Ind Vs Sa Final Live Updates: టీ20 ప్రపంచ కప్ విజేతగా టీమిండియా, 2వసారి మెగా ట్రోఫీ కైవసం
Ind Vs Sa World Cup Final:భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే టీ 20 ప్రపంచకప్ ఫైనల్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
LIVE
Background
T20 World Cup 2024 Final: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఈ జట్లు తలపడతాయని చాలా మంది అనుకుని ఉండరు. భారత్, సౌతాఫ్రికా రెండు జట్లు కూడా ఓటమి లేకుండా ఈ ఫైనల్ వరకూ దూసుకువచ్చాయి. సౌతాఫ్రికా ఓ ఐసీసీ ఈవెంట్ ఫైనల్ ఆడుతుండటం ఇదే మొదటిసారి కాగా...భారత్ కు ఐసీసీ ఈవెంట్స్ లో ఫైనల్ ఆడటం ఇది 13వసారి.
ఆస్ట్రేలియా పేరు మీద మాత్రమే ఇన్నాళ్లూ ఉన్న ఈ అత్యధిక ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్ రికార్డు భారత్ నిన్న ఇంగ్లండ్ పై విజయంతో సమం చేసింది. అయితే టీ20 వరల్డ్ కప్పును భారత్ గెలిచింది కేవలం ఒక్కసారి మాత్రమే అది కూడా 2007లో. టీ2౦ వరల్డ్ కప్ ను మొదలు పెట్టిన ఆ ఏడాదే ఫస్ట్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది. మహేంద్ర సింగ్ ధోని అనే కెప్టెన్ భారత్ కోసం పుట్టుకొచ్చింది అక్కడి నుంచే. ఆ తర్వాత ఇన్నేళ్లలో ఎప్పుడూ భారత్ మరో కప్పును ముద్దాడలేదు.
2022 టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయిన...2023 వన్డే వరల్డ్ కప్ ను ఫైనల్లో ఆస్ట్రేలియాకు కోల్పోయింది. తిరిగి ఏడాది గ్యాప్ లో ఇప్పుడు మరో ఐసీసీ ఈవెంట్ లో ఫైనల్ కు చేరుకోవటం ద్వారా భారత్ ఈసారైనా ట్రోఫీ అందుకోవాలనే కసితో ఉంది. ధోని తర్వాత టీ20ల్లో వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ గా రోహిత్ శర్మ ఘనత సాధించాలని ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. అయితే సౌతాఫ్రికాను తక్కువ అంచనా వేయలేం. ఆ టీమ్ క్రికెట్ ఆడటం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎన్నో సార్లు సెమీస్ గండాన్ని దాటలేకపోయింది.
చోక్ అయిపోవటమే...ఎక్కడ లేని దురదృష్టం వెంటాడమో ఇన్నేళ్లుగా ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్న సౌతాఫ్రికా తొలిసారి ఓ ఐసీసీ ఈవెంట్ ఫైనల్ ఆడుతోంది. సో మనకంటే సౌతాఫ్రికా మరింత పట్టుదలతో సౌతాఫ్రికా ఉంటుందనే విషయాన్ని మర్చిపోకూడదు. ఓపెనర్ డికాక్, మార్ క్రమ్, క్లాసెన్ లాంటి బ్యాటర్లు రబాడా, మార్కో జాన్సన్, షంసీ, కేశవ్ మహరాజ్ లాంటి బౌలర్లే ఆయుధంగా సౌతాఫ్రికా తమ శక్తి మేర భారత్ ను ఢీ కొట్టడం ఖాయం. మరి ఈ రెండు కొదమసింహాల్లో ఎవరు విజేతగా నిలుస్తారో తెలియాలంటే శనివారం రాత్రి 8 గంటలకు బార్బడోస్ లో జరగబోయే ఫైనల్ మ్యాచ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
ఇదే నా చివరి టీ20 వరల్డ్ కప్, చివరి టీ20 మ్యాచ్: విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ ఇదే తన చివరి టీ20 వరల్డ్ కప్ అని, చివరి టీ20 మ్యాచ్ అని సంచలన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై నెగ్గి టీ20 వరల్డ్ కప్ 2024 విజేతగా నిలిచిన తరువాత కోహ్లీ మాట్లాడుతూ పొట్టి ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
India Lift T20 World Cup 2024: ఆఖరికి సాధించా: రోహిత్ శర్మ ఎమోషనల్ మోమెంట్ చూశారా?
Team India Captian Rohit Sharma Got Emotional After won T20 world cup 2024: టీ 20 వరల్డ్ కప్ 2024 గెలిచిన తర్వాత రోహిత్ శర్మ తనలో ఉన్న ఎమోషనల్ మొత్తాన్ని చూపించాడు. గ్రౌండ్‌లో పడుకొని నేలపై కొట్టిగా కొడుతూ మొత్తానికి సాధించా... మొదటి వరల్డ్‌కప్‌లో భాగమైన ఉన్నా... తన కేరీర్‌లో ఆడిన ఆఖరి వరల్డ్‌కప్‌ను తన సారథ్యంలోనే గెలిచానన్న ఆనందం భావోద్వేగం రోహిత్‌లో కనిపించింది.
Moment of the day from #RohitSharma ❤️ pic.twitter.com/1eMcUypFr7
— R a J i V (@RajivAluri) June 29, 2024
India Lift T20 World Cup 2024: ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ బుమ్రా, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కోహ్లీ
Player of the Tournament Bumrah Player of the Match Kohli: టీ 20 వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ధి టోర్నమెంట్ దక్కించుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కోహ్లీకి వరించింది.
India Lift T20 World Cup 2024: ఇదే నా లాస్ట్ టీ 20 వరల్డ్ కప్: కోహ్లీ
Virat Kohli Played His Last T20 World Cup : అనుకున్నట్టే జరిగింది. ఇదే తన లాస్ట్ టీ 20 వరల్డ్ కప్ అని కోహ్లీ చెప్పేశాడు. న్యూ జనరేషన్ ఈ బాధ్యతలు తీసుకోవాల్సిన టైం వచ్చిందన్నారు. ఇది ఆఖరి టీ20 వరల్డ్ కప్ కావడంతో తాను అంత ఎమోషన్ అయ్యాను అన్నాడు విరాట్
India Lift T20 World Cup 2024: ఇది కదా గ్రాండ్ ఫేర్‌వెల్- రాహుల్, విరాట్, రోహిత్‌కు ఘన వీడ్కోలు!
2024 టీ 20 వరల్డ్‌కప్ గెలవడం చిన్న విషయం కాదు. ఇప్పుడు ఉన్న జట్టులో చాలా మంది వచ్చే టీ 20 వరల్డ్‌కప్ నాటికి ఉండరు వాళ్లందరికీ ఇదే గ్రాండ్ పేర్‌వెల్‌గా చెప్పవచ్చు. హెడ్‌కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్‌కు ఇదే లాస్ట్ సిరీస్. రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ వచ్చే వరల్డ్ కప్ ఏది కూడా అదే పరిస్థితి లేదు. వీళ్లతోపాటు 35 ఏళ్లు దాటిన చాలా మంది క్రికెటర్లకు ఇదే ఆఖరి వరల్డ్ కప్. అందుకే విజయం సాధించిన తర్వాత ఎప్పుడూ తన ముఖంలో భావోద్వేగాలు రాహుల్ ద్రవిడ్ ముఖంలో కనిపించాయి.