అన్వేషించండి
Advertisement
India vs South Africa: నిప్పులు చెరుగుతున్న సిరాజ్, ప్రోటీస్ బాటింగ్ ఆర్డర్ కకావికలం
Mohammed Siraj On Fire: సఫారీలతో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా పేసర్లు విజృంభిస్తున్నారు. మహ్మద్ సిరాజ్ వరుసగా నాలుగు వికెట్లు తీసి ప్రొటీస్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు.
India vs South Africa 2nd Test Live updates: సఫారీలతో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా (Team India) పేసర్లు విజృంభిస్తున్నారు. మహ్మద్ సిరాజ్ వరుసగా నాలుగు వికెట్లు తీసి ప్రొటీస్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. మార్‌క్రమ్ (2), డీన్ ఎల్గర్ (4), టోనీ డిజోర్జి (2), బెండింగ్‌హామ్(12) మార్కో జాన్సన్(0) పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో అవుటయ్యరు. ట్రిస్టన్ స్టబ్స్ (3) బుమ్రా బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో దక్షిణాఫ్రికా 34 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.
టాస్ ప్రొటీస్‌దే.
ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన సఫారీ జట్టు కెప్టెన్ డీన్ ఎల్గర్ బ్యాటింగ్‌ఎంచుకున్నాడు. కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్ ఆడుతోన్న ఎల్గర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సౌతాఫ్రికా తరఫున ట్రిస్టన్ స్టబ్స్ అరంగేట్రం చేశాడు. రెగ్యులర్ కెప్టెన్ టెంబా బావుమా గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. గెరాల్డ్ కోయిట్జీ స్థానంలో లుంగి ఎంగిడి.. కీగన్ పీటర్సెన్‌కు బదులు కేశవ్ మహరాజ్ తుది జట్టులోకి వచ్చారు. భారత్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్‌కు బదులు రవీంద్ర జడేజా, ముకేశ్ కుమార్ తుది జట్టులోకి వచ్చారు.
తొలి టెస్ట్ ఇలా
ఇన్నింగ్స్ 32 పరుగులు తేడాతో జట్టు ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. తొలిత బ్యాటింగ్ చేసిన ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 245 పరుగులకు పరిమితమైంది. జట్టులో విరాట్ కోహ్లీ (38), శ్రేయాస్ అయ్యర్ (31), శార్దూల్ ఠాకూర్ (24) రాణించగా, కేఎల్ రాహుల్ ఒక్కడే 101 పరుగులతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ 5 వికెట్లను తీసుకొని భారత జట్టు పతనాన్ని శాసించాడు. బర్గర్ 3 వికెట్లు, మార్కో జాన్సన్, కోటిజో ఒక్కో వికెట్ తీసుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు భారీగా పరుగులు సాధించింది. ఆ జట్టు ఆటగాడు ఎల్గర్ భారీ శతకంతో (185) చెలరేగిపోగా, టోనీ డి జోర్జి (28), బెడింఘం (56), మార్కో జాన్సన్ (84) పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా జట్టు పది వికెట్ల నష్టానికి 408 పరుగులను చేసింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తడబాటుకు గురైంది. బ్యాటర్లు దారుణంగా విఫలం కావడంతో 131 పరుగులకే కుప్ప కూలిపోయింది. రెండో ఇన్నింగ్స్ లో కూడా విరాట్ కోహ్లీ (76) రాణించడంతో ఆమాత్రమైన పరుగులు చేయగలిగింది. సుబ్ మన్ గిల్ (26), కోహ్లీ మినహా మిగిలిన బ్యాటర్లు ఎవరు రెండంకెల స్కోర్ చేయలేకపోయారంటే బ్యాటింగ్ ఆర్డర్ ఎంత దారుణంగా విఫలమైందో అర్థం చేసుకోవచ్చు. దక్షిణాఫ్రికా బౌలర్లలో బర్గర్ నాలుగు, మార్కో జాన్సెన్ మూడు, రబాడ రెండు వికెట్ల తీసి భారత పతనాన్ని శాసించారు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు తొలి టెస్ట్ లో పరుగులు తేడాతో ఘన విజయాన్ని సాధించింది.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ముకేశ్ కుమార్
దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐదెన్ మార్‌క్రమ్, టోనీ డిజోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెర్రీన్నె (వికెట్ కీపర్), మార్కో జాన్‌సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, నాండ్రీ బర్గర్, లుంగి ఎంగిడి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
తిరుపతి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion