IND Vs ENG 5th Test Highlights: మూడోరోజు కీలకం - కొంచెం బిగిస్తే మ్యాచ్ మనదే!
టీమిండియాతో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసేసరికి ఐదు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు పూర్తిగా టీమిండియా చేతుల్లోకి వచ్చేసింది. రెండో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ ఐదు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. జానీ బెయిర్‌స్టో (12 బ్యాటింగ్: 47 బంతుల్లో, ఒక ఫోర్), బెన్ స్టోక్స్ (0 బ్యాటింగ్: నాలుగు బంతుల్లో) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ ఇంకా 332 పరుగులు వెనకబడి ఉంది.
ఇన్నింగ్స్ మొదట్లోనే అలెక్స్ లీస్ వికెట్‌ను కోల్పోయిన ఇంగ్లండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూనే ఉంది. ఇప్పటివరకు క్రీజులోకి వచ్చిన వారిలో జో రూట్ (31: 67 బంతుల్లో, నాలుగు ఫోర్లు) మాత్రమే 30 పరుగుల మార్కును దాటాడు. రెండంకెల స్కోరును చేరుకున్నది కూడా ముగ్గురు మాత్రమే.
ఓపెనర్ అలెక్స్ లీస్‌ను (6: 9 బంతుల్లో, ఒక ఫోర్) మూడో ఓవర్లోనే అవుట్ చేసిన బుమ్రా టీమిండియాకు తొలి వికెట్ అందించాడు. మరో ఓపెనర్ జాక్ క్రాలే (9: 17 బంతుల్లో, ఒక ఫోర్), ఓలీ పోప్ (10: 18 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. ఈ రెండు వికెట్లను కూడా బుమ్రానే దక్కించుకున్నాడు దీంతో ఇంగ్లండ్ 44 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో వర్షం రావడంతో మ్యాచ్‌ను నిలిపివేసి టీ బ్రేక్‌ను ప్రకటించారు. మ్యాచ్ తిరిగి ప్రారంభం అయ్యాక జో రూట్, జాక్ లీచ్ కూడా అవుట్ కావడంతో ఇంగ్లండ్ 83 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. భారత బౌలర్లలో బుమ్రాకు మూడు వికెట్లు దక్కగా... షమి, సిరాజ్ చెరో వికెట్ తీసుకున్నారు.
View this post on Instagram