India WTC Equation: కొలంబో టెస్ట్ డ్రా అయితే ఇండియాకు తిప్పలే...! డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలకు గండి!!
India Vs Sri Lanka: కొలంబో టెస్టులో శ్రీలంకతో మ్యాచ్ వర్షం వల్ల డ్రాగా ముగిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

IND VS SL 2nd Test, Colombo Test Impact On WTC Points: శ్రీలంకతో కొలంబోలోని ఎస్ఎస్ సీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా బలమైన స్థితిలో ఉంది. సొనాల్ దినుష సెంచరీ తర్వాత లంకను తొలి ఇన్నింగ్స్లో 290 పరుగులకు ఆలౌట్ చేసిన భారత జట్టు ఫాలోఆన్ విధించింది. ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్ చెరో మూడు వికెట్లు తీయగా, అరంగేట్ర బౌలర్ సారాంశ్ జైన్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న లంక పసిందు సూరియబండార (92), కమిందు మెండిస్ (55) పోరాటంతో 6 వికెట్లకు 229 రన్స్ చేసి 16 పరుగుల లీడ్ సాధించింది. అయితే భారీ వర్షం కారణంగా ఆట నిలిచిపోవడం ఇప్పుడు సరికొత్త టెన్షన్ ను టీమిండియాను కలవరపరుస్తోంది.
Rain brings an early end to Day 4!
— BCCI (@BCCI) August 26, 2026
Sri Lanka 229/6 in the 2nd innings, lead by 16 runs.
Scorecard ▶️ https://t.co/r9FgXSdsMf#TeamIndia | #SLvIND pic.twitter.com/zpYEUDEU2Z
డ్రాగా ముగిస్తే అంతే సంగతులు..
ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో ఇండియా 53.33 పీసీటీతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే, ఆస్ట్రేలియా చేతిలో బంగ్లాదేశ్ ఓడిపోయిన నేపథ్యంలో ఇండియా నాలుగో స్థానంలోకి ఎగబాకుతుంది. ఒకవేళ వర్షం వల్ల ఈ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిస్తే భారత పీసీటీ 51.52 కు పడిపోయి ఐదో స్థానంలోనే నిలిచిపోతుంది. ఇప్పటికే ఆడిన 10 టెస్టుల్లో నాలుగు మ్యాచ్లను కోల్పోయిన శుభ్మన్ గిల్ సేనకు రాబోయే ప్రతి మ్యాచ్ నాకౌట్ లాంటిదేనడంలో సందేహం లేదు.
🏏 WTC 2025–27 Points Table Updated!
— Bobby Verma (@aitrending98) August 23, 2026
Australia have strengthened their grip on the top spot after defeating Bangladesh by an innings and 51 runs in the second Test, leveling the series 1–1.
📊 Top 5 Standings
🥇 Australia – 80.00% (96 pts)
🥈 South Africa – 75.00% (36 pts)
🥉… pic.twitter.com/xOVIsD5GBl
ఆ రెండు సిరీస్ లు కీలకం..
శ్రీలంక సిరీస్ ముగిసిన తర్వాత నవంబర్ లో ఇండియా.. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లి రెండు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. ఆ తర్వాత ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్ ముగింపు దశలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమరంలో అమీతుమీ తేల్చుకోనుంది. డార్విన్ లో ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత డబ్ల్యూటీసీ పాయింట్ల సమీకరణాలు మరింత క్లిష్టంగా మారాయి. అయితే తర్వాత ఆసీస్ పై చేయి సాధించడంతో కొంత స్పష్టత వచ్చింది.
దాదాపు నాకౌట్ పోరే..
భారత జట్టు ఫైనల్ చేరే అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే మిగిలిన ఎనిమిది టెస్టుల్లో కనీసం ఏడు మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది. అలా గెలిస్తే ఇండియా పీసీటీ 68.52 లో నిలుస్తుంది. ఒకవేళ ఆరు విజయాలు, రెండు ఓటములు నమోదైతే పీసీటీ 62.96 కు పడిపోతుంది. ఎటువంటి పెనాల్టీ పాయింట్లు పడకుండా ఉంటేనే ఈ సమీకరణాలు లెక్కలోకి వస్తాయి. దీంతో శుభ్మన్ గిల్ నేతృత్వంలోని జట్టుకు ఏమాత్రం పొరపాట్లకు తావు లేకుండా ముందుకు సాగడం తప్పనిసరిగా మారింది. ఈక్రమంలో రెండోటెస్టులో సానుకూల ఫలితం వస్తే, టీమిండియా పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది.
Before You Go
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
ట్రెండింగ్ వార్తలు



















