By: ABP Desam | Updated at : 24 May 2023 08:41 AM (IST)
చెన్నై సూపర్ కింగ్స్ ( Image Source : CSK Twitter )
CSK In IPL Finals: బ్యాటింగ్ వేనుమా బ్యాటింగ్ ఇరుక్కు..! బౌలింగ్ వేనుమా బౌలింగ్ ఇరుక్కు..! ఫీల్డింగ్ వేనుమా సూపర్ క్యాచ్‌లు పట్టే ఫీల్డర్స్ ఇరుక్కు..! ఫైనల్లీ నెంబర్ వన్ కెప్టెన్సీ వేనుమా వరల్డ్ నెంబర్ వన్ కెప్టెన్ ఇరుక్కు..! ఇన్నీ ఇరుక్కులున్నాయి కాబట్టే ఐపీఎల్‌లో ఆ జట్టు మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ అయింది. ఒక్కసారైనా ఐపీఎల్ ఫైనల్స్‌కు వెళ్లాలని.. కెరీర్ ముగిసేలోపు ఒక్కసారి కప్‌ను ముద్దాడాలని కొన్ని టీమ్స్, వందలాది మంది ప్రపంచ స్థాయి ఆటగాళ్లు 16 ఏండ్లుగా ట్రోఫీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా వారెవరికీ సాధ్యంకానిది చెన్నై సూపర్ కింగ్స్‌కు అలవోకగా సాధ్యమవుతున్నది. ఒక్కటా రెండా.. ఆ జట్టు 14 సీజన్లు ఆడితే పది ఫైనల్స్. నాలుగు ట్రోఫీలు. అదిదా సీఎస్కే.. అదిదా ధోని..!
ఐపీఎల్-16 లో ఫైనల్‌కు చేరిన సీఎస్కే.. గతేడాది మాత్రం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ధోని ఆఖరు సీజన్ (?) అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ జట్టు అద్భుతం చేసింది.
ఈ అద్భుతాల వెనుక..
వాస్తవానికి ఈ ఏడాదికి ముందు 2022లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన చూసినవారికెవరికైనా ఈ జట్టు ఫైనల్స్ చేరడం గొప్పే అవొచ్చు. కానీ కచ్చితమైన ప్రణాళిక, దానిని తూచా తప్పకుండా అమలుచేసే టీమ్ మేనేజ్మెంట్, ఫీల్డ్ లో అవసరాలను బట్టి వ్యూహాలను మార్చే సారథి, ఆటగాళ్లపై నమ్మకం, అన్నింటికీ మించి ఆటగాళ్ల రెండు నెలల కష్టం ఇందులో దాగుంది. నిన్న గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ ముగిశాక ధోని చెప్పిన మాట కూడా అదే.. ‘మేం జనవరి ఎండింగ్ లో మా క్యాంప్ స్టార్ట్ చేశాం. గడిచిన రెండు, మూడు నెలలుగా కష్టపడుతూనే ఉన్నాం. దాని ఫలితమే ప్రస్తుతం వస్తున్న విజయాలు’ అని తెలిపాడంటే సీఎస్కే ఏ స్థాయిలో ప్రిపేర్ అయిందో అర్థం చేసుకోవచ్చు.
"IPL is too big to say it's just another final. Used to be 8 top teams, now it's 10. I won't say it's just another final. It's hard work of 2 months. Everybody has contributed."
— Chennai Super Kings (@ChennaiIPL) May 23, 2023
వనరులు లేకున్నా..
సీఎస్కేకు చాలాకాలంగా డెత్ ఓవర్లలో సేవలందించిన డ్వేన్ బ్రావో లేడు. గతేడాది రాణించిన ముఖేశ్ చౌదరి సీజన్‌కు ముందే తప్పుకున్నాడు. న్యూజిలాండ్ పేసర్ కైల్ జెమీసన్‌దీ అదే పరిస్థితి. దీపక్ చాహర్ ఉన్నా అతడి ఫిట్నెస్‌పై అనుమానాలు. ఎటు చూసినా నైరాశ్యమే. కానీ ధోని అధైర్యపడలేదు. అనుభవం లేని బౌలర్లైనా తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సింగ్, రాజ్యవర్ధన్ హంగర్గేకర్, మతీశ పతిరానలను నమ్మాడు. తొలి రెండు మూడు మ్యాచ్‌లలో విఫలమైనా వారికి అండగా నిలిచాడు. ఈ ఏడాది సీఎస్కే బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న బ్రావో.. అంతగా అనుభవం లేని ఈ కుర్రాళ్లను తీర్చిదిద్దాడు.
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో ధారాళంగా పరుగులిచ్చిన తుషార్.. ఈ సీజన్‌లో ఒక దశలో పర్పుల్ క్యాప్ హోల్డర్ అయ్యాడు. ఆరంభంలో తడబడ్డా సీజన్ మధ్యలోకి వచ్చేసరికి పతిరాన సీఎస్కేకు డెత్ బౌలర్‌గా స్థిరపడ్డాడు. కొన్నిరోజులు తొడ గాయం కారణంగా పలు మ్యాచ్‌లకు దూరమైన చాహర్ కూడా కలవడం చెన్నైకి కలిసొచ్చింది. స్పిన్ విభాగంలో సీనియర్ జడ్డూ మార్గదర్శకత్వంలో మహీశ్ తీక్షణ కూడా రాణించి సీఎస్కే విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
Anbuden ➡️ Ahmedabad with a million whistles! 🥳#GTvCSK #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/Tyjhxd1Nsf
— Chennai Super Kings (@ChennaiIPL) May 23, 2023
బ్యాటింగ్‌లో అద్భుతాలు..
ఈ సీజన్‌లో చెన్నై బ్యాటింగ్‌కు మూలస్థంబాలుగా నిలిచింది ఓపెనర్లే. ఐపీఎల్-16 లో డెవాన్ కాన్వే 625 పరుగులు చేస్తే రుతురాజ్ గైక్వాడ్.. 564 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ కలిసి సీఎస్కేకు వెయ్యి పరుగులకు పైగా చేశారంటేనే వీళ్లు ఆ టీమ్ బ్యాటింగ్ ఆర్డర్‌పై ఎంత ప్రభావం చూపారో అర్థం చేసుకోవచ్చు. రూ. 16.25 కోట్లు పెట్టి కొన్న బెన్ స్టోక్స్ రెండు మ్యాచ్ లే ఆడి తర్వాత గాయం కారణంగా తప్పుకున్నా.. ధోని ఆ స్థానాన్ని అజింక్యా రహానేతో భర్తీ చేయించాడు. సీజన్ చివర్లో విఫలమవుతున్నా ఐదారు మ్యాచ్‌లలో రహానే రఫ్ఫాడించాడు.
ఇక అన్నింటికీ మించి కొత్త కుర్రాడు శివమ్ దూబేను ధోని ఉపయోగించుకున్న తీరు అత్యద్భుతం. మంచినీళ్లు తాగినంత ఈజీగా సిక్సర్లు కొట్టే ఈ కుర్రాడు.. చెన్నై మిడిలార్డర్‌కు వారధిలా నిలిచాడు. ఆఖర్లో వచ్చినా జడేజా - ధోనీలు తమ మెరుపులతో ఆ జట్టు స్కోరుకు వేగం పెంచారు. సీజన్ మొత్తం విఫలమైనా అంబటి రాయుడు, మోయిన్ అలీ వంటి ప్లేయర్లను టీమ్ మేనేజ్మెంట్ పక్కనబెట్టలేదు. ఇదే ఆ జట్టు సక్సెస్ మంత్ర అయింది.
MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!
Team India New Jersey: డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచే కొత్త జెర్సీలు - ఘనంగా ఆవిష్కరించిన అడిడాస్
WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్ వేదిక, బ్రాడ్కాస్ట్, జట్ల వివరాలివే
Annamalai on Jadeja: సీఎస్కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
Realme 11 Pro: 200 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్మీ 11 ప్రో సిరీస్ - త్వరలో మనదేశంలో కూడా - ఎప్పుడు రానుందంటే?
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?
YS Viveka Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ - సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే !
Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!
Narasimha Naidu Re Release : బాలకృష్ణ బర్త్ డేకు 'నరసింహ నాయుడు' రీ రిలీజ్