంలో ఓపెనర్‌గా వచ్చిన రాహుల్ 123 పరుగులు చేశాడు. ఇప్పుడు మరో సెంచరీతో రాహుల్ అరుదైన రికార్డును సృష్టించాడు.
దక్షిణాఫ్రికాలో ఆసియా బ్యాటర్లలో అత్యధిక శతకాలు బాదిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ 5 సెంచరీలతో మొదటి స్థానంలో ఉన్నాడు. అజర్ మహమూద్, టి.సమరవీర, విరాట్ కోహ్లీలతో పాటు కేఎల్ రాహుల్ రెండు శతకాలు బాదాడు. సౌతాఫ్రికాలో అత్యధిక సెంచరీలు చేసిన ఆసియా బ్యాటర్లలో అయిదు సెంచరీలతో సచిన్ టెండూల్కర్ అగ్ర స్థానంలో ఉన్నాడు. పాకిస్తాన్‌కు చెందిన అజర్ మహమూద్ 2, శ్రీలంకకు చెందిన సమరవీర 2, విరాట్ కోహ్లీ 2, కేఎల్ రాహుల్ రెండు సెంచరీలతో ఉన్నారు.
మ్యాచ్ ఎలా సాగిందంటే..
సెంచూరియన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పట్టు బిగించింది. డీన్ ఎల్గర్ అద్భుత పోరాటంతో ప్రొటీస్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఓవైపు వికెట్లు పడుతున్నా ఓపిగ్గా బ్యాటింగ్ చేసిన డీన్ ఎల్గర్ భారీ శతకం సాధించి అజేయంగా నిలిచాడు. దీంతో రెండో రోజూ ఆట ముగిసే సమయానికి ప్రొటీస్ 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. సఫారీ జట్టు ఇప్పటికే 11 పరుగుల ఆధిక్యంలో ఉంది.
అంతుకుముందు ఓవర్‌నైట్ స్కోరు 8 వికెట్ల నష్టానికి 208 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. మరో 37 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో రాహుల్ అద్భుత శతకం చేసి భారత్ కు గౌరవమైన స్కోర్ అందించాడు. టెయిలెండర్లతో కలిసి రాహుల్ ఒక్కో పరుగూ జోడిస్తూ.. టీమిండియాకు మంచి స్కోరు అందించాడు. 164 పరుగుల దగ్గర 7వ వికెట్ కోల్పోయిన తర్వాత బుమ్రా, సిరాజ్ లతో కలిసి రాహుల్ స్కోరును 245 పరుగుల వరకూ తీసుకెళ్ళాడు. కోహ్లి 38, శ్రేయస్ అయ్యర్ 31, శార్దూల్ ఠాకూర్ 24 పరుగులు చేశారు.
సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసిన రాహుల్..
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ చేశాడు. ఈ దెబ్బకి బుధవారం సెంచూరియన్‌లో భారత్‌తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికాలో సెంచరీ చేసిన రెండో భారత వికెట్ కీపర్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. రెండో రోజు ఉదయం 70 పరుగులతో ఇన్నింగ్స్ కొనసాగించిన రాహుల్.. 137 బంతుల్లో 101 పరుగులు చేసి చివరి వికెట్ గా వెనుదిరిగాడు. తన 8వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేఎల్ 66వ ఓవర్‌లో గెరాల్డ్ కుట్జీపై మిడ్-వికెట్ వైపు సిక్సర్ కొట్టాడు. రాహుల్ కేవలం 80 బంతుల్లో సిక్సర్ కొట్టి యాభైని పూర్తి చేశాడు. తొలి రోజు 70 పరుగులతో అజేయంగా నిలిచిన కేఎల్ రాహుల్.. రెండో రోజు 101 పరుగులు పూర్తి చేసిన చివరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ 245 పరుగుల వద్ద ఆగిపోయింది. సెంచూరియన్‌లో రాహుల్‌కి ఇది వరుసగా రెండో సెంచరీ. భారత్ గత చివరి సిరీస్‌లో మూడంకెల మార్కును చేరుకున్నాడు. దీంతో ఒకే వేదికలో అధిక సెంచరీలు చేసిన మొదటి విదేశీ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement