అన్వేషించండి

Kabmli Viral Video: నర్స్ తో స్టెప్పులేసిన వినోద్ కాంబ్లీ.. తాజా వీడియో వైరల్..  అనారోగ్యం నుంచి కోలుకుంటున్న మాజీ క్రికెటర్

2000 తర్వాత భారత జట్టుకు దూరమైన మాజీ క్రికెటర్ కాంబ్లీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు అంతంతమాత్రం ఆర్థికస్థితితో సతమతం అవుతున్నాడు. 

Vinod Kambli News: భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగవుతోంది. మూత్ర ఇన్ఫెక్షన్, మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ఆస్పత్రిలో చేరిన ఈ మాజీ క్రికెటర్ తాజాగా కోలుకుంటున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇక, తాజాగా అతను నర్స్ తో కలిసి హుషారుగా స్టెప్పులు వేసిన వీడియతో తెగ వైరలైంది. తాను బాగానే ఉన్నట్లు, క్రమంగా కోలుకుంటున్నట్లు అభిమానులకు భరోసా కలిగేలా ఈ వీడియో ఉంది. ఈ వీడియలో చక్ దే ఇండియా పాటకు డ్యాన్స్ చేసిన కాంబ్లీ.. నర్స్ తో కలిసి హుషారుగా పాటలకు స్టెప్పులేస్తూ కనిపించాడు. అతడిని చూస్తుంటే ఏమాత్ర అసౌకర్యంగా లేనట్లు కనిపిస్తోంది. దీంతో కాంబ్లీ అభిమానులు హేపీగా ఫీలవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. కాంబ్లీ త్వరగా కోలుకోవాలని కోరుతూ, షేర్లు, లైకులతో ఈ వీడియోను అభిమానులు షేర్ చేస్తున్నారు. 

దీన స్థితిలో కాంబ్లీ....
మరోవైపు ఇటీవలే కోచ్ రామకాంత్ అచ్రేకర్ స్మారక కార్యక్రమం కోసం ఇటీవల సచిన్, కాంబ్లీ ఒకే వేదికను పంచుకున్నారు. అయితే కనీసం లేచి నిలబడలేని స్థితిలో కాంబ్లీ కనిపించడంతో అభిమానులు షాకయ్యారు. బీసీసీఐ మాజీ క్రికెటర్లకు ఇచ్చే రూ.30 వేల పెన్షన్ పైనే బతుకు వెళ్ల దీస్తున్నట్లు వివరించాడు. అయితే కాంబ్లీ దీన స్థితిపై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించాడు. కాంబ్లీకి సాయం చేసేందుకు 1983 గెలిచిన భారత జట్టు సభ్యులంతా సిద్ధంగా ఉన్నామని, అయితే కాంబ్లీ ఒక షరతుకు ఒప్పుకోవాలని కపిల్ సూచించాడు. వెంటనే అతను రిహాబిలిటేషన్ సెంటర్ కు వెళ్లాలని కోరాడు. తాగుడు వ్యసనానికి బానిస కావడంతో కాంబ్లీ ఆరోగ్యం క్షీణించిదన్న ప్రచారం ఉంది.  తాజాగా దీనిపై కాంబ్లీ స్పందించాడు. తాను కపిల్ పెట్టిన షరతు ప్రకారం రిహబిలిటేషన్ సెంటర్ కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాని పేర్కొన్నాడు. ఇటీవల తన ఆరోగ్యం చాలా పాడైపోయిందని, తన భార్య దగ్గరుండి మరీ చూసుకుంటుందని వివరించాడు. ఇప్పటికే మూడు ఆస్పత్రులకు తనను తీసుకెళ్లిందని, మూత్రం ఆగకపోవడమనే సమస్యను తను ఎదుర్కొంటున్నట్లు వెల్లడించాడు. తన కుమారుడు క్రిస్టియానో, పదేళ్ల కూతురు నిత్యం తనను అంటి పెట్టుకుని చూసుకుంటున్నారని వివరించాడు 

సచిన్ ఎంతో చేశాడు..
మరోవైపు తన చిన్ననాటి స్నేహితుడు సచిన్ ను తాను గతంలో అపార్థం చేసుకున్నట్లు గతంలో కాంబ్లీ వివరించాడు. నిజానికి సచిన్ తనకెంతో సాయం చేశాడని, రెండుసార్లు హాస్పిటల్ బిల్లులు కూడా చెల్లించినట్లు తెలిపాడు. ఒకదశలో సచిన్ తన కోసం ఏమీ చేయలేదని నిరాశపడ్డానని, అయితే తనకోసం చేయాల్సిందంతా సచిన్ చేశాడని వివరించాడు. కెరీర్ సమయంలో ఎలా ఆడాలో సచిన్ చెప్పేవాడని గుర్తు చేసుకున్నాడు. తన ప్రొత్సాహం వల్లే జట్టులోకి తొమ్మిది సార్లు కంబ్యాక్ చేసినట్లు వెల్లడించాడు. క్రికెటర్లకు గాయాలు ఆటలో సహజమని, వాటిని తట్టుకుని ముందుకు వెళ్లినవారే నిలబడుతారని పేర్కొన్నాడు. వాంఖడే వేదికగా తను చేసిన డబుల్ సెంచరీని ఎప్పటికీ మర్చిపోలేనని కాంబ్లీ తెలిపాడు.  1991-2000 మధ్య అంతర్జాతీయ క్రికెట్ ఆడిన కాంబ్లీ.. 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. 17 టెస్టుల్లో 54 సగటుతో 1084 పరుగులు చేశాడు. ఇందుల నాలుగు సెంచరీలు ఉండగా, అత్యధిక స్కోరు 227. ఇక 104 వన్డేల్లో 32.59 సగటుతో 2477 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండగా, అత్యధిక స్కోరు 106 కావడం విశేషం. 

Also Read: Ind Vs Aus Test Series: సిడ్నీ టెస్టులో కోహ్లీ, విరాట్ తప్పుకుంటారా? తప్పిస్తారా? సెలెక్టర్లపై మాజీ క్రికెటర్ ఫైర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Happy New Year 2025: అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
SCR: 'రత్నాచల్' ఎక్స్ ప్రెస్ టైమింగ్ మారింది తెలుసా! - జనవరి 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు, ద.మ రైల్వే కీలక ప్రకటన
'రత్నాచల్' ఎక్స్ ప్రెస్ టైమింగ్ మారింది తెలుసా! - జనవరి 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు, ద.మ రైల్వే కీలక ప్రకటన
Dil Raju Reply To KTR:   చిత్ర పరిశ్రమను రాజకీయాలకు వాడుకోవద్దు - కేటీఆర్‌కు దిల్ రాజు ఘాటు రిప్లై
చిత్ర పరిశ్రమను రాజకీయాలకు వాడుకోవద్దు - కేటీఆర్‌కు దిల్ రాజు ఘాటు రిప్లై
New Year 2025: న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో
న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ADR Report on Chief Ministers Assets | దేశంలోనే నిరుపేద ముఖ్యమంత్రి ఈమెRam Charan Participaes in Unstoppable 4 | బాలయ్య, రామ్ చరణ్ సందడిపై భారీగా అంచనాలుKA Paul Interview on Allu Arjun | అంబేడ్కర్ ని తిట్టినోళ్లు యూజ్ లెస్ ఫెలోస్ | ABP DesamDeputy CM Pawan kalyan on Allu Arjun | సంధ్యా థియేటర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Happy New Year 2025: అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
SCR: 'రత్నాచల్' ఎక్స్ ప్రెస్ టైమింగ్ మారింది తెలుసా! - జనవరి 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు, ద.మ రైల్వే కీలక ప్రకటన
'రత్నాచల్' ఎక్స్ ప్రెస్ టైమింగ్ మారింది తెలుసా! - జనవరి 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు, ద.మ రైల్వే కీలక ప్రకటన
Dil Raju Reply To KTR:   చిత్ర పరిశ్రమను రాజకీయాలకు వాడుకోవద్దు - కేటీఆర్‌కు దిల్ రాజు ఘాటు రిప్లై
చిత్ర పరిశ్రమను రాజకీయాలకు వాడుకోవద్దు - కేటీఆర్‌కు దిల్ రాజు ఘాటు రిప్లై
New Year 2025: న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో
న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో
KTR Quash Petition: కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై  తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
5000 Note in New Year: 2025లో  రూ. 5వేల నోటు రిలీజ్ - ఆర్బీఐ వర్గాలు ఇస్తున్న క్లారిటీ ఇదే
2025లో రూ. 5వేల నోటు రిలీజ్ - ఆర్బీఐ వర్గాలు ఇస్తున్న క్లారిటీ ఇదే
Kodali Nani aide arrested: అస్సాం పారిపోయిన కొడాలి నాని రైట్ హ్యాండ్ - పట్టుకొచ్చిన పోలీసులు !
అస్సాం పారిపోయిన కొడాలి నాని రైట్ హ్యాండ్ - పట్టుకొచ్చిన పోలీసులు !
Perni Nani In Ration Rice Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
Embed widget