అన్వేషించండి

Ishan Kishan World No 1 T20I Batter: అభిషేక్ కి ఝ‌ల‌క్ ఇచ్చిన‌ ఇషాన్ కిషన్.. టీ20 ర్యాంకింగ్స్ లో నంబర్ పొజిషన్ కైవ‌సం

ఐసీసీ రిలీజ్ చేసిన లేటెస్ట్ టీ20 ర్యాంకింగ్స్‌లో ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అఫీషియల్ గా వరల్డ్ నంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకున్నాడు.

 

Ishan Kishan Tops ICC T20I Batting Rankings: ఐసీసీ బుధవారం రిలీజ్ చేసిన లేటెస్ట్ ప్లేయర్ ర్యాంకింగ్స్ లో ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు. తన టీమ్‌మేట్ అభిషేక్ శర్మను వెనక్కి నెట్టి వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా టాప్ ప్లేస్ లో సెటిల్ అయ్యాడు. దాదాపు ఏడాది కాలంగా నంబర్ వన్ సీటులో కొనసాగుతున్న అభిషేక్ శర్మకు కిషన్ చెక్ పెట్టాడు. ఐర్లాండ్‌తో బెల్ఫాస్ట్‌లో జరిగిన సిరీస్ లో ఇండియా 0-2 తో ఓడిపోయినప్పటికీ, అంతకుముందు టీ20 వరల్డ్ కప్ లో కిషన్ చూపించిన మెరుపు పర్ఫార్మెన్స్ అతనికి ఈ కెరీర్ బెస్ట్ రేటింగ్‌ను తెచ్చిపెట్టింది.
 వరల్డ్ కప్ లో కిషన్ ఏకంగా 200 కి పైగా మైండ్ బ్లోయింగ్ స్ట్రైక్ రేట్‌తో 317 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో కొలంబోలో పాకిస్తాన్‌పై ఆడిన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ కూడా ఉంది. ప్రెజెంట్ అభిషేక్ శర్మ కంటే కిషన్ కేవలం ఏడు రేటింగ్ పాయింట్ల లీడ్ లో ఉన్నాడు. ఇండియా తరఫున విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ల తర్వాత టీ20 ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ ప్లేస్ సాధించిన ఫోర్త్ ఇండియన్ మెన్స్ బ్యాటర్‌గా కిషన్ ఒక ఎలైట్ క్లబ్ లో జాయిన్ అయ్యాడు.

ఐరిష్ ప్లేయర్ల జంప్.. ఆల్‌రౌండర్లలో శివం దూబే అదిరిపోయే గ్రోత్
ఇండియాపై సిరీస్ విక్టరీ కొట్టిన ఐర్లాండ్ ప్లేయర్లకు కూడా ఈ ర్యాంకింగ్స్ లో మంచి లాభం చేకూరింది. ఐరిష్ కెప్టెన్ లార్కాన్ టక్కర్ నాలుగు ప్లేసెస్ జంప్ చేసి 77వ స్థానానికి చేరగా, ఓపెనర్ రాస్ అడైర్ ఆరు స్థానాలు ఎగబాకి 84వ ర్యాంక్ అందుకున్నాడు. బౌలింగ్ విభాగంలో ఇండియా సిరీస్ లో 4 వికెట్లు తీసిన ఐర్లాండ్ సీమర్ మాథ్యూ హంఫ్రీస్ కెరీర్ బెస్ట్ రేటింగ్ తో 25వ స్థానానికి చేరుకున్నాడు. టీ20 ఆల్‌రౌండర్ల లిస్టులో ఇండియా ప్లేయర్ శివం దూబే మూడు స్థానాలు ఇంప్రూవ్ చేసుకుని సెవెంత్ ప్లేస్ లో నిలవగా, ఐర్లాండ్ ప్లేయర్లు గారెత్ డెలానీ 24వ ర్యాంక్ కు, హ్యారీ టెక్టర్ 38వ ర్యాంక్ కు దూసుకొచ్చారు.

Read Also: IND VS Eng T20 Battle: ఇంగ్లాండ్ పోరులోనూ వైభవ్ సూర్యవంశీకి దక్కని ప్లేస్.. టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ నయా ప్లాన్, ఓపెనర్లుగా మళ్లీ వారే!

టెస్టుల్లో నంబర్ వన్ సీటుపై ట్రావిస్ హెడ్  
టీ20లే కాకుండా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లోనూ ఒక మేజర్ చేంజ్ జరిగింది. ఆస్ట్రేలియా పవర్‌ఫుల్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ తన కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ వరల్డ్ నంబర్ వన్ టెస్ట్ బ్యాటర్‌గా హిస్టారికల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. నాటింగ్‌హామ్‌లో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాటర్లు హ్యారీ బ్రూక్, జో రూట్ దారుణంగా ఫెయిల్ అవ్వడం వల్ల ట్రావిస్ హెడ్‌కు ఈ లక్కీ ఛాన్స్ దక్కింది. అంతకుముందు టాప్ లో ఉన్న హ్యారీ బ్రూక్ సెకండ్ ప్లేస్ కు పడిపోగా, జో రూట్ రెండు స్థానాలు కోల్పోయి థర్డ్ ర్యాంక్ లో సెటిల్ అయ్యాడు. ట్రెంట్ బ్రిడ్జ్ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై న్యూజిలాండ్ సాధించిన బిగ్ విక్టరీ వల్ల కివీస్ బ్యాటర్ రచిన్ రవీంద్ర సెవెంత్ ప్లేస్ కు, డారిల్ మిచెల్ 11వ స్థానానికి, డెవాన్ కాన్వే ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్ కు దూసుకెళ్లారు.

జస్‌ప్రీత్ బుమ్రా నంబర్ వన్ బౌలర్.. 
టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో ఇండియా ఏస్ పేస్ స్టార్ జస్‌ప్రీత్ బుమ్రా మళ్లీ తన కింగ్ సైజ్ పొజిషన్ ను దక్కించుకున్నాడు. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ సెండ్ ప్లేస్ కు పడిపోవడంతో బుమ్రా ఒంటరిగా నంబర్ వన్ టెస్ట్ బౌలర్‌గా నిలిచాడు. కాగా మ్యాచ్ మధ్యలోనే ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రెండు స్థానాలు ఇంప్రూవ్ చేసుకుని టెస్ట్ ఆల్‌రౌండర్లలో థర్డ్ ప్లేస్ తో తన కెరీర్ ను ఎండ్ చేశాడు. మరోవైపు యాంటిగ్వాలో శ్రీలంకపై వెస్టిండీస్ సాధించిన సంచలన విజయం వల్ల వారి స్పీడ్‌స్టర్స్ షమర్ జోసెఫ్ 14వ స్థానానికి, కెమర్ రోచ్ 17వ స్థానానికి చేరారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SL Practice: లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒక రూపాయి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒక రూపాయి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Embed widget