IND vs BAN: పుణేకు చేరుకున్న టీమిండియా - ప్రతీకార విజయం కోసం బరిలోకి దిగనున్న భారత్!
India vs Bangladesh: బంగ్లాదేశ్‌తో జరగనున్న మ్యాచ్ కోసం భారత జట్లు పుణే నగరానికి చేరుకుంది.
India vs Bangladesh: 2023 ప్రపంచ కప్‌లో భారత్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడింది. ఆడిన మూడింటిలోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. టీం ఇండియా తన తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. మహారాష్ట్రలోని పుణే స్టేడియంలో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 19వ తేదీన జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు ఇప్పటికే పుణే చేరుకుంది. విమానాశ్రయంలో భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కనిపించారు. విరాట్ కోహ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఇందులో అతను విమానాశ్రయం నుంచి బయలుదేరినట్లు కనిపిస్తున్నాడు.
భారత్ తన గత మ్యాచ్‌ని అహ్మదాబాద్‌లో పాకిస్తాన్‌తో ఆడింది. ఇప్పుడు పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఇప్పటి వరకు మొత్తం 40 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో టీమిండియా 31 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కాగా ఎనిమిది మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. పుణే వేదికగా జరిగే మ్యాచ్‌లో భారత్‌నే హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే టీమిండియా వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించినట్లు అవుతుంది.
అయితే ఈ ఏడాది భారత్, బంగ్లాదేశ్ మధ్య ఒకే ఒక్క వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను ఆసియా కప్ 2023 టోర్నమెంట్‌లో భాగంగా నిర్వహించారు. ఇందులో టీమిండియా ఆరు పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 265 పరుగులు చేసింది. అనంతరం భారత జట్టు 259 పరుగులకు ఆలౌట్ అయి ఆరు పరుగులతో ఓటమి చవి చూసింది. దీంతో భారత్ ప్రతీకార విజయం కోసం బరిలోకి దిగనుంది.
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఇప్పటివరకు 40 వన్డేలో జరిగాయి. ఇందులో 31 మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది. ఎనిమిది మ్యాచ్‌లు బంగ్లాదేశ్ గెలుచుకోగా, ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. కానీ డేంజరస్ గణాంకాలు ఏంటంటే... భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో బంగ్లాదేశ్‌నే విజయం సాధించింది.
ప్రపంచ కప్‌నకు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, సూర్యకుమార్ యాదవ్
ప్రపంచ కప్‌నకు బంగ్లాదేశ్ జట్టు
లిటన్ దాస్, తంజీద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, మెహిదీ హసన్ మిరాజ్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), తౌహీద్ హృదయ్, మహ్మదుల్లా, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్, హసన్ మహమూద్, తంజీమ్ హసన షకీబ్, నసుమ్ అహ్మద్, మెహదీ హసన్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial