అన్వేషించండి

ICC ODI Ranking: టాప్‌ ప్లేస్‌లో బాబర్‌ ఆజమ్‌ రెండో స్థానానికి పడిపోయిన గిల్‌

ICC ODI Ranking: ఐసీసీ వన్డే ర్యాంకుల్లో టీమిండియా యువ బ్యాటర్ శుభమన్ గిల్ టాప్ ప్లేస్ కోల్పోయాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం తిరిగి నంబర్‌వ‌న్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

ఐసీసీ వన్డే ర్యాంకుల్లో(ICC One Day Ranking) టీమిండియా(Team India ) యువ బ్యాటర్ శుభమన్ గిల్(Shubman Gill) టాప్ ప్లేస్ కోల్పోయాడు. పాకిస్థాన్(Pakistan) కెప్టెన్(Pakistani cricketer) బాబర్ అజామ్‌ (Babar Azam)తిరిగి నంబర్‌వ‌న్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్‌ బ్యాటర్ బాబర్‌ అజామ్‌ 824 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. గిల్‌  పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్‌ శర్మ(Rohit Sharma) మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.డేవిడ్ వార్నర్(David Warner) 5, డారిల్ మిచెల్(Daryl Mitchell) 6, తర్వాతి స్థానాల్లో నిలిచారు. బౌలర్ల విభాగంలో సౌతాఫ్రికా(South Aftrica) బౌలర్ కేశవ్ మహరాజ్(Keshav Maharaj) నంబర్‌వ‌న్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. జోష్ హేజిల్‌వుడ్ (Josh Hazlewood)రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మహ్మద్ షమి(Mohammed Shami) 3, ఆడమ్ జంపా(Adam Zampa)4, బుమ్రా(Jasprit Bumrah) 5 టాప్ 5లో ఉన్నారు.  కుల్‌దీప్‌ యాదవ్(Kuldeep Yadav) ఎనిమిదో స్థానంలో, రవీంద్ర జడేజా(Ravindra Jadeja) 22వ స్థానాల్లో నిలిచారు. బంగ్లాదేశ్ క్రికెటర్(Bangladeshi cricketer) షకీబ్ అల్ హసన్ ( Shakib Al Hasan) నంబర్‌వ‌న్ ఆల్‌రౌండ‌ర్‌గా కొనసాగుతున్నాడు. 

టీ 20లో సూర్యాదే నెంబర్ వన్ ప్లేస్

టీ20 ర్యాంకుల్లో సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) నంబర్‌వ‌న్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. 887 రేటింగ్ పాయింట్లు సూర్య ఖాతాలో ఉన్నాయి. మహమ్మద్  రిజ్వాన్ (Mohammad Rizwan) 2 , ఆడెన్ మార్‌క్ర‌మ్‌(Aiden Markram) 3, బాబర్ అజాం(4), రిలీ రోసోవ్ (Rilee Rossouw) 5 తర్వాతి ర్యాంకుల్లో ఉన్నారు. టీ20ల్లో బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌(Adil Rashid) అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. రషీద్‌ఖాన్‌(Rashid Khan) ఒక స్థానం కోల్పోయి రెండో స్థానంలో, భారత యువ స్పిన్నర్ రవిబిష్ణోయ్‌(Ravi Bishnoi) రెండు స్థానాలు దిగజారి మూడో స్థానానికి పడిపోయారు. 864 రేటింగ్ పాయింట్లతో టెస్టులో నంబర్‌వ‌న్ బ్యాటర్‌గా న్యూజిలాండ్(New Zealand) స్టార్ కేన్ విలియమ్సన్(Kane Williamson) తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) 10వ ర్యాంక్ లో నిలిచాడు. జో రూట్(Joe Root ) 2, స్టీవ్ స్మిత్(Steve Smith ) 3, ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja) 4, బాబర్ అజాం 5 ర్యాంకుల్లో ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) టాప్ బౌలర్‌గా, రవీంద్ర జడేజా నంబర్‌వ‌న్ ఆల్‌రౌండ‌ర్‌గా కొనసాగుతున్నారు. కాగా, మూడు ఫార్మాట్లలోనూ బాబర్ అజామ్‌ టాప్ 5లో ఉన్నాడు. 

అద్భుతాలు సృష్టించింది వీళ్లే

ఈ ఏడాది వన్డే క్రికెట్‌లో అద్భుతాలు సృష్టించిన తొలి పది మంది ఆటగాళ్ల జాబితాలో ముగ్గురు భారత క్రికెటర్లు ఉన్నారు. ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో టీమిండియా దిగ్గజ ఆటగాళ్లే ఉన్నారు. తొలి స్థానంలో గిల్‌ ఉండగా.. రెండో స్థానంలో విరాట్‌ కోహ్లీ.. మూడో స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. స్టార్‌ ఓపెనర్‌ శుభమన్‌ గిల్ ఈ ఏడాది మొత్తం 29 వన్డే మ్యాచ్‌లు ఆడి 63.36 సగటుతో 1584 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2023లో గిల‌్ అత్యధిక స్కోరు 208 పరుగులు. ఈ ఏడాది గిల్ ఒక్కసారి మాత్రమే డకౌట్‌ అయ్యాడు. రెండో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ ఈ ఏడాది 27 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 24 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసి 72.47 సగటుతో 1377 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 8 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2023లో కోహ్లీ అత్యధిక స్కోరు 166 పరుగులు నాటౌట్. ఆ తర్వాత మూడో స్థానంలో ఉన్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ 27 మ్యాచ్‌ల్లో 26 ఇన్నింగ్స్‌ల్లో 52.29 సగటుతో 1255 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు వచ్చాయి. ఈ ముగ్గురు భారత బ్యాట్స్‌మెన్‌లలో రోహిత్ శర్మ  అత్యధికంగా 67 సిక్సర్లు కొట్టాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్‌ ఇక ఈ ఏడాది వన్డే మ్యాచ్‌లు ఆడడం లేదు. దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌కు కూడా ఈ ముగ్గురికి విశ్రాంతి ఇచ్చారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Deepfake Scam: డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
Balayya - Venky : అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Embed widget