IND vs ZIM 5th T20I: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ, దుబే మెరుపులు- జింబాబ్వే ముందు మోస్తరు టార్గెట్
IND vs ZIM 5th T20I Live Score | జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్ ను భారత్ ఇదివరకే నెగ్గింది. చివరిదైన 5వ టీ20లో వైస్ కెప్టెన్ సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ చేయగా 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 రన్స్ చేసింది.
IND vs ZIM 5th T20I Score Updates: హరారే: జింబాబ్వేతో జరుగుతున్న చివరి టీ20లో యంగ్ ఇండియా మోస్తరు టార్గెట్ ఇచ్చింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. వైస్ కెప్టెన్ సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ (58 రన్స్, 45 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా, శివం దుబే (12 బంతుల్లో 26), రియాన్ పరాగ్ (24 బంతుల్లో 22 రన్స్) పరవాలేదనిపించారు. జింబాబ్వే బౌలర్లలో ముజర్ బనీ 2 వికెట్లు పడగొట్టాడు. సికిందర్ రజా, రిచర్ గరవ, బ్రాండన్ మవుటా తలో వికెట్ దక్కించుకున్నారు.
త్వరగా ఔటైన టీమిండియా టాపార్డర్
జింబాబ్వేపై టీ20 సిరీస్‌ను 3-1తో యువ భారత్ ఇదివరకే నెగ్గింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో అయితే ఏకంగా ఓపెనర్లే టార్గెట్ ఊదేశారు. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా జింబాబ్వే ఇచ్చిన టార్గెట్ ను ఛేజ్ చేశారు. నేడు హరారే వేదికగా నామమాత్రపు చివరిదైన 5వ టీ20 జరుగుతోంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ మొదట తటబ్యాటుకుకు లోనైంది. రెండు సిక్సర్లు కొట్టి ఊపు మీద కనిపించిన ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (12) ఇన్నింగ్స్ 4వ బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వన్ డౌన్ లో వచ్చిన అభిషేక్ శర్మ (14) త్వరగానే ఔటయ్యాడు. ముజురబాణి బౌలింగ్ లో అభిషేక్ ఆడే ప్రయత్నం చేయగా కీపర్ క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. 5వ ఓవర్లో ఎన్‌గరవ బౌలింగ్‌లో గిల్ (13) సికందర్ రజా చేతికి చిక్కాడు. దాంతో భారత్ 5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పో 40 రన్స్ చేసింది.
Innings Break!#TeamIndia posted 167/6 on the board!
— BCCI (@BCCI) July 14, 2024
5⃣8⃣ for vice-captain @IamSanjuSamson
Some handy contributions from @IamShivamDube & @ParagRiyan
Over to our bowlers now! 👍 👍
Scorecard ▶️ https://t.co/TZH0TNJcBQ#ZIMvIND pic.twitter.com/p5OEEx8z2a
హాఫ్ సెంచరీతో రాణించిన సంజూ శాంసన్
ఆపై వైస్ కెప్టెన్ సంజూ శాంసన్ ఇన్నింగ్స్ నడిపించాడు. ఆచితూచి ఆడుతూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలకు తరలించాడు. సిక్సర్లతో రన్ రేట్ తగ్గకుండా చూశాడు శాంసన్. రియాన్ పరాగ్ తో కలిసి 4వ వికెట్ కు 65 పరుగులు జోడించాడు. పరాగ్ (22), తరువాత శివం దుబేతో కలిసి స్కోరు బోర్డును నడిపించిన శాంసన్ హాఫ్ సెంచరీ తరువాత ముజరబాణి బౌలింగ్ లో మరుమణికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. చివర్లో శివం దుబే ( 2ఫోర్లు, 2 సిక్సర్లతో 26) మెరుపులు మెరిపించాక రనౌట్ అయ్యాడు. రింకూ సింగ్ ఇచ్చిన కాల్ తో పరుగుకు వెళ్లగా.. రింకూ వెనక్కి వెళ్లగా దుబే రనౌట్ గా వెనుదిరిగాడు. రింకూ 11 రన్స్, సుందర్ ఒక్క పరుగుతో నౌటౌట్‌గా నిలిచారు.