IND vs SA 3rd ODI: చిత్తడిగా దిల్లీ పిచ్! డూ ఆర్ డై మ్యాచులో టాస్ గబ్బర్‌దే!
IND vs SA 3rd ODI: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమ్‌ఇండియా టాస్ గెలిచింది. కెప్టెన్ శిఖర్ ధావన్ వెంటనే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
IND vs SA 3rd ODI: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమ్‌ఇండియా టాస్ గెలిచింది. కెప్టెన్ శిఖర్ ధావన్ వెంటనే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణంగా పిచ్‌లో తేమ ఎక్కువగా ఉందని దానిని ఉపయోగించుకుంటామని గబ్బర్ అన్నాడు. సోమవారం వర్షం కురవడంతో అరుణ జైట్లీ మైదానం చిత్తడిగా ఉంది. దాంతో ఒంటి గంటకు వేయాల్సి టాస్ 40 నిమిషాలు ఆలస్యంగా వేశారు. ఓవర్లలో ఎలాంటి కోత విధించలేదు. సఫారీల తరఫున డేవిడ్ మిల్లర్ కెప్టెన్‌గా వచ్చాడు. కేవశ్ మహారాజ్‌కు కాస్త నలతగా ఉందన్నాడు.
🚨 Team News 🚨#TeamIndia remain unchanged. #INDvSA
— BCCI (@BCCI) October 11, 2022
Follow the match 👉 https://t.co/XyFdjVrL7K
A look at our Playing XI 🔽 pic.twitter.com/icw7Y2fDJe
భారత్, సౌథాఫ్రికా తుది జట్లు
భారత్: శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, అవేశ్ ఖాన్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్
దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్, జానెమన్ మలన్, రెజా హెండ్రిక్స్, అయిడెన్ మార్‌క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్‌సెన్, అండిలె ఫెలుక్‌వాయో, ఫార్టూయిన్, కాగిసో రబాడా, ఆన్రిచ్ నోకియా, లుంగి ఎంగిడి
🚨 Toss Update 🚨#TeamIndia have elected to bowl against South Africa in the third & final #INDvSA ODI of the series.
— BCCI (@BCCI) October 11, 2022
Follow the match 👉 https://t.co/XyFdjVrL7K @mastercardindia pic.twitter.com/LVAgNsKEG8
రెండో వన్డేలో ఏం జరిగిందంటే?
రెండో వన్డేలో టీమిండియా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా 45.5 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో టీమిండియా ఏడు వికెట్లతో మ్యాచ్‌లో విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ (113 నాటౌట్: 111 బంతుల్లో, 15 ఫోర్లు) అజేయ సెంచరీతో జట్టును గెలిపించాడు. దీంతో భారత్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మూడో వన్డే మంగళవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది.
శ్రేయస్ అయ్యర్ శతకం
278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు కోరిన ఆరంభం లభించలేదు. స్కోరు బోర్డు మీద 48 పరుగులు చేరేసరికి ఓపెనర్లు శిఖర్ ధావన్ (13: 20 బంతుల్లో, ఒక ఫోర్), శుభ్‌మన్ గిల్ (28: 26 బంతుల్లో, ఐదు ఫోర్లు) అవుటయ్యారు. అయితే ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (93: 84 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్లు) జట్టును ఆదుకున్నారు. మొదట మెల్లగా ఆడినప్పటికీ క్రీజులో సమయం గడిపేకొద్దీ ఆటలో వేగం పెంచారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు ఏకంగా 161 పరుగులు జోడించడం విశేషం. సెంచరీ ముంగిట భారీ షాట్‌కు ప్రయత్నించి ఇషాన్ కిషన్ అవుటయ్యాడు. అనంతరం సంజు శామ్సన్‌తో (30 నాటౌట్: 36 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) కలిసి శ్రేయస్ అయ్యర్ మ్యాచ్‌ను ముగించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబడ, వేన్ పార్నెల్, ఫార్ట్యూన్ తలో వికెట్ తీసుకున్నారు.
TEAM ANNOUNCEMENT 🚨
— Proteas Men (@ProteasMenCSA) October 11, 2022
🏏 Miller to captain
➡️ Ngidi, Phehlukwayo and Jansen is brought in
⬅️ Maharaj, Parnell and Rabada miss out
🇮🇳 India have won the toss and will bowl first
🗒️ Ball by ball https://t.co/KNz7vLXE1d
📺 SuperSport Grandstand 201#INDvSA #BePartOfIt pic.twitter.com/Vw8pCK1CvO