GT vs DC Live: నెంబర్ 1 వర్సెస్ నెంబర్ 10 - ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్ ఓడిన గుజరాత్
IPL 2023: ఐపీఎల్-16లో నేడు గుజరాత్ టైటాన్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ లు అహ్మదాబాద్ వేదికగా తలపడుతున్నాయి.
GT vs DC Live: ఐపీఎల్ -16లో నేడు మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరుగనుంది. టేబుల్ టాపర్స్‌గా ఉన్న గుజరాత్ టైటాన్స్.. అట్టడుగన ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను ‘ఢీ’కొనబోతున్నది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియం వేదికా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ నెగ్గి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ మొదలు ఫీల్డింగ్ చేయనున్నది.
ఈ మ్యాచ్‌లో గుజరాత్ గత మ్యాచ్ లో బరిలోకి దిగిన టీమ్ తోనే ఆడుతుండగా ఢిల్లీ మాత్రం మిచెల్ మార్ష్ గాయపడటంతో అతడి స్థానంలో రిలీ రూసో ఆడుతున్నాడు.
ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లో ఆడిన 8 మ్యాచ్‌లలో 6 గెలిచి రెండింట్లో మాత్రమే ఓడి 12 పాయింట్లతో నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది. దీనికి పూర్తి విరుద్ధంగా ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచ్‌లు ఆడి రెండు మాత్రమే గెలిచి ఆరింటిలో ఓడి పాయింట్ల పట్టికలో పదో స్థానంలో ఉంది.
🚨 Toss Update 🚨@DelhiCapitals win the toss & elect to bat first against @gujarat_titans.
— IndianPremierLeague (@IPL) May 2, 2023
Follow the match ▶️ https://t.co/VQGP7wSZAj #TATAIPL | #DCvGT pic.twitter.com/PwyhnFUFbY
ప్లేఆఫ్స్ దిశగా దూసుకుపోతున్న గుజరాత్.. బలహీనంగా ఉన్న ఢిల్లీపై గెలిచి నెంబర్ వన్ పొజిషన్‌ను మరింత స్ట్రాంగ్ చేసుకోవాలని భావిస్తున్నది. ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌ను గుజరాత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. నేటి మ్యాచ్‌లో కూడా అదే ఫలితాన్ని రిపీట్ చేయాలని కోరుకుంటున్నది. ప్రస్తుతం ఆ జట్టు ఫామ్ చూస్తే అదేం పెద్ద టాస్క్ కాదు. బ్యాటింగ్‌లో గిల్, హార్ధిక్ పాండ్యా, విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్ లతో ఆ జట్టు పటిష్టంగా ఉంది. బౌలింగ్ లో షమీ, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ లు దుమ్ము రేపుతున్నారు.
మరోవైపు ఢిల్లీ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. బ్యాటింగ్ లో డేవిడ్ వార్నర్ రాణిస్తున్నా గత మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. మిచెల్ మార్ష్, సాల్ట్ లు ఫామ్ ను అందుకోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఆ తర్వాత వస్తున్న బ్యాటర్లందరూ ఏదో చుట్టపు చూపునకు వచ్చినట్టు వచ్చి పోతున్నారు. అక్షర్ పటేల్ మీద ఆ జట్టు ఆశించినదానికంటే ఎక్కువ ఆధారపడుతున్నది. బౌలింగ్ లో కూడా అన్రిచ్ నోర్జే, కుల్దీప్ యాదవ్ వంటి అంతర్జాతీయ స్టార్లు పెద్దగా ప్రభావం చూపడంలేదు.
హెడ్ టు హెడ్ : ఐపీఎల్ లో ఈ రెండు జట్ల మధ్య గత సీజన్ లో ఒకటి ఈ సీజన్ లో మరో మ్యాచ్ జరిగాయి. రెండింటిలోనూ గుజరాత్ దే గెలుపు.
తుది జట్లు :
గుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా, అభినవ్ మనోహర్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, జోషువా లిటిల్
ఢిల్లీ క్యాపిటల్స్ : డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్, రిలీ రూసో, మనీష్ పాండే, ప్రియమ్ గార్గ్, అక్షర్ పటేల్, రిపల్ పటేల్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్జ్, ఇషాంత్ శర్మ