Australia squad: ఆసీస్ ప్రపంచకప్ టీమ్‌లో మార్పు! భీకర్ ఫామ్‌లో ఉన్న బ్యాటర్ వచ్చేశాడు!
Australia squad: మార్నస్ లబుషేన్ జాక్‌పాట్ కొట్టేశాడు! ఐసీసీ వన్డే ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యాడు. గాయపడిన ఏస్టన్ ఆగర్ స్థానంలో అతడిని తీసుకుంటున్నట్టు ఆస్ట్రేలియా ప్రకటించింది.
Australia squad:
మార్నస్ లబుషేన్ జాక్‌పాట్ కొట్టేశాడు! ఐసీసీ వన్డే ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యాడు. గాయపడిన ఏస్టన్ ఆగర్ స్థానంలో అతడిని తీసుకుంటున్నట్టు ఆస్ట్రేలియా ప్రకటించింది. దక్షిణాఫ్రికా, భారత వన్డే సిరీసుల్లో అతడు అద్భుతమైన ఇన్నింగ్సులు ఆడాడు. పరుగుల వరద పారించాడు. పైగా స్పిన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం అతడి సొంతం.
పదిహేను మందితో కూడిన ప్రపంచకప్ జట్టులో మార్పులు చేశామని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. అంతకు ముందు ప్రకటించిన జట్టులో ఒకే ఒక మార్పు చేస్తున్నామని పేర్కొంది. గాయపడ్డ ఏస్టన్ ఆగర్ స్థానంలో లబుషేన్‌కు చోటిచ్చామని వెల్లడించింది. గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోనప్పటికీ ట్రావిడ్ హెడ్ తన స్థానం పదిలం చేసుకున్నాడు. టోర్నీ సుదీర్ఘంగా సాగుతుంది కాబట్టి మధ్యలో అతడు అందబాటులో వస్తాడని ఆసీస్ ధీమా వ్యక్తం చేసింది.
ఆస్ట్రేలియా సెప్టెంబర్ 6న వన్డే ప్రపంచకప్ జట్టును ప్రకటించింది. ఇద్దరు ప్రధాన స్పిన్నర్ల కోటాలో లెఫ్టార్మ్ స్పిన్నర్ ఏస్టన్ ఆగర్ చోటు దక్కించుకున్నాడు. అయితే దక్షిణాఫ్రికా సిరీసులో అతడు పిక్క గాయంతో బాధపడ్డాడు. తన భార్య మొదటి బిడ్డను ప్రసవించడంతో వెంటనే స్వదేశం వెళ్లాడు. టీమ్‌ఇండియా సిరీస్ ఆడలేదు.
మరోవైపు దక్షిణాఫ్రికాతో ఐదు వన్డేల సిరీసులో మార్నస్ లబుషేన్ 70.75 సగటుతో 283 పరుగులు సాధించాడు. ఇక టీమ్‌ఇండియాతో మూడు వన్డేల సిరీసులో 46 సగటుతో 138 పరుగులు చేశాడు. మంచి ఫామ్‌ను చాటుకున్నాడు. సఫారీలతో నాలుగో వన్డేలో ట్రావిస్ హెడ్ చేతి విరిగింది. అప్పట్నుంచి రిహాబిలిటేషన్‌లో ఉన్నాడు. దాంతో మ్యాచ్ సన్నద్ధత కోల్పోయాడు. 'ఇది కఠిన నిర్ణయం. దురదృష్టవశాత్తు మేం ట్రావిస్ హెడ్, ఏస్టన్ ఆగర్‌ను వన్డే ప్రపంచకప్ టోర్నీకి తీసుకోవడం లేదు. వాళ్లు గాయపడ్డారు' అని చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
'మేం ట్రావిస్ హెడ్‌ను తీసుకోవాలనే నిర్ణయించుకున్నాం. టోర్నీ ఆరంభంలో అందుబాటులో లేకున్నా మధ్యలో వస్తాడు. ఆసీస్ వన్డే జట్టులో అతడు కీలకం. అతడి రాక జట్టులో సానుకూల దృక్పథం తీసుకొస్తుంది. మిచెల్ స్టార్క్, గ్లెన్ మాక్స్‌వెల్ మెరుగ్గా కోలుకుంటున్నారు. టీమ్‌ఇండియాతో మూడో వన్డేలో పునరాగమనం చేయడం సంతోషంగా ఉంది' అని జార్జ్ బెయిలీ అన్నాడు. కాగా మాథ్యూ షార్ట్, తన్వీర్ సంఘా ఐసీసీ వన్డే వార్మప్ మ్యాచులు అయ్యేదాకా భారత్‌లోనే ఉండనున్నారు.
ఆస్ట్రేలియా జట్టు: ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, సేన్ అబాట్, అలెక్స్ కేరీ, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టాయినిస్, ఆడమ్ జంపా
అంతకు ముందు ప్రపంచకప్ 2023 కోసం భారత జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి వచ్చాడు. అక్షర్ పటేల్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ప్రపంచ కప్‌కు ముందు ఆస్ట్రేలియాతో ఆడిన వన్డే సిరీస్‌కు అశ్విన్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ టోర్నీలో అశ్విన్ అద్భుతంగా రాణించాడు. సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. దీంతో వేరే ఆలోచన లేకుండా గాయం కారణంగా జట్టుకు దూరమైన అక్షర్ స్థానంలో అశ్విన్‌కు అవకాశం ఇచ్చారు.