IND vs SL 3rd ODI: క్లీన్ స్వీప్ పై కన్నేసిన భారత్- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్
IND vs SL 3rd ODI: శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే సిరీస్ ను 2-0తో టీమిండియా గెలుచుకుంది. ఈ మ్యాచ్ లో రెండు మార్పులతో భారత్ బరిలోకి దిగుతోంది.
IND vs SL 3rd ODI: శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే సిరీస్ ను 2-0తో టీమిండియా గెలుచుకుంది. ఈ మ్యాచ్ లో రెండు మార్పులతో భారత్ బరిలోకి దిగుతోంది. హార్దిక్ పాండ్య, ఉమ్రాన్ మాలిక్ ల స్థానంలో వాషింగ్టన్ సుందర్, సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి వచ్చారు.
'పిచ్ బాగుంది. ముందు బ్యాటింగ్ చేస్తాం. పిచ్ ను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తాం. మా జట్టులో ఇంకా మెరుగుపడాల్సిన అంశాలు ఉన్నాయి. వాటి మీద దృష్టిపెట్టాం. మా సహజమైన ఆటను ఆడడానికి ప్రయత్నిస్తాం' అని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. తిరువనంతపురం పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందన్న అంచనాలతో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడబోతోంది. కుల్దీప్ యాదవ్ ప్రధాన స్పిన్నర్ పాత్ర పోషించనున్నాడు. ఇక ఆల్ రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టను సుందర్ లు ఉన్నారు.
'ఇక్కడి వాతావరణం శ్రీలంకను పోలి ఉంది. మా బ్యాటర్లు మంచి ఆరంభాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. దీన్ని ఈరోజు మెరుగుపరచుకోవాలనుకుంటున్నాం. మా జట్టులో రెండు మార్పులు జరిగాయి. ధనంజయ డిసిల్వా, దునిత్ వెల్లలగే స్థానంలో అషెన్ బండార, జెఫ్రీ వాండర్సే జట్టులోకి వచ్చారు.' అని శ్రీలంక కెప్టెన్ దాసున్ శనక వివరించాడు.
టీమిండియా తుది జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
శ్రీలంక తుది జట్టు
అవిష్క ఫెర్నాండో, నువానీదు ఫెర్నాండో, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), అషెన్ బండార, చరిత్ అసలంక, దసున్ శనక(కెప్టెన్), వనిందు హసరంగా, జెఫ్రీ వాండర్సే, చమిక కరుణరత్నే, కసున్ రజిత, లాహిరు కుమార.
#TeamIndia Captain @ImRo45 wins the toss and elects to bat first against Sri Lanka in the third and final ODI.
— BCCI (@BCCI) January 15, 2023
Washington Sundar and Suryakumar Yadav come in to the XI.
Live - https://t.co/muZgJH3f0i #INDvSL @mastercardindia pic.twitter.com/4TNIPSezrI
Rohit Sharma won the toss and chose to bat first!#INDvSL pic.twitter.com/WY8imcsRp1
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) January 15, 2023
Optional training done ✅
— BCCI (@BCCI) January 14, 2023
Ready for the series finale 👍🏻#TeamIndia | #INDvSL | @mastercardindia pic.twitter.com/L4MuCcKp8A
3rd and Final Game!
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) January 15, 2023
What changes would you make to 🇱🇰 playing XI for the 3rd ODI? 🤔#INDvSL pic.twitter.com/h43Si5vqKz