IND VS SA 4th T20I Highlights: రాజ్‌కోట్‌లో దినేష్ కార్తీక్ ధమాకా - దక్షిణాఫ్రికా లక్ష్యం ఎంతంటే?
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. దినేష్ కార్తీక్ (55: 27 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (46: 31 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు) రాణించారు. దక్షిణాఫ్రికా విజయానికి 120 బంతుల్లో 170 పరుగులు కావాలి.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (5: 7 బంతుల్లో, ఒక ఫోర్), వన్‌డౌన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (4: 2 బంతుల్లో, ఒక ఫోర్) విఫలం అయ్యారు. దీంతో 24 పరుగులకే టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే ఇషాన్ కిషన్ (27: 26 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) కూడా అవుటయ్యాడు. అప్పటికి స్కోరు 40 పరుగులు మాత్రమే.
ఈ దశలో కెప్టెన్ రిషబ్ పంత్‌కు (17: 23 బంతుల్లో, రెండు ఫోర్లు) హార్దిక్ పాండ్యా జతకలిశాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 41 పరుగులు జోడించారు. తన సహజశైలికి భిన్నంగా నిదానంగా ఆడిన పంత్ ఎక్కువసేపు క్రీజులో నిలబడలేదు. ఈ దశలో హార్దిక్‌కు దినేష్ కార్తీక్ జతకలిశాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 65 పరుగులు జోడించారు. వీరు వేగంగా ఆడటంతో టీమిండియా చివరి ఐదు ఓవర్లలో 73 పరుగులు చేసింది. దీంతో 20 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా ఆరు వికెట్లు నష్టపోయి 169 పరుగులు సాధించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి రెండు వికెట్లు తీయగా... మార్కో జాన్సెన్, డ్వేన్ ప్రిటోరియస్, నోర్జే, కేశవ్ మహరాజ్‌లకు తలో వికెట్ దక్కింది.
View this post on Instagram