అన్వేషించండి

Sri Lanka Epic Draw Vs India: కొలంబో టెస్టులో టీమిండియా గెలుపు ముంగిట బోల్తా... శ్రీలంక ఊహించని వీరోచిత పోరాటంతో మ్యాచ్ డ్రా!

ఫాలో ఆన్ ఆడుతూ సొనాల్ దినూష అజేయ సెంచరీతో పోరాడటంతో కొలంబో రెండో టెస్టును శ్రీలంక డ్రాగా ముగించి చరిత్ర సృష్టించింది. దీంతో భార‌త డ‌బ్ల్యూటీసీ ఆశ‌లకు గండి ప‌డ్డాయి.

IND VS SL 2nd Test, Sonal Dinusha Magnificent Hundred Helps Sri Lanka Draw Second Test Against India:  కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా విజయం ముంగిట లంక జట్టు ఊహించని ప్రతిఘటనతో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల భారీ వెనుకంజతో ఫాలో ఆన్ ఆడిన శ్రీలంక చివరి రోజు అద్భుత బ్యాటింగ్‌తో టీమిండియా బౌలర్లను కట్టడి చేసింది. గురువారం ఐదోరోజు ఓవర్ నైట్ స్కోరు 229/6తో  ఆట కొన‌సాగించిచిన లంక జట్టు ఆట ముగిసే సమయానికి 429/9 స్కోరు నమోదు చేసింది. యువ బ్యాటర్ సొనాల్ దినూష (133 నాటౌట్) వ‌రుగ‌సా రెండో ఇన్నింగ్స్ లోనూ సెంచ‌రీ చేశాడు. బౌల‌ర్ల‌లో మాన‌వ్ సుతార్, ర‌వీంద్ర జ‌డేజాకు మూడు వికెట్లు ద‌క్కాయి.  దీంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఇండియా 1-0తో కైవసం చేసుకుంది. గతంలో ఫాలో ఆన్ ఆడిన 27 టెస్టుల్లో 24 మ్యాచ్‌లను లంక కోల్పోయింది. ఇండియాపై ఫాలో ఆన్ ఎదుర్కొన్న ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన శ్రీలంక, కొలంబోలో ఆ చెత్త రికార్డును చెరిపేసి కొత్త అధ్యాయాన్ని లిఖించింది.

డ్రాతో ముగింపు..
 మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్‌ను డ్రాగా ముగించేందుకు అంగీకరించారు. యువ బ్యాటర్ సొనాల్ దినూష అద్భుత సెంచ‌రీతో నాటౌట్‌గా నిలిచి లంకను పటిష్ట స్థితికి చేర్చాడు. కేశర నువంత 46 రన్స్ చేసి అతనికి చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు ఏకంగా 112 పరుగుల భాగస్వామ్యం జోడించి భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టి, ఫ్ర‌స్ట్రేట్ చేశారు. ఫాలో ఆన్ ఆడుతూ టెస్ట్ మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం శ్రీలంక క్రికెట్ చరిత్రలో ఇది నాలుగోసారి మాత్రమే కావడం విశేషం. 

అరుదైన ఘ‌న‌త‌..
కొలంబో టెస్టులో దినూష అరుదైన మైలురాళ్లను సాధించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 103 రన్స్ చేసిన అతడు, రెండో ఇన్నింగ్స్‌లోనూ 133 రన్స్‌తో అజేయంగా నిలిచి, డ‌బుల్ ధ‌మాక సాధించాడు. గాలేలో జరిగిన తొలి టెస్టులోనూ సెంచరీ బాదిన దినూష, ఈ సిరీస్‌లో మొత్తం మూడు శతకాలు నమోదు చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఫాలో ఆన్ ఆడుతూ ఒకే మ్యాచ్ లోని రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సాధించిన మూడో బ్యాటర్‌గా చ‌రిత్ర‌లో నిలిచాడు. గతంలో 1948లో ఆస్ట్రేలియాపై విజయ్ హజారే, 2001లో సౌతాఫ్రికాపై జింబాబ్వే లెజెండ్ ఆండీ ఫ్లవర్ మాత్రమే ఈ ఫీట్ నమోదు చేశారు. సుదీర్ఘ కాలం తర్వాత దినూష ఈ రికార్డు సాధించి ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. ఓవ‌రాల్ గా ఈ మ్యాచ్ లో గెలిచి డ‌బ్ల్యూటీసీ లో దూసుకుపోవాల‌ని భావించిన భార‌త్ కు చుక్కెదురైంది. ఇక శ‌త‌కాల‌తో స‌త్తా చాటిన దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ ను ప్లేయ‌ర్ ఆఫ్ ద సిరీస్, దినుష‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు ద‌క్కాయి. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
Dhoni Secret Superpower: గ్రౌండ్ లోకి దిగేముందు ఎలాంటి ప్లాన్లు ఉండవ్..  ధోని అసలు సిసలు మ్యాజిక్ బయటపెట్టిన ఫాఫ్ డుప్లెసిస్
గ్రౌండ్ లోకి దిగేముందు ఎలాంటి ప్లాన్లు ఉండవ్..  ధోని అసలు సిసలు మ్యాజిక్ బయటపెట్టిన ఫాఫ్ డుప్లెసిస్
Dube Selection Danger: యువ ఆల్‌రౌండర్ల మెరుపులతో సీనియర్‌ ప్లేయర్ కు ముచ్చెమటలు..!! నితీష్ , నమన్ దెబ్బకు దూబే కెరీర్ క్లోజ్?
యువ ఆల్‌రౌండర్ల మెరుపులతో సీనియర్‌ ప్లేయర్ కు ముచ్చెమటలు..!! నితీష్ , నమన్ దెబ్బకు దూబే కెరీర్ క్లోజ్?
CSK Massive Overhaul:  CSK సంచలన నిర్ణయం.. కోచింగ్ స్టాఫ్ పై వేటు, హస్సీ సహా కీలక దిగ్గజాలకు యెల్లో ఆర్మీ వీడ్కోలు
CSK సంచలన నిర్ణయం.. కోచింగ్ స్టాఫ్ పై వేటు, హస్సీ సహా కీలక దిగ్గజాలకు యెల్లో ఆర్మీ వీడ్కోలు
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Dayakar On Bjp: 'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం
'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం - అద్దంకి దయాకర్
YS Sharmila Letter To SEC: అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
Hot Stone Massage : హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
Hyderabad Loud Sound: హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
Embed widget