By: ABP Desam | Updated at : 17 Dec 2022 10:52 AM (IST)
Edited By: Ramakrishna Paladi
భారత్ vs బంగ్లాదేశ్ ( Image Source : BCCI )
IND vs BAN, 1st Test:
ఛటోగ్రామ్ టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది! టీమ్‌ఇండియా బౌలింగ్‌ను బంగ్లాదేశ్ బాగానే ప్రతిఘటిస్తోంది. వికెట్ పడకుండా రెండో ఇన్నింగ్సులో 100 పరుగుల మైలురాయి అధిగమించింది. 36 ఓవర్లు ముగిసే సరికి 102/0తో నిలిచింది. నజ్ముల్ శాంటో (59; 126 బంతుల్లో 7x4) హాఫ్ సెంచరీ అందుకున్నాడు. మరో ఓపెనర్ జకీర్ హసన్ (43; 90 బంతుల్లో 6x4) అర్ధశతకం వైపు సాగుతున్నాడు. మహ్మద్ సిరాజ్, కుల్‌దీప్ యాదవ్ బంతితో అటాక్ చేస్తున్నారు.
నిలబడ్డ ఓపెనర్లు
నాలుగో రోజు, శనివారం ఓవర్‌నైట్ స్కోర్ 42/0తో బంగ్లా బ్యాటింగ్‌కు దిగింది. క్రీజులోకి వచ్చిన జకీర్ హసన్ (17 బ్యాటింగ్; 30 బంతుల్లో 3x4), నజ్ముల్ హసన్ శాంటో (25 బ్యాటింగ్; 42 బంతుల్లో 3x4) శుక్రవారం నాటి వ్యూహాన్నే అనుసరించారు. వికెట్ ఇవ్వకుండా సాధ్యమైనన్ని పరుగులు చేస్తున్నారు. అనవసరమైన షాట్లేమీ ఆడటం లేదు. కవ్వించే బంతులేసినా ఓపికగా ఆడుతున్నారు. శాంటో చక్కని బౌండరీలు బాదుతున్నాడు. ఈ ఇద్దరు ఓపెనర్లు ఇలాగే ఆడితే టీమ్‌ఇండియాపై ఒత్తిడి పెరగడం ఖాయం. కాగా మూడో రోజు రాహుల్ సేన 258/2 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లర్ చేసి ప్రత్యర్థికి 513 టార్గెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
శుక్రవారం ఏం జరిగిందంటే!
బంగ్లాదేశ్‌ను 150 పరుగులకే కుప్పకూల్చిన భారత్ వెంటనే రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (23), శుభ్‌మన్ గిల్ శుభారంభం అందించారు. మొదటి వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఖలీల్ అహ్మద్ వేసిన 22.4వ బంతికి తైజుల్ ఇస్లామ్‌కు రాహుల్ క్యాచ్ ఇచ్చాడు. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి గిల్ రెచ్చిపోయాడు. చక్కని బంతుల్ని డిఫెండ్ చేస్తూ దొరికిన వాటిని వేటాడాడు. బౌలర్లను కాచుకుంటూనే చక్కని బౌండరీలు, సిక్సర్లు బాదేశాడు. కేవలం 84 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. డ్రింక్స్ తర్వాత తన ఇన్నింగ్సులో మరింత దూకుడు మొదలైంది. భారీ షాట్లు బాదాడు. తేనీటి విరామం ముగిసిన వెంటనే సెంచరీ సాధించాడు. ఇందుకు 147 బంతులు తీసుకున్నాడు. రెండో వికెట్‌కు పుజారాతో 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అతడిని మెహదీ హసన్ ఔట్ చేశాడు.
51 ఇన్నింగ్సుల తర్వాత 100
గిల్ ఔటయ్యాక విరాట్ కోహ్లీ (19*) క్రీజులోకి వచ్చాడు. ఇప్పటికే 87 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న పుజారా వేగం పెంచాడు. టీమ్‌ఇండియా యాజమాన్యం డిక్లేర్ చేస్తుందన్న సంకేతాలతో బౌండరీలు బాదాడు. తన సహజ శైలికి భిన్నంగా దూకుడు ప్రదర్శించాడు. విరాట్‌తో కలిసి 48 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 130 బంతుల్లో సెంచరీ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతడు 51 ఇన్నింగ్సుల శతకం అందుకున్నాడు. జట్టు స్కోరు 258/2 వద్ద టీమ్‌ఇండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా ఆట ముగిసే సరికి బంగ్లా 42/0తో నిలిచింది. ఉదయం ఎక్కువ వికెట్లు పడగొడితే శనివారం సాయంత్రానికి బంగ్లా ఆలౌట్ అయ్యే అవకాశం ఉంది.
IND vs AUS: విశాఖలో మ్యాచ్ ఉందని గుర్తుందా! బోర్డర్-గావస్కర్ ట్రోఫీ షెడ్యూలు, టైమింగ్స్, వేదికలు ఇవే!
WPL Auction 2023: ఏంటీ పోటీ! WPL వేలంలో 90 మందికి 1000 పేర్లు నమోదు!
Hanuma Vihari: శెబ్బాష్ హనుమ విహారీ! మణికట్టు విరిగినా ఆంధ్రా కోసం బ్యాటింగ్ చేశాడు!
IND vs AUS Test: కోలుకున్న బుమ్రా- ఆసీస్ తో చివరి 2 టెస్టులకు అందుబాటులోకి పేసు గుర్రం!
IND vs AUS Test: అహ్మదాబాద్ లో భారత్- ఆస్ట్రేలియా ఆఖరి టెస్ట్- వీక్షించనున్న ఇరు దేశాల ప్రధానులు!
నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
PM Modi: ప్రపంచంలోనే ది బెస్ట్ లీడర్‌గా ప్రధాని నరేంద్ర మోదీ, ఆ సర్వేలో టాప్ ర్యాంక్
Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?