(Source: ECI/ABP News/ABP Majha)
T20 World Cup 2024: వర్తు శర్మ వర్తు, కళ్లు చెదిరిపోయాయోయ్ రోహితు
India Vs Australia : టీ20 ప్రపంచ కప్ 2024 సూపర్-8లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ శర్మ వీర విహారం చేశాడు.
IND vs AUS Match, IND Innings highlights: సూపర్ ఎయిట్(Super 8)లో భాగంగా ఆస్ట్రేలియా(AUS)తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా(IND) కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma) శివాలెత్తిపోయాడు. కంగారు బౌలర్లను ఊచకోత కోశాడు. కంగారు బౌలర్లపై దండయాత్ర చేశాడు. దొరికిన బంతిని దొరికినట్లు బాదేశాడు. రోహిత్ మెరుపు బ్యాటింగ్‌తో బంతి ఎక్కడ పడ్డా బౌండరీ బయటపడింది. క్రికెట్ బుక్‌లో చెప్పినట్లు.. భవిష్యత్ తరాలు సిక్సులు ఎలా కొట్టాలో నేర్చుకోవచ్చు అన్నటు రోహిత్ శర్మ ఇన్నింగ్స్ సాగింది. రోహిత్ శర్మ శతకం సాధించకపోయినా ఈ ఇన్నింగ్స్ మాత్రం సెంచరీ కంటే ఎక్కువే. ఎందుకంటే ఆరంభంలోనే తొలి వికెట్ పడిందన్న బెదురు లేకుండా... కంగారు బౌలర్లు ఒత్తిడి పెంచుతారన్న ఆందోళన లేకుండా రోహిత్ శర్మ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 17 ఏళ్లు పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ 19 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. రోహిత్ విధ్వంసకర బ్యాటింగ్‌కు తోడు మిగిలిన బ్యాటర్లు కూడా రాణించడంతో టీమిండియా కంగారుల ముందు భారీ స్కోరు చేసింది. రోహిత్ శర్మ కేవలం 41 బంతుల్లో ఏడు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 92 పరుగులు చేసి కేవలం సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో అవుటయ్యాడు. పాండ్యా, సూర్య, దూబే కూడా బ్యాట్ ఝుళిపించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు చేసింది.