BCCI Annual Contracts: ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ కాంట్రాక్ట్ రద్దు వివాదం ఎక్కడ మొదలైంది?
BCCI Contract contrevercy: ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ వార్షిక కాంట్రాక్ట్ లిస్ట్ సంచలనం అవుతోంది. షాన్, శ్రేయస్‌లను తప్పించాల్సిన పరిస్థితులు ఏమొచ్చాయి?
Ishan kishan shreyas iyer contract contrevercy explained ఇండియన్ క్రికెట్ టీం గురించి తాజాగా ఓ విషయం హాట్ టాపిక్ అవుతోంది. అందుకు కారణం BCCI తాజాగా ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్ నుంచి టీంఇండియా స్టార్ క్రికెటర్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ లను తొలగించడమే. గతేడాది ప్రకటించిన కాంట్రాక్ట్ లిస్ట్‌లో శ్రేయస్ అయ్యర్ B గ్రేడ్‌లో ఉండగా, ఇషాన్‌కిషన్ C గ్రేడ్‌లో ఉన్నారు. రెగ్యూలర్ టీమ్ తో ఉంటూ సిరీస్ లకు ఎంపిక అవుతున్న ఇలాంటి ప్లేయర్లని ఈసారి BCCI ఇషాన్, శ్రేయస్‌లను తప్పించాల్సిన పరిస్థితులు ఏమొచ్చాయి? అసలు వివాదానికి కారణాలు ఏంటి అంటే...
టూర్ మధ్యలో నుంచి ఇషాన్ తిరిగొచ్చేసాడు..
గతేడాది డిసెంబర్‌లో టీంఇండియా దక్షిణాఫ్రికా టూర్‌లో ఉన్నప్పుడు వ్యక్తిగత కారణాలతో టూర్ మధ్యలో నుంచి ఇషాన్ తిరిగొచ్చేసాడు. కానీ, BCCI , టీం ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్.. ఇషాన్ ని రంజీట్రోఫీలో ఆడాల్సిందిగా చెప్పారు. BCCI నింబధనల్లో ఇదీ ఒకటి. కానీ ఇషాన్ తన టీం అయిన ఝార్ఖండ్ తరఫున రంజీమ్యాచ్ ఆడకుండా రిలయన్స్ లీగ్‌లో ఆడటం, IPL లో తన టీం కెప్టెన్ హర్ధిక్ పాండ్యతో కలిసి ప్రాక్టీస్ చేయడం BCCIకి ఆగ్రహం తెప్పించాయి. అప్పటికీ BCCI మళ్ళీ చెప్పినా ఇషాన్ తన నిర్ణయం మార్చుకోలేదు. రంజీల్లో ఆడలేదు.
ఇక మరో స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ని కూడా BCCI రంజీల్లో ఆడమని చెప్పింది. కానీ తనకి వెన్ను నొప్పి కారణంగా ఆడలేనూ అంటూ శ్రేయస్ బదులిచ్చాడు. భారత క్రికెటర్ల ఫిట్‌నెస్ పై నివేదకలిచ్చే నేషనల్ క్రికెట్ అకాడమీ శ్రేయస్ గాయం పెద్దదేమీ కాదని చెప్పినా అయ్యర్ రంజీల్లో ఆడకపోగా తన IPL టీం కోల్‌కతా నైట్‌రెడర్స్ తో కలవడం బీసీసిఐ ఆగ్రహానికి కారణమయ్యాయి.
ఎంతమంది ఆటగాళ్లు రంజీలు ఆడుతున్నారు
ఇక మన ప్లేయర్లకి వరుసగా మ్యాచ్‌లు, IPL ఉండడంతో అలసిపోవడం, గాయాల పాలవ్వడం జరుగుతోంది. అసలు ఎంతమంది టీంఇండియా ఆటగాళ్లు రంజీలు ఆడుతున్నారు అనే చర్చ నడుస్తోన్నవేళ నిబంధనల ప్రకారం ఆటగాళ్లు అంతర్జాతీయమ్యాచ్‌లు లేనప్పుడు రంజీ్ల్లో ఆడాల్సిందే అంటూ బీసీసిఐ చెప్పుకొచ్చింది. మరి ఇప్పుడు శ్రేయస్, ఇషాన్ ల భవిష్యత్తు ఏంటి అనే చర్చ జరుగుతోంది. కాంట్రాక్ట్ లిస్ట్‌లో లేకపోతే వాళ్లు టీంఇండియాకు ఆడటం సాధ్యంకాదా? ఒకవేళ ఈ ఇద్దరు ప్లేయర్లు IPLలో చెలరేగి ఆడితే టీంఇండియాలోకి తిరిగి వచ్చే పరిస్తితి ఉంటుందా అంటే ఇందుకు బీసీసిఐ మాత్రమే సమాధానం చెప్పాలి. యువఆటగాళ్లకు హెచ్చరిక లాగా ఉంటుంది అని వీరిపై బీసీసిఐ కాంట్రాక్ట్ వేటు అలాగే ఉంచేస్తుందా లేక నిర్ణయం ఏమన్నా వెనక్కి తీసుకొనే అవకాశం ఉందా?
ఎందుకంటే త్వరలో T-20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో ఈ ఇద్దరు ఆటగాళ్లు కీలకమే కాబట్టి బీసీసిఐ ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందో చూడాలి.
ఏది ఏమైనా మిడిలార్డర్‌లో శ్రేయస్ లాంటి ఆటగాడు, అరంగేట్రంలోనే వన్డే్లో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడు ఇషాన్ లాంటి వారు జట్టులో ఉంటే బాగుంటుంది అన్నది ఫ్యాన్స్ మాట.