Hardik Pandya: విండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా ఎమోషన్ అయ్యాడా?
Hardik Pandya: వెస్టిండీస్‌తో తొలి టీ20 ఆరంభానికి ముందు టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా భావోద్వేగానికి గురయ్యాడు.
Hardik Pandya: వెస్టిండీస్‌తో తొలి టీ20 ఆరంభానికి ముందు టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా భావోద్వేగానికి గురయ్యాడనే వీడియో వైరల్ అవుతోంది. ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో తొలి టీ 20 మ్యాచ్ గురువారం జరిగింది. టాస్ ఈ సందర్భంగా జాతీయ గీతం ఆలపించే సమయంలో పాండ్యా భావోద్వేగానికి గురైనట్టు అందులో ఉంది. ఉబికి వస్తున్న కన్నీరును ఆపుకోలేకపోయాడని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టాడు. కన్నీటిని తుడుచుకుంటూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన ఫొటోను క్రికెట్ అభిమాని ముఫద్ధల్ ఓహ్రా ట్వీట్ చేస్తూ జాతీయగీతం ఆలపిస్తుండగా హార్థిక పాండ్యా ఎమోషనల్ అయ్యాడంటూ ట్వీట్ చేశాడు.
దీనిపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఓహ్రా.. ఓహో అలా చేయొద్దంటూ కామెంట్ చేస్తున్నారు. కొందరు స్పందిస్తూ హార్థిక్ పాండ్యాలో మంచి నటుడు ఉన్నాడంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు ఓహ్రాపై మండిపడుతున్నారు. పాండ్యా కళ్లపై పడిన దుమ్ము తుడుచుకుంటుంటే ఎమోషనల్ అయ్యాడా అంటూ ప్రశ్నిస్తున్నారు. కొంత మంది ఏకంగా మొసలి కన్నీరు కారుస్తున్నాడంటూ మండిపడుతున్నారు.
Hardik Pandya got emotional during the national anthem. pic.twitter.com/5VH2kM8cdf
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 3, 2023
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి టీ20లో విండీస్ చేతిలో భారత్ 4 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేసింది. భారత్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 10 పరుగులు అవసరమవ్వగా, విండీస్ బౌలర్ షెపర్డ్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
తొలి మ్యాచ్‌లోనే మెరిసిన తిలక్ వర్మ
తొలి మ్యాచ్‌లో తెలుగు ఆటగాడు తిలక్ వర్మ 39 పరుగులు చేసి రాణించాడు. టీమిండియా ఇన్నింగ్స్‌లో తిలక్ వర్మ మినహా మిగతా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. విండీస్ బౌలరల్లో మెకాయ్, హోల్డర్, షెపర్డ్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన విండీస్.. కెప్టెన్ పావెల్(48), పూరన్(41) పరుగులతో రాణించడంతో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. రెండో టీ20 ఆగస్టు6న గయానాలో జరగనుంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial