అన్వేషించండి

Ishan Kishan: ఇషాన్‌ కనిపించాడోచ్‌ - కెప్టెన్‌తో కలిసే సాధన

Ishan Kishans Gym Video With Hardik Pandya:  రెండు నెలల క్రితం వ్యక్తిగత కారణాలు చెప్పి దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధాంతరంగా వచ్చేసిన ఇషాన్‌ కిషన్‌ జిమ్‌లో కసరత్తులు చేస్తూ కనిపించాడు.

Ishan Kishan Hits Gym Hard With Mumbai Indians Captain Hardik Pandya :  టీమిండియా(Team India) బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌(Ishan Kishan) చాలా రోజుల తర్వాత కనిపించాడు.  రెండు నెలల క్రితం వ్యక్తిగత కారణాలు చెప్పి దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధాంతరంగా వచ్చేసిన ఇషాన్‌ కిషన్‌ జిమ్‌లో కసరత్తులు చేస్తూ కనిపించాడు. కొద్దిరోజులుగా బరోడాలోని టీమిండియా మాజీ ఆటగాడు కిరణ్‌ మోరే అకాడమీలో ఇషాన్‌ శిక్షణ పొందుతున్నాడు. టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా( Hardik Pandya), అతడి సోదరుడు కృనాల్‌ పాండ్యా కూడా ఇదే అకాడమీలో ట్రైనింగ్‌ అయ్యారు. మూడు వారాలుగా కిరణ్‌ మోరే అకాడమీలోనే ఉంటున్న ఇషాన్‌.. జిమ్‌లో ట్రైనింగ్‌ అవుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యాతో కలిసి ఇషాన్‌ జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు. ఇషాన్‌, హార్దిక్‌ ఇద్దరూ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కే ఆడుతున్నారు. 

మానసిక కుంగుబాటేనా.?
గత ఏడాదంతా విరామం లేకుండా జట్టుతో ప్రయాణం చేసిన ఇషాన్‌ కిషన్‌.. తుది జట్టులో ఆడింది మాత్రం చాలా తక్కువ. ఎవరైనా అందుబాటులో లేకుంటేనే ఇషాన్‌కు ఛాన్స్‌లు వస్తున్నాయి తప్పితే టీమిండియా తుది జట్టులో కిషన్‌కు పెద్ద అవకాశాలు రావడం లేదు. జట్టులో చోటు దక్కకపోవడంతో ఇషాన్‌కు మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నాడని, అందుకే అతడు కొన్నాళ్లు ఆట నుంచి విరామం తీసుకునేందుకు దక్షిణాఫ్రికా సిరీస్‌ నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది. ఐపీఎల్ వరకు ఆటకు దూరంగా ఉండాలని ఇషాన్ కిషన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది ఇషాన్ కిషన్ రెండు టెస్ట్‌లతో పాటు 17 వన్డేలు, 11 టీ20లు ఆడాడు. మొత్తం 29 ఇన్నింగ్స్‌ల్లో 29.64 సగటుతో 741 పరుగులు చేశాడు. ఇందులో ఏడు అర్ధ శతకాలు ఉన్నాయి. 

బీసీసీఐ ఆగ్రహం
టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ కార్యదర్శి జై షా(BCCI secretary Jay Shah)... తీవ్ర హెచ్చరికలు చేశాడు. గాయమైతే తప్ప.. రంజీ ట్రోఫీ లేదా ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నమెంట్‌లలో ఆడకపోతే  తీవ్ర పర్యవసనాలు ఉంటాయని సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఉన్న ఆటగాళ్లను, భారత్‌-ఏ స్థాయి ఆటగాళ్లను జై షా హెచ్చరించాడు. ఈ మేరకు క్రికెటర్లకు అతడు లేఖ రాశాడు. జాతీయ జట్టులోకి ఎంపికకు దేశవాళీ క్రికెట్‌ ముఖ్యమైన కొలబద్ద అని షా స్పష్టం చేశాడు. కొందరు ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌ కంటే ఐపీఎల్‌కే ప్రాధాన్యమిస్తున్నారని.. ఇదా తాము ఊహించలేదని జై షా అన్నాడు.  భారత క్రికెట్‌కు ఎప్పుడూ దేశవాళీ క్రికెట్టే పునాదని గుర్తు చేశాడు.  తామెప్పుడూ దేశవాళీ క్రికెట్‌ను తక్కువగా చూడలేదని కూడా జై షా తెలిపాడు. భారత్‌కు ఆడాలనుకునే ప్రతి ఆటగాడు ముందు దేశవాళీ క్రికెట్లో తనను తాను నిరూపించుకోవాలని సూచించాడు. ఆటగాళ్లు దేశవాళీలో ఆడకపోతే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని షా హెచ్చరించాడు. జాతీయ జట్టులో లేకపోయినా ఇషాన్‌ కిషన్‌ రంజీ మ్యాచ్‌ల్లో ఆడకపోవడం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో జై షా చేసిన తీవ్ర హెచ్చరికలు వైరల్‌గా మారాయి.

టాప్ హెడ్ లైన్స్

Gambhir Coach Tenure: గంభీర్ హెడ్ కోచ్ పదవికి బిగ్ ప్రొటెక్షన్.. సాకింగ్ రూమర్స్ పై బిసిసిఐ క్లారిటీ!
గంభీర్ హెడ్ కోచ్ పదవికి బిగ్ ప్రొటెక్షన్.. సాకింగ్ రూమర్స్ పై బిసిసిఐ క్లారిటీ!
Rohit Sharma's Future Twist: రోహిత్ , 2027 వరల్డ్ కప్ ఫ్యూచర్ పై మాజీ క్రికెట‌ర్ మైండ్ బ్లాకింగ్ అనాల‌సిస్.. హిట్‌మ్యాన్ ఏజ్, ఎనర్జీపై వ్యాఖ్య‌లు!
రోహిత్ , 2027 వరల్డ్ కప్ ఫ్యూచర్ పై మాజీ క్రికెట‌ర్ మైండ్ బ్లాకింగ్ అనాల‌సిస్.. హిట్‌మ్యాన్ ఏజ్, ఎనర్జీపై వ్యాఖ్య‌లు!
Sarfaraz Vs Jurel IND vs SL: సర్ఫరాజ్ ఖాన్ రీ-ఎంట్రీతో ప్లేయింగ్ ఎలెవన్ లో బిగ్ డిబేట్..జురెల్, స‌ర్ఫ‌రాజ్ మ‌ధ్య‌లో పోటీ.. 15 నుంచి తొలి టెస్టు!
సర్ఫరాజ్ ఖాన్ రీ-ఎంట్రీతో ప్లేయింగ్ ఎలెవన్ లో బిగ్ డిబేట్..జురెల్, స‌ర్ఫ‌రాజ్ మ‌ధ్య‌లో పోటీ.. 15 నుంచి తొలి టెస్టు!
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Embed widget