By: ABP Desam | Updated at : 04 Jul 2022 02:56 PM (IST)
ఆ కీపర్ బ్యాటర్‌ను రెచ్చగొడితే 10 రెట్లు సత్తా చాటుతాడు (Photo Credit: Twitter)
టీమిండియాతో జరుగుతున్న నిర్ణయాత్మక టెస్టులో ఇంగ్లాండ్ జట్టును జానీ బెయిర్‌స్టో తన శతకంతో ఆదుకున్నాడు. అయితే విరాట్ కోహ్లీ.. జానీ బెయిర్ స్టోను స్లెడ్జింగ్ చేయడం.. ఆపై బెయిర్ స్టో శతకం సాధించడం చకచకా జరిగిపోయాయి. మొదట భారత బౌలర్లు మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రాల బౌలింగ్ ఆడేందుకు కాస్త ఇబ్బంది పడ్డ బెయిర్ స్టో, ఆ తరువాత గేర్ మార్చి ఆడి ఇంగ్లాండ్ స్కోరును 284కు చేర్చాడు.
ఓ దశలో భారత బౌలింగ్ దాడిని ఎదుర్కోలేక ఇంగ్లాండ్ జట్టు 84 /5 గా ఉన్నది. కోహ్లీ స్లెడ్జింగ్ చేయడం వల్లే బెయిర్ స్టో గేర్ మార్చి టెస్టు కెరీర్ లో 11వ శతకాన్ని నమోదు చేశాడని న్యూజిలాండ్ ఆల్- రౌండర్ జిమ్మి నీషమ్ అంటున్నాడు. బెయిర్ స్టో 119 బంతుల్లో 14 బౌండరీలు, 2 సిక్సర్ల సాయంతో శతకం చేయడంపై ఇంగ్లాండ్ జట్టుతో పాటు న్యూజిలాండ్ ప్లేయర్ ప్రశంసల జల్లులు కురిపించాడు. అదే సమయంలో ప్రత్యర్థి జట్టుకు సలహాలు, సూచనలు ఇచ్చాడు. బెయిర్ స్టో ఆడుతున్నప్పుడు కేవలం చూస్తూ ఉండాలని, అతడ్ని రెచ్చగొడితే 10 రెట్లు ప్రదర్శన చూపిస్తాడని నీషమ్ కామెంట్ చేశాడు.
జిమ్మీ నీషమ్ ట్వీట్..
ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లు అనవసరంగా జానీ బెయిర్ స్టోకు ఎందుకు కోపం తెప్పిస్తుంటారు. దాని వల్ల అతడి ప్రదర్శన 10 రెట్లు అధికంగా ఉంటుంది. అందుకు బదులుగా ప్రతిరోజూ గిఫ్ట్ బాస్కెట్ ఇచ్చి అతడ్ని కూల్ చేయాలని, దాంతో అతడు రెగ్యూలర్ గేమ్ మాత్రమే ఆడతాడంటూ టీమిండియా ఆటగాళ్లను ఉద్దేశించి కివీస్ ఆల్ రౌండర్ ఉచిత సలహా ఇచ్చాడు.
Why do opposing teams keep making Jonny Bairstow angry lol, he gets 10x better.
Give him a gift basket each morning, let him know you’re having his car valeted while he’s batting. Anything to keep him happy 😂 — Jimmy Neesham (@JimmyNeesh) July 3, 2022
భారత్‌లో జరుగుతున్న కీలకమైన 5వ టెస్టులో బెయిర్ స్టో ఓవరాల్‌గా 140 బంతుల్లో 106 పరుగులు చేశాడు. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ రెండు నమోదు చేసిన బెయిర్ స్టో అదే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. చివరి టెస్టులో శతకం చేసి వరుసగా మూడు టెస్టు శతకాలు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంగ్లాండ్ టీమ్ 284 పరుగులకు ఆలౌట్ కాగా, మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్లు నష్టపోయి 125 పరుగులు చేసింది. ప్రస్తుతానికి 257 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Also Read: IND Vs ENG 5th Test Highlights: మరొక్క సెషన్ నిలబడితే మ్యాచ్ మనదే - ఫాంలోకి వచ్చిన పుజారా!
Also Read: Ravindra Jadeja Century: ఎడ్జ్‌బాస్టన్‌లో 'రాక్‌స్టార్'! వరుస బౌండరీలతో జడ్డూ సెంచరీ
IND Vs ZIM: వికెట్ పడకుండా కొట్టేశారు - మొదటి వన్డేలో టీమిండియా ఘనవిజయం!
Vinod Kambli: సచిన్ అంతటోడికి ఎందుకీ దుస్థితి!
India Vs Zimbabwe: పోరాడిన జింబాబ్వే టెయిలెండర్లు - భారత లక్ష్యం ఎంతంటే?
IND Vs ZIM 1st ODI: దీపక్ చాహర్ దెబ్బ అదుర్స్ - కష్టాల్లో జింబాబ్వే!
KKR New Head Coach: కప్పులు కొట్టే కోచ్‌ను నియమించుకున్న కేకేఆర్! మెక్‌కలమ్‌తో ఖేల్ ఖతం!
iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!
Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !
WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?
Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు