News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

IND vs AUS 3rd ODI: చితక్కొట్టిన కంగారూలు! టీమ్‌ఇండియా టార్గెట్‌ 353

IND vs AUS 3rd ODI: రాజ్‌కోట్‌ వన్డేలో ఆస్ట్రేలియా అదరగొట్టింది. ఈ స్టేడియంలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది.ఆతిథ్య జట్టుకు 353 పరుగుల భారీ టార్గెట్‌ ఇచ్చింది.

FOLLOW US: 
Share:

IND vs AUS 3rd ODI: 

రాజ్‌కోట్‌ వన్డేలో ఆస్ట్రేలియా అదరగొట్టింది. ఈ స్టేడియంలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. టీమ్‌ఇండియా బౌలింగ్‌ను సింపుల్‌గా ఊచకోత కోసింది. ఆతిథ్య జట్టుకు 353 పరుగుల భారీ టార్గెట్‌ ఇచ్చింది. చరిత్రలో నాలుగో సారి కంగారూ టాప్‌ ఆర్డర్లో నలుగురు బ్యాటర్లు హాఫ్‌ సెంచరీలు బాదేశారు. ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ (96; 84 బంతుల్లో 13x4, 3x6) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. స్టీవ్‌ స్మిత్‌ (74; 61 బంతుల్లో 8x4, 1x6), మార్నస్‌ లబుషేన్‌ (72; 58 బంతుల్లో 9x4, 0x6) సమయోచిత ఇన్నింగ్సులు ఆడారు. డేవిడ్‌ వార్నర్‌ (56; 34 బంతుల్లో 6x4, 4x6) ఆరంభంలోనే చితక్కొట్టాడు.

ఆరంభం అదుర్స్‌

ప్లాట్‌ పిచ్‌.. బ్యాటు మీదకు చక్కగా వస్తోన్న బంతి! ఇంకేముంది పరిస్థితులను ఆస్ట్రేలియా అనుకూలంగా మలుచుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగి టీమ్‌ఇండియాకు చుక్కలు చూపించింది. బంతి జారుతుండటంతో బౌలర్లు బాగా ఇబ్బంది పడ్డారు. ఇక డేవిడ్‌ వార్నర్‌ 32 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ బాదేశాడు. మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగులో సిక్సర్లు, బౌండరీల వర్షం కురిపించాడు. అతడికి తోడుగా మార్ష్‌ చెలరేగాడు. దాంతో ఆసీస్‌ 10 ఓవర్లకే 90 పరుగులు చేసింది. జట్టు స్కోరు 78 వద్ద వార్నర్‌ను ప్రసిద్ధ్‌ కృష్ణ ఔట్‌ చేయడం కాస్త ఊరట.

మిడిల్‌లో నిలకడ

డేవిడ్‌ భాయ్‌ ఔటయ్యాక స్కోరు తగ్గిందనుకుంటే పొరపాటే! వన్‌డౌన్‌లో వచ్చిన స్టీవ్‌స్మిత్‌తో కలిసి మిచెల్‌ మార్ష్‌ మరింత ప్రమాదకరంగా మారాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 119 బంతుల్లో 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పేసర్లు, స్పిన్నర్లను ఓ ఆటాడుకున్నారు. 45 బంతుల్లో 50 కొట్టిన మార్ష్‌ వడివడిగా సెంచరీకి చేరువయ్యాడు. జట్టు స్కోరు 215 వద్ద అతడిని కుల్‌దీప్‌ యాదవ్‌ ఔట్‌ చేసింది. కొంత సమయానికి 43 బంతుల్లోనే అర్ధశతకం బాదేసిన స్టీవ్‌ స్మిత్‌ను మహ్మద్‌ సిరాజ్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.

ఆఖర్లో లబుషేన్‌ ఆట

టాప్‌ 3 ఔటయ్యాక ఆసీస్‌కు లబుషేన్‌ అండగా నిలిచాడు. 43 బంతుల్లో హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (5), అలెక్స్‌ కేరీ (11), కామెరాన్‌ గ్రీన్‌ (9) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగినా అతడు మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. ప్యాట్‌ కమిన్స్‌తో కలిసి ఏడో వికెట్‌కు 39 బంతుల్లో 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కేరీతో కలిసీ ఇన్నింగ్స్‌ నడిపించాడు. అతడే త్వరగా ఔటయ్యుంటే ఆసీస్‌కు ఇంత స్కోర్‌ వచ్చేది కాదు. 49వ ఓవర్‌ ఆఖరి బంతికి అతడిని బుమ్రా ఔట్‌ చేశాడు. కమిన్స్‌ (19), మిచెల్‌ స్టార్క్‌ (1) అజేయంగా నిలిచారు. బుమ్రా 10 ఓవర్లలో 81 పరుగులు ఇచ్చినా 3 వికెట్లు పడగొట్టాడు. కుల్‌దీప్‌ 2 వికెట్లు దక్కాయి.

భారత జట్టు: రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ

ఆస్ట్రేలియా జట్టు: మిచెల్‌ మార్ష్‌, డేవిడ్ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌, అలెక్స్‌ కేరీ, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, కామెరాన్‌ గ్రీన్‌, ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, తన్వీర్‌ సంఘా, జోష్ హేజిల్‌వుడ్‌

పిచ్‌ రిపోర్టు: మైదానం పచ్చికతో మెరుస్తోంది. స్క్వేర్‌ బౌండరీలు 66 మీ, 67 మీటర్లు ఉన్నాయి. స్ట్రెయిట్‌గా బౌండరీ కొట్టాలంటే 79 మీటర్లు వెళ్లాలి. పిచ్‌పై పచ్చిక ఉంది. ముందు మ్యాచులతో పోలిస్తే వికెట్‌ కఠినంగా ఉంది. మొదటి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 311. బంతి స్పిన్‌ అవ్వడం కన్నా జారిపోవడమే ఎక్కువగా ఉండొచ్చని సంజయ్‌ మంజ్రేకర్‌, బ్రాడ్‌ హడిన్‌ అన్నారు.

Published at : 27 Sep 2023 05:21 PM (IST) Tags: India vs Australia ABP Desam breaking news IND vs AUS IND vs AUS 3rd ODI India Vs Australia 3rd ODI

ఇవి కూడా చూడండి

IPL 2024 Auction: ఎన్నికల ఫలితాల హీట్‌లో కూల్ న్యూస్ చెప్పిన బీసీసీఐ - ఐపీఎల్ 2024 వేలం తేదీ ప్రకటించిన బోర్డు!

IPL 2024 Auction: ఎన్నికల ఫలితాల హీట్‌లో కూల్ న్యూస్ చెప్పిన బీసీసీఐ - ఐపీఎల్ 2024 వేలం తేదీ ప్రకటించిన బోర్డు!

WPL 2024 auction: వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలం ఎప్పుడంటే , అందుబాటులో 165 మంది క్రికెటర్లు

WPL 2024 auction: వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలం ఎప్పుడంటే , అందుబాటులో 165 మంది క్రికెటర్లు

BAN vs NZ: చారిత్రాత్మక విజయంతో బంగ్లాదేశ్‌ కొత్త చరిత్ర

BAN vs NZ: చారిత్రాత్మక విజయంతో బంగ్లాదేశ్‌ కొత్త చరిత్ర

IPL 2024: వేలానికి 1166 మంది ఆటగాళ్లు దరఖాస్తు , ఆస్ట్రేలియా ఆటగాళ్లకు భారీ ధర?

IPL 2024: వేలానికి 1166 మంది ఆటగాళ్లు దరఖాస్తు , ఆస్ట్రేలియా ఆటగాళ్లకు భారీ ధర?

Pro Kabaddi 2023: ఇక సమరమే....నేటి నుంచే ప్రో కబడ్డీ సీజన్‌-10

Pro Kabaddi 2023: ఇక సమరమే....నేటి నుంచే ప్రో కబడ్డీ సీజన్‌-10

టాప్ స్టోరీస్

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్

RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి,  తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్

KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్

KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్
×