అన్వేషించండి

Harmanpreet Kaur Captaincy Era Ends: భారత మహిళల క్రికెట్ లో ముగిసిన శ‌కం.. అన్ని ఫార్మాట్ల సారథ్యానికి హర్మన్ ప్రీత్ కౌర్ గుడ్ బై,

అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి హర్మన్ ప్రీత్ కౌర్ తప్పుకోవడంతో భారత మహిళల క్రికెట్ లో స్మృతి మంధాన కొత్త శకానికి నాంది పలికినట్లయింది.

Historic Leader Steps Down Paving Way For Smriti Mandhana Captaincy Era:  భారత మహిళల క్రికెట్ లో ఒక సువర్ణ అధ్యాయం ముగింపునకు వచ్చింది. భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ ప్రీత్ కౌర్ అన్ని ఫార్మాట్ల సారథ్య బాధ్యతల నుంచి అధికారికంగా తప్పుకుంది. గౌహతిలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహించిన కీలక సమీక్షా సమావేశం తర్వాత ఈ సంచలన నిర్ణయం వెలువడింది. గత కొద్ది నెలల జట్టు ప్రదర్శన, భవిష్యత్ రోడ్‌మ్యాప్‌పై చర్చించేందుకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ కూడా పాల్గొన్నారు. 2016లో పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హర్మన్, తన నాయకత్వంలో భారత్‌కు వన్డే ప్రపంచకప్ విజయం, ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం వంటి చారిత్రక మైలురాళ్లను అందించింది. ఇప్పుడు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన చేతుల్లోకి పగ్గాలు వెళ్లనున్నాయి. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Harmann (@imharmanpreet_kaur)

రక్తమోడ్చా.. భావోద్వేగ నోట్ విడుదల చేసిన హర్మన్
కెప్టెన్సీ నుంచి వైదొలగిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్న హర్మన్‌ప్రీత్ అత్యంత భావోద్వేగ ప్రకటన చేసింది. "ఈరోజు నేను భారత మహిళల క్రికెట్ జట్టు అన్ని ఫార్మాట్ల సారథ్యం నుంచి వైదొలుగుతున్నాను. ఇది సులువైన నిర్ణయం కాదు. ఎన్నో ఏళ్ల జ్ఞాపకాలు, భావోద్వేగాలు, త్యాగాలతో కూడుకున్నది. ఈ జట్టు కోసం నా రక్తం, చెమట, సమయం ధారపోశాను. నా వ్యక్తిగత లక్ష్యాలను పక్కనబెట్టి జట్టు హితానికే ఎల్లప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇచ్చాను. కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, అవి జట్టును మరింత బలోపేతం చేయడానికే ఉద్దేశించినవి. అత్యున్నత విజయాలు, గుండె పగిలే పరాజయాలు రెండింటినీ చూశాను. బాధ్యతను గర్వంగా నిర్వర్తించాననే ప్రశాంతతతో కెప్టెన్సీని వీడుతున్నాను" అని హర్మన్ తన పోస్టులో పేర్కొంది.

Read Also: Ravindra Jadeja Selection Reality: జడ్డూను తప్పించలేదంటూ కెప్టెన్ గిల్ క్లారిటీ.. మూడో వన్డేలో విశ్రాంతిపై అసలు నిజం వెల్లడి 

బ్యాటర్‌గా కెరీర్ కొనసాగింపు.. భారాలు దింపుకుని స్వేచ్ఛా విహారం
నాయకత్వ బాధ్యతల నుంచి మాత్రమే తప్పుకుంటున్నట్లు, ఒక సాధారణ బ్యాటర్‌గా తన కెరీర్ యథావిధిగా కొనసాగుతుందని హర్మన్ స్పష్టం చేసింది. "కెప్టెన్సీ ఇవాళ్టితో ముగియవచ్చు, కానీ భారత క్రికెట్ పై నాకున్న ప్రేమ ఎప్పటికీ మారదు. తోటి క్రీడాకారులు, కోచ్‌లు, బీసీసీఐ, అభిమానులకు నా ధన్యవాదాలు. ఇకపై ఎలాంటి భారం లేకుండా క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాను" అని వెల్లడించింది. సారథ్య బాధ్యతలు, వ్యూహాత్మక ఒత్తిళ్ల నుంచి విముక్తి లభించడంతో హర్మన్ తన విధ్వంసకర బ్యాటింగ్‌పై పూర్తి దృష్టి సారించే అవకాశం ఉంది.

స్మృతి మంధానకు కీలక బాధ్యతలు.. భవిష్యత్ వ్యూహం సిద్ధం
హర్మన్ తర్వాత భారత మహిళల జట్టును ముందుకు నడిపించేందుకు స్మృతి మంధాన పూర్తి సమర్థురాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. రాబోయే ఐసీసీ మెగా టోర్నీలకు ముందు కొత్త వ్యూహాలతో జట్టును తీర్చిదిద్దేందుకు భారత్‌కు తగిన సమయం లభించినట్లయింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Split Captaincy Move: సిరీస్ మధ్యలోనే కెప్టెన్సీ మార్పుతో సంచలనం.. కివీస్ టూర్ కు భారత వన్డే టెస్ట్ జట్ల ప్రకటన, ఆ ప్లేయ‌ర్లకు నో ఛాన్స్
సిరీస్ మధ్యలోనే కెప్టెన్సీ మార్పుతో సంచలనం.. కివీస్ టూర్ కు భారత వన్డే టెస్ట్ జట్ల ప్రకటన, ఆ ప్లేయ‌ర్లకు నో ఛాన్స్
Kavya Maran and Anirudh Wedding: కావ్యా మారన్‌, అనిరుధ్ రవిచందర్ మ్యారేజ్.. సీఎం రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌లకు ఆహ్వానం
కావ్యా మారన్‌, అనిరుధ్ రవిచందర్ మ్యారేజ్.. సీఎం రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌లకు ఆహ్వానం
Surya Luxury Living:  దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
Bilateral Revenue War: వేల కోట్ల ఆదాయం మొత్తం మీకేనా మాకు చిల్లిగవ్వ లేదా.. ద్వైపాక్షిక సిరీస్ రెవెన్యూ షేరింగ్ పై విండీస్ క్రికెట్ బాస్ సంచలన వ్యాఖ్యలు
వేల కోట్ల ఆదాయం మొత్తం మీకేనా మాకు చిల్లిగవ్వ లేదా.. ద్వైపాక్షిక సిరీస్ రెవెన్యూ షేరింగ్ పై విండీస్ క్రికెట్ బాస్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Keerthy Suresh : లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
కొత్త బైక్ కొనేవాళ్లకు అదిరిపోయే అప్‌డేట్.. క్విక్‌షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్‌తో వచ్చిన Xtreme 250R Carbon
దసరా కానుకగా Hero Xtreme 250R Carbon.. TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో కొత్త బైక్ లాంచ్‌
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Ranabaali Day 1 Collections : రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Embed widget