IPL 2024: జార్ఖండ్ గేల్‌కు రోడ్డు ప్రమాదం, ఐపీఎల్‌లో బరిలోకి దిగుతాడా?
Robin Minz: జార్ఖండ్ క్రిస్ గేల్, ధోనీ వారసుడిగా పిలుచుకుంటున్న రాబిన్ మింజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.

IPL 2024 Campaign In Danger: మరో విధ్వంసకర బ్యాటర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడన్న వార్తతో క్రికెట్ ప్రపంచం భయాందోళనలకు గురైంది. జార్ఖండ్ క్రిస్ గేల్, ధోనీ వారసుడిగా పిలుచుకుంటున్న రాబిన్ మింజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఐపీఎల్ 2024 వేలంలో గుజరాత్ టైటాన్స్ రాబిన్‌ను ఊహించని ధర దక్కించుకుంది. రాంచీలో బైక్‌పై వెళ్తుండగా రాబిన్ ప్రయాణిస్తున్న కవాసకీ సూపర్‌బైక్ అదుపు తప్పి వేగంగా వెళ్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని అతడి తండ్రి ఫ్రాన్సిన్ మింజ్ తెలిపాడు. శనివారం ట్రైనింగ్ ముగించుకొని ఇంటికి వస్తుండగా రాబిన్ బైక్ స్కిడ్ అయిందని... ముందు ఒక బండి ఉండడంతో రాబిన్ తన బైక్‌ను నియంత్రించలేక కింద పడిపోయాడని రాబిన్ తండ్రి వెల్లడించాడు. దాంతో, అతడికి చిన్నపాటి గాయాలయ్యాయని... ప్రస్తుతానికి అతడి అరోగ్యాన్ని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని ఫ్రాన్సిస్ వెల్లడించాడు. ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ఇంకా రెండు వారాల పైనే ఉంది. ఆలోపు రాబిన్ కోలుకోవాలని గుజరాత్ అభిమానులు కోరుకుంటున్నారు. 21 ఏళ్ల రాబిన్‌ను 2024 ఐపీఎల్ వేలంలో గుజరాత్ టైటాన్స్ 3.6 కోట్లకు సొంతం చేసుకుంది.
జార్ఖండ్ నుంచి ఐపీఎల్‌కు...
రాబిన్‌ది జార్ఖండ్‌లోని గుల్మా జిల్లా. అతడి ప్రతిభను గమనించిన ముంబై ఇండియన్స్ ప్రత్యేకంగా లండన్‌లో శిక్షణ ఇప్పించింది. ప్రస్తుతం రాబిన్ కుటుంబం రాంచీలో ఉంటోంది. ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్ అయిన అతడి తండ్రి ఫ్రాన్సిన్ మించ్ రాంచీ విమానాశ్రయం(Ranchi Airport)లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. ఈమధ్యే గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. ఫ్రాన్సిస్‌ను కలిసి ఫొటో కూడా దిగాడు. సరిగ్గా టోర్నీ ప్రారంభానికి 19 రోజుల ముందే రాబిన్ యాక్సిడెంట్‌కు గురి అయ్యాడు. రాబిన్ ఇటీవల కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో భాగంగా కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో క్వార్టర్ ఫైనల్లో సెంచరీతో (137) మెరిశాడు. ఆ మ్యాచ్‌లో రాబిన్ శతక్కొట్టినా అతను ప్రాతినిథ్యం వహించిన ఝార్ఖండ్ టీమ్ ఓటమిపాలైంది.
ఐపీఎల్ ఎప్పటినుంచంటే..?
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(Indian Premier League) షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22న ఐపీఎల్ మహా సమరం ప్రారంభం కానుంది. దేశంలోనే పూర్తిగా ఐపీఎల్ నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ 17వ ఎడిషన్ మొదటి 15 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించారు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు జరిగే మ్యాచ్‌లను తెలిపారు. చెన్నై సూపర్ కింగ్స్... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ధోనీ, కోహ్లీ మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చెన్నై చెపాక్ స్టేడియంలో కోహ్లీ టీంకు చాలా చెత్త రికార్డు ఉంది. ఇక్కడ ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 8 మ్యాచులు ఆడగా కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే బెంగళూరు గెలుపొందింది. ఇక్కడ మొత్తం ధోనీ జట్టు మానియానే నడుస్తుంది. మైదానమంతా పసుపుమయంగా మారుతుంది.




















