By: ABP Desam | Updated at : 16 Mar 2023 04:51 PM (IST)
Edited By: Ramakrishna Paladi
భారత్, ఆస్ట్రేలియా, ( Image Source : PTI )
IND vs AUS, 1st ODI Live Streaming:
ఉత్కంఠభరితంగా సాగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ముగిసింది. హోరాహోరీగా సాగిన ఈ సిరీసును టీమ్‌ఇండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిఫ్ ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు వన్డే సిరీసుకు సిద్ధమైంది. శుక్రవారమే ఆసీస్‌తో తొలి వన్డేలో తలపడుతోంది. మరి వన్డే వేదిక, లైవ్ టెలికాస్ట్, లైవ్ స్ట్రీమింగ్, జట్ల వివరాలు మీ కోసం!
భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డే మ్యాచ్ టైమింగ్, వేదిక ఏంటి?
భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డే వేదిక ముంబయిలోని వాంఖడే మైదానం. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. అరగంట ముందు టాస్ వేస్తారు.
భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డే ఎక్కడ చూడొచ్చు?
భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ ఇండియా తీసుకుంది. మ్యాచ్‌ను స్టార్‌స్పోర్ట్స్ ఛానెళ్లలో వీక్షించొచ్చు. ఆరు భాషల్లో ప్రసారం ఉంటుంది.
భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డే లైవ్ స్ట్రీమింగ్ ఎందులో?
భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డే లైవ్ స్ట్రీమింగ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో వస్తుంది. నచ్చిన భాషలో వీక్షించొచ్చు.
భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీసు షెడ్యూలు
తొలి వన్డే - మార్చి 17, మధ్యాహ్నం 1:30 గంటలకు, వేదిక వాంఖడే
రెండో వన్డే - మార్చి 19, మధ్యాహ్నం 1:30 గంటలకు, వేదిక విశాఖపట్నం
మూడో వన్డే - మార్చి 22, మధ్యాహ్నం 1:30 గంటలకు, వేదిక చెన్నై
ఆసీస్ వన్డే సిరీసుకు టీమ్‌ఇండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ షమి, హమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కత్
ఆస్ట్రేలియా జట్టు
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సేన్ అబాట్, ఏస్టన్ ఆగర్, అలెక్స్ కేరీ, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, జే రిచర్డ్‌సన్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టాయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా
🗣️🗣️ 'Their intensity in practice rubs onto the youngsters' 💪
— BCCI (@BCCI) March 15, 2023
Ahead of the #INDvAUS ODI series opener, Fielding Coach T. Dilip explains how @imVkohli & @imjadeja have been role models in the field for the youngsters 👏👏#TeamIndia | @mastercardindia pic.twitter.com/4NourJOfR7
Hello and welcome to the Wankhede Stadium, where #TeamIndia will kickstart the ODI series against Australia.#INDvAUS @mastercardindia pic.twitter.com/OXt3tuOS14
— BCCI (@BCCI) March 15, 2023
Chris Gayle: క్రిస్ గేల్‌కు ఆర్సీబీ అరుదైన గౌరవం - విరాట్ కోహ్లీ ఏమన్నాడు?
MI vs DC Playing XI: మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్లో తుదిజట్లు ఎలా ఉండనున్నాయి?
DCW Vs MIW WPL 2023: ఫైనల్స్‌లో ప్లేస్ కోసం ముంబై, యూపీల మధ్య పోటీ - లైవ్ ఎక్కడ చూడచ్చంటే?
Smriti Mandhana: టోర్నీలోనే ఖరీదైన ప్లేయర్ - పెర్ఫార్మెన్స్ మాత్రం అతి దారుణంగా!
Glenn Maxwell: బెంగళూరుకు బ్యాడ్ న్యూస్ - నెల రోజులు దూరం కానున్న మ్యాక్స్‌వెల్!
BRS Leaders Fight : ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు, మంత్రి కేటీఆర్ సమక్షంలోనే ఘర్షణ
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
TTD News: ఏడుకొండల్లో పెరిగిన రద్దీ, వీకెండ్ వల్ల 26 కంపార్ట్మెంట్లల్లో భక్తులు - దర్శన సమయం ఎంతంటే
రాహుల్ కంటే ముందు అనర్హత వేటు పడిన నేతలు వీరే