IND vs AUS 4th Test Day 2: రెండో సెషన్లో 3 వికెట్లు పడగొట్టిన యాష్ - ఖవాజా 180 నాటౌట్
IND vs AUS 4th Test Day 2: అహ్మదాబాద్ టెస్టుపై ఆసీస్ పట్టు బిగిస్తోంది. రెండో రోజు తేనీటి విరామానికి 7 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా డబుల్ సెంచరీ వైపు సాగుతున్నాడు.
IND vs AUS 4th Test Day 2:
అహ్మదాబాద్ టెస్టుపై ఆసీస్ పట్టు బిగిస్తోంది. రెండో రోజు తేనీటి విరామానికి 7 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (180; 421 బంతుల్లో 21x4) డబుల్ సెంచరీ వైపు వడివడిగా సాగుతున్నాడు. నేథన్ లైయన్ (6) అతడికి తోడుగా ఉన్నాడు. రెండో సెషన్లో టీమ్‌ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విజృంభించాడు. మూడు వికెట్లు పడగొట్టగాడు.
Tea on Day 2 of the 4th Test @ashwinravi99 picks up three wickets in the second session as Australia are 409/7.
— BCCI (@BCCI) March 10, 2023
Scorecard - https://t.co/8DPghkwsO6 #INDvAUS @mastercardindia pic.twitter.com/Lt6dIgqP8r
ఓపిక పడితే ఇండియన్ పిచ్‌లపై భారీ స్కోర్లు చేయొచ్చని ఉస్మాన్ ఖవాజా (ఓవర్‌నైట్ స్కోరు 104) నిరూపించాడు. అతడికి కామెరాన్ గ్రీన్ (49) సరైన భాగస్వామిగా నిలిచాడు. వీరిద్దరూ వికెట్ పడకుండా నిలకడగా పరుగులు చేస్తున్నారు. దాంతో ఓవర్‌నైట్ స్కోరు 255/4తో రెండో రోజు ఆట మొదలెట్టిన ఆస్ట్రేలియా ఇప్పుడు టీమ్‌ఇండియాకు చుక్కలు చూపిస్తోంది. క్రీజులోకి వచ్చిన కొద్దిసేపటికే గ్రీన్ ఒక పరుగు పూర్తి చేసి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూనే చూడచక్కని షాట్లు బాదేశారు. దాంతో డ్రింక్స్ బ్రేక్‌కు ఆసీస్ 296/4తో నిలిచింది. ఆ తర్వాత ఖావాజా మరింత దూకుడుగా ఆడాడు. అతడు 346 బంతుల్లో 150 మైలురాయిని చేరుకోవడంతో ఆసీస్ 347/4తో లంచ్‌కు వెళ్లింది.
𝐎𝐧𝐞 𝐛𝐫𝐢𝐧𝐠𝐬 𝐭𝐰𝐨! 🔥🔥
— BCCI (@BCCI) March 10, 2023
A sigh of relief for #TeamIndia as @ashwinravi99 strikes twice in an over to remove Cameron Green and Alex Carey 💪🏻💪🏻
Follow the match ▶️ https://t.co/8DPghkx0DE#INDvAUS | @mastercardindia pic.twitter.com/e8caRqCHOq
రెండో సెషన్లో రవిచంద్రన్ అశ్విన్ విజృంభించాడు. తనదైన వైవిధ్యంతో బంతులు విసిరాడు. మూడు వికెట్లు పడగొట్టి ఆసీస్ దూకుడు కళ్లెం వేశాడు. లంచ్ తర్వాత కామెరాన్ గ్రీన్ సెంచరీ సాధించాడు. 143 బంతుల్లోనే ఈ ఘనత అందుకున్నాడు. అయితే జట్టు స్కోరు 378 వద్ద అతడిని యాష్ ఔట్ చేశాడు. అతడు వేసిన 130.2వ బంతిని స్వీప్ చేసేందుకు గ్రీన్ ప్రయత్నించాడు. బ్యాటు అంచుకు తగిలిన బంతి కీపర్ కేఎస్ భరత్ చేతుల్లో పడింది. దాంతో ఐదో వికెట్‌కు వారు నెలకొల్పిన 208 (358 బంతుల్లో) భాగస్వామ్యానికి తెరపడింది. మరో నాలుగు బంతులకే అలెక్స్ కేరీ (0)నీ యాష్ ఔట్ చేశాడు. ఈ క్రమంలో మిచెల్ స్టార్క్ (6) సహకారంతో ఖవాజా ఇన్నింగ్స్ నడిపించాడు. పెరుగుతున్న ఈ భాగస్వామ్యాన్నీ స్టార్క్‌ను ఔట్ చేయడం ద్వారా యాష్ విడదీశాడు.
A tough morning session for #TeamIndia
— BCCI (@BCCI) March 10, 2023
Australia go into Lunch on Day 2 with 347/4 on the board.
Scorecard - https://t.co/8DPghkwsO6 #INDvAUS @mastercardindia pic.twitter.com/5ElwXobTf0