IND vs NZ 2nd ODI: న్యూజిలాండ్ తో రెండో వన్డే- టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
IND vs NZ 2nd ODI: న్యూజిలాండ్ తో జరగనున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది.
IND vs NZ 2nd ODI: న్యూజిలాండ్ తో జరగనున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. రాయ్ పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మొదటి వన్డేలో ఆడిన జట్టుతోనే భారత్ ఈ మ్యాచులో బరిలోకి దిగుతోంది. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవు.
'టాస్ నిర్ణయం గురించి జట్టుతో చాలా చర్చించాను. క్లిష్ట పరిస్థితుల్లో ఆడడం సవాల్ గా చేసుకోవాలనుకుంటున్నాం. అందుకే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాం. ఇది మాకు పరీక్ష. వికెట్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని మాకు తెలుసు. గత మ్యాచ్ లో బ్రాస్ వెల్ బాగా బ్యాటింగ్ చేశాడు. అయితే చివరకి మేం గెలిచాం. ప్రాక్టీస్ సెషన్ లో కొంచెం మంచు కురిసింది. అయితే అది అంత ప్రభావం చూపదని క్యురేటర్ చెప్పారు. మేం హైదరాబాద్ లో మొదట బ్యాటింగ్ చేశాం. ఇక్కడు ముందు బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. మా జట్టులో ఎలాంటి మార్పులు లేవు.' అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.
'ఇక్కడ ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. కాబట్టి వికెట్ ఎలా ఉంటుందో కచ్చితంగా తెలియదు. అయితే టాస్ గెలిస్తే మేం కూడా బౌలింగ్ తీసుకునేవాళ్లం. చివరి గేమ్ లో మా బ్యాటింగ్ బాగుంది. ఇక్కడా అదే కొనసాగించాలనుకుంటున్నాం. మాకు మ్యాచ్ లు గెలవడం ముఖ్యం. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆడితే అనుభవం వస్తుంది. ఇష్ సోధి ఇంకా కోలుకోలేదు. కాబట్టి మేం గత మ్యాచ్ జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం. ' అని కివీస్ కెప్టెన్ టామ్ లేథమ్ అన్నాడు.
భారత్ తుది జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ.
న్యూజిలాండ్ తుది జట్టు
ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్, వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్, హెన్రీ షిప్లీ, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్.
ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు
ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. డీడీ స్పోర్ట్స్, స్టార్ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.
A look at #TeamIndia's Playing eleven as we remain unchanged for the second #INDvNZ ODI👌🏻
— BCCI (@BCCI) January 21, 2023
Follow the match ▶️ https://t.co/V5v4ZINCCL @mastercardindia pic.twitter.com/ibbgWvzuUg
🚨 Toss Update 🚨#TeamIndia win the toss and elect to field first in the second #INDvNZ ODI.
— BCCI (@BCCI) January 21, 2023
Follow the match ▶️ https://t.co/V5v4ZINCCL @mastercardindia pic.twitter.com/YBw3zLgPnv
Batting first in ODI 2. The first international at Raipur's International Stadium. Both teams unchanged from ODI 1. Follow play LIVE in NZ with @skysportnz. LIVE scoring | https://t.co/CFPNxlYvWD #INDvNZ pic.twitter.com/aCeLd23qaq
— BLACKCAPS (@BLACKCAPS) January 21, 2023