IPL Auction 2023: ఆల్ రౌండర్లపై లక్నో దృష్టి- వేలంలో ఆ ఆటగాళ్ల కోసం పోటీ పడే అవకాశం!
అరంగేట్ర ఐపీఎల్ సీజన్ లోనే ప్లేఆఫ్ కు చేరుకుంది లక్నో సూపర్ జెయింట్స్ జట్టు. ప్రస్తుతం ఐపీఎల్ మినీ వేలంలో ఏం చేయాలనే దానిపై కసరత్తు చేస్తోంది. మరి ఆ జట్టు దృష్టి ఏయే ఆటగాళ్లపై ఉందో చూద్దామా..
IPL Auction 2023: లక్నో సూపర్ జెయింట్స్.... ఐపీఎల్ లో గతేడాది అరంగేట్రం చేసిన జట్టు. కేఎల్ రాహుల్ సారధ్యంలోని లక్నో జట్టు తన మొదటి క్యాష్ రిచ్ లీగ్ లోనే ప్లేఆఫ్స్ కు చేరింది. ఎలిమినేటర్ మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయింది. ప్రస్తుతం 2023 ఐపీఎల్ కు సిద్ధమవుతోంది. 15 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అందులో ఎక్కువగా భారత దేశవాళీ ఆటగాళ్లనే అట్టిపెట్టుకుంది. ఇంకా లక్నో జట్టు 13 స్లాట్ లను పూరించాలి. అందులో నాలుగు విదేశీ స్లాట్లు ఉన్నాయి. ప్రస్తుతం లక్నో వద్ద రూ. 23.34 కోట్ల పర్సు ఉంది. కాబట్టి వారికి కావలసిన ఆటగాళ్లను ఎంచుకోవడానికి తగినంత డబ్బు ఆ జట్టు వద్ద ఉంది.
ఆల్ రౌండర్లపై దృష్టి
ప్రస్తుతం ఆ జట్టుకు ఆల్ రౌండర్ల అవసరం ఉంది. గతేడాది జట్టుతో ఉన్న జాసన్ హోల్డర్ ను ఈసారి రిలీజ్ చేసింది. అతను ఆ సీజన్ లో బ్యాట్ తో పెద్దగా రాణించలేదు. అయితే బంతితో 14 వికెట్లు పడగొట్టాడు. అలాగే దుష్మంత చమీరకు ప్రత్యామ్నాయం కూడా చూడాలి. వారి వద్ద మార్క్ వుడ్ ఉన్నాడు. అయితే అతను గాయపడితే అతని ప్లేస్ లో వేరొకరు కావాలి. అలాగే ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్లపై కూడా ఆసక్తి చూపే అవకాశం ఉంది.
వీరిపై ఆసక్తి
సూపర్ జెయింట్స్ తక్కువ ధరకు తిరిగి హోల్డర్ ను జట్టులోకి తీసుకోవాలని అనుకుంటోంది. బెన్ స్టోక్స్, సామ్ కరన్, కామెరూన్ గ్రీన్ లపై కూడా దృష్టి పెట్టినట్లు సమాచారం. అలాగే వుడ్ కు బ్యాకప్ గా సీన్ అబాట్, క్రిస్ జోర్డాన్ లను తీసుకోవచ్చు. మోహ్ సిన్ ఖాన్ కు ప్రత్యామ్నాయంగా జైదేవ్ ఉనద్కత్ ను ప్రయత్నించే అవకాశం ఉంది. అలాగే భారత దేశవాళీ లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ రమేష్ కుమార్ కూడా వారి ఆలోచనలో ఉన్నాడు.
లక్నో సూపర్ జెయింట్స్ ప్రస్తుత జట్టు
కేఎల్ రాహుల్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), ఆయుష్ బదోని, కరణ్ శర్మ, మనన్ వోహ్రా, క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), మార్కస్ స్టయినిస్, కృష్ణప్ప గౌతమ్, దీపక్ హుడా, కైల్ మేయర్స్, కృనాల్ పాండ్య, అవేష్ ఖఆన్, మోహ్ సిన్ ఖాన్, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్.
करने वार, बैठे हैं तैय्यार
— Lucknow Super Giants (@LucknowIPL) December 21, 2022
अबकी बार, होगा भौकाल। 💪#IPLAuction2023 | #BiddingWar | #BhaukaalMachaDenge pic.twitter.com/fjwNYzvQQs
#SuperFam, here's your reminder to get up, go out, stretch and play! You're welcome! 🤗#ThursdayTraining | #LucknowSuperGiants | #LSG pic.twitter.com/SS3HG6FWhl
— Lucknow Super Giants (@LucknowIPL) December 15, 2022