By: ABP Desam | Updated at : 15 Apr 2023 01:06 PM (IST)
Harry Brook ( Image Source : SRH Twitter )
Harry Brook Century: ఇంగ్లాండ్ బ్యాటింగ్ సంచలనం హ్యారీ బ్రూక్ ఐపీఎల్-16లో ఒక్క ఇన్నింగ్స్‌తో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్ లో భాగంగా బ్రూక్.. 55 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో ఈ సీజన్‌లో మూడంకెల స్కోరు చేసిన ఫస్ట్ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా బ్రూక్.. ఐపీఎల్‌లో పలు రికార్డులను నమోదుచేశాడు.
సన్ రైజర్స్ తరఫున మూడో బ్యాటర్..
కేకేఆర్‌తో సెంచరీ చేయడం ద్వారా సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున మూడంకెల స్కోరు చేసిన మూడో బ్యాటర్‌గా బ్రూక్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ ఘనత ఎస్ఆర్‌హెచ్ మాజీ సారథి డేవిడ్ వార్నర్, ఓపెనర్ జానీ బెయిర్ స్టో ల పేరిట ఉండేది. వార్నర్ భాయ్ కూడా కేకేఆర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై రెండు సెంచరీలు బాదాడు. బెయిర్ స్టో.. ఆర్సీబీ పై వంద పరుగులు కొట్టాడు.
1. డేవిడ్ వార్నర్ : 2017 ఏప్రిల్ 30న కేకేఆర్ పై - (59 బంతుల్లో 126, 10 ఫోర్లు, 8 సిక్సర్లు)
2. జానీ బెయిర్ స్టో : 2019, మార్చి 31న ఆర్సీబీపై - (56 బంతుల్లో 114, 12 ఫోర్లు 7 సిక్సర్లు)
3. డేవిడ్ వార్నర్ : 2019, మార్చి 31న ఆర్సీబీపై - (55 బంతుల్లో 100 నాటౌట్, 5 ఫోర్లు, 5 సిక్సర్లు)
4. హ్యారీ బ్రూక్ : 2023, ఏప్రిల్14న కేకేఆర్ పై (55 బంతుల్లో 100 నాటౌట్, 12 ఫోర్లు, 3 సిక్సర్లు)
Players who have scored a century in both the IPL and PSL:
— ESPNcricinfo (@ESPNcricinfo) April 14, 2023
Harry Brook
End of list. pic.twitter.com/XvmzknKGjV
పాకిస్తాన్ సూపర్ లీగ్ లో కూడా సెంచరీ..
ఐపీఎల్‌లో సెంచరీ కంటే ముందే బ్రూక్.. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) లో కూడా శతకం బాదాడు. పీఎస్ఎల్ లో లాహోర్ ఖలాండర్స్ తరఫున ఆడుతున్న అతడు.. గతేడాది ఫిబ్రవరి 19న సెంచరీ చేశాడు. లాహోర్ - ఇస్లామాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్రూక్.. ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి 49 బంతుల్లోనే 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 102 రన్స్ చేశాడు. కాగా ఇప్పటివరకూ పీఎస్‌ఎల్ తో పాటు ఐపీఎల్ లో సెంచరీ చేసిన ఏకైక బ్యాటర్ బ్రూక్. క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్ వంటి దిగ్గజాలు.. డుప్లెసిస్, రిలీ రూసో వంటి టీ20 స్టార్ బ్యాటర్లు అక్కడా ఇక్కడా ఆడినా వారికి కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు.
🪄 🔙 pic.twitter.com/D5NlyGB6Wb
— SunRisers Hyderabad (@SunRisers) April 14, 2023
కాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. బ్రూక్ సెంచరీతో పాటు కెప్టెన్ మార్క్‌రమ్ (50), అభిషేక్ శర్మ (32) రాణించారు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేకేఆర్.. 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా కెప్టెన్ నితీశ్ రాణా (75), రింకూ సింగ్ (58 నాటౌట్) లు రాణించడంతో లక్ష్యానికి చేరువగా వచ్చింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఫలితంగా ఎస్ఆర్‌హెచ్.. 23 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. హైదరాాబాద్‌కు ఇది వరుసగా రెండో విజయం కాగా కేకేఆర్ ఆడిన నాలుగు మ్యాచ్ లలో రెండు గెలిచి రెండింట్లో ఓడింది.
CSK Vs GT, Final: చెన్నై కప్‌ను వదిలేసిందా - ఎంత పని చేశావు చాహర్!
CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?
CSK Vs GT: ఫైనల్లో టాస్ చెన్నైదే - ఛేజింగ్‌కే మొగ్గు చూపిన ధోని!
IPL Record: ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక నోబాల్స్ ఈ సీజన్‌లోనే - ఎన్ని వేశారంటే?
World Test Championship: 'WTC ఫైనల్' జట్లను ఫైనల్ చేసిన టీమ్‌ఇండియా, ఆసీస్!
Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !
AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా
PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!
Andhra News : జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం !