India vs Bangladesh 2022: బంగ్లాతో టెస్ట్ సిరీస్- రోహిత్ స్థానంలో ఏ ఆటగాడు రానున్నాడో తెలుసా!
India vs Bangladesh 2022: ఎడమచేతి వేలి గాయంతో బంగ్లాతో టెస్ట్ సిరీస్ కు దూరమైన రోహిత్ స్థానంలో... బెంగాల్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ టెస్టు జట్టుతో చేరే అవకాశం ఉంది.
India vs Bangladesh 2022: డిసెంబర్ 14 నుంచి బంగ్లాదేశ్ తో టీమిండియా టెస్టు మ్యాచులు ఆడనుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు రెండో వన్డే సందర్భంగా ఎడమ చేతి వేలికి గాయమైంది. దీంతో అతడు స్వదేశానికి రానున్నాడు. మూడో వన్డేకు దూరమైన రోహిత్.. టెస్టు మ్యాచులకు దూరంగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు హిట్ మ్యాన్ స్థానాన్ని ఇండియా ఏ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ తో భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అభిమన్యు ఈశ్వరన్ ప్రస్తుతం జరుగుతున్న ఇండియా ఏ మ్యాచులో రెండు శతకాలు నమోదుచేశాడు. ఓపెనర్ గానూ ఆడుతున్నాడు. సిల్ హల్ లో తన రెండో టెస్టు మ్యాచ్ ముగిశాక అతను బంగ్లాదేశ్ కు వచ్చే అవకాశముంది అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈశ్వరన్ తొలి ఏ టెస్టులో 141 పరుగులు చేశాడు. రెండో టెస్టులో 144 పరుగులతో అజేయంగా ఉన్నాడు. కాబట్టి ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న ఈశ్వరన్ కు రోహిత్ స్థానం దొరికే అవకాశం ఉంది.
Splendid show by captain Abhimanyu Easwaran for India A - 157 in 247 balls. Consecutive centuries by him. pic.twitter.com/AVurNf1fs2
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 8, 2022
బెంగాల్ బౌలర్ కు ఛాన్స్!
అలాగే బెంగాల్ జట్టునుంచే ఫాస్ట్ బౌలర్ ముకేశ్ కుమార్ కు అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. మహ్మద్ షమీ స్థానంలో ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్ లలో ఒకరిని తీసుకోవచ్చు. బంగ్లాతో టెస్ట్ సిరీస్ కు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఎంపికయ్యాడు. అయితే అతడు పూర్తి ఫిట్ గా ఉంటేనే ఆడతాడు. లేకపోతే అక్షర్ పటేల్ కు బ్యాకప్ గా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్ టెస్టు జట్టులో చేరే అవకాశం ఉంది.
రోహిత్ గైర్హాజరీలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించునున్నాడు. రెండు టెస్ట్ మ్యాచుల సిరీస్ లో భాగంగా డిసెంబర్ 14న మొదటి టెస్ట్ ప్రారంభమవుతుంది.
🚨 NEWS 🚨
— SportsBash (@thesportsbash) December 8, 2022
👉 Indian captain Rohit Sharma set to miss the test series against Bangladesh 🇧🇩
👉 Bengal's Abhimanyu Easwaran is all set to replace him in the Indian squad 😲#INDvsBANG pic.twitter.com/Wu8SAcLYLo
India A continue their domination on Day 2 with openers Yashasvi Jaiswal (145) and captain Abhimanyu Easwaran (142) putting on a massive 283-run stand. At Stumps, India A are 404-5 and lead by 292 runs.
— BCCI (@BCCI) November 30, 2022
Details - https://t.co/gtiu6wGotM pic.twitter.com/oDjmtNQbVt