FIR against Yash Dayal: ఆర్సీబీ ప్లేయర్ యష్ దయాల్ పై రేప్ కేసు నమోదు, క్రికెటర్‌పై మరో యువతి సంచలన ఆరోపణలు
Yash Dayal Rape Case | క్రికెటర్ యష్ దయాల్ పై అత్యాచారం, పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. రెండు సంవత్సరాలుగా తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది.

POCSO Case Against Yash Dayal | జైపూర్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యష్ దయాల్ కు మరిన్ని చిక్కులు తప్పడం లేదు. యశ్ దయాల్ పై మరోచోట అత్యాచారం కేసు నమోదు చేసింది. ఇటీవల యూపీలోని ఘజియాబాద్ తర్వాత ఇప్పుడు రాజస్తాన్ లోని జైపూర్‌లో కూడా యష్ దయాల్‌పై కేసు నమోదైంది. క్రికెటర్‌గా కెరీర్ వచ్చేలా చేస్తానని నమ్మించి తనపై 2 సంవత్సరాలు అత్యాచారం చేశాడని ఆ యువతి సంచలన ఆరోపణలు చేసింది.
యువతి ఫిర్యాదు మేరకు, IPL లో ఆర్సీబీకి ఆడుతున్న ఫాస్ట్ బౌలర్ యష్ దయాల్‌పై జైపూర్‌లో అత్యాచారంతో పాటు పోక్సో చట్టం కింద FIR నమోదు అయింది. క్రికెట్ కెరీర్ కోసం హెల్ప్ చేస్తానని నమ్మించి, ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేసి తనపై రెండు సంవత్సరాలుగా యష్ దయాల్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ యువతి ఆరోపించింది.
యష్ దయాల్‌పై అత్యాచారం కేసు నమోదు
బాధితురాలు జైపూర్‌లోని సంఘనేర్ సదర్ పోలీస్ స్టేషన్‌లో యష్ దయాల్‌పై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు అత్యాచారం, పోక్సో చట్టం ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సంఘనేర్ సదర్ SHO అనిల్ జైమన్ ప్రకారం, జైపూర్‌కు చెందిన ఒక అమ్మాయి క్రికెట్ ఆడుతున్న సమయంలో యష్ దయాల్‌తో పరిచయం ఏర్పడింది.
ఆమె మైనర్‌గా ఉన్నప్పుడు రెండు సంవత్సరాల క్రితం జైపూర్‌లో యష్ దయాల్‌ను కలిసినట్లు యువతి ఆరోపించింది. ఆ సమయంలో యష్ దయాల్ IPL మ్యాచ్ ఆడేందుకు జైపూర్‌కు వచ్చాడు. క్రికెట్‌లో కెరీర్ గురించి సలహా ఇస్తానని చెప్పి, యష్ దయాల్ ఆమెను హోటల్‌కు ఆహ్వానించాడు. వెళ్లిన తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు చెబుతోంది.
మైనర్ పై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు
క్రికెట్‌లో మంచి కెరీర్ వచ్చేలా చేస్తానని నమ్మించి గత రెండేళ్లుగా యష్ దయాల్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్, నిరంతర వేధింపులతో విసిగిపోయిన బాధితురాలు సంఘనేర్ సదర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిందని పోలీసులు తెలిపారు. ఈ కేసుపై SHO అనిల్ జైమన్ మాట్లాడుతూ.. బాధితురాలు ఫిర్యాదు ప్రకారం యశ్ దయాల్ పై కేసులు నమోదు చేశాం. IPL 2025 మ్యాచ్ సమయంలో జైపూర్‌కు వచ్చిన యష్ దయాల్ సీతాపురలోని ఒక హోటల్‌కు పిలిచి మరోసారి అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు స్పష్టం చేశారు.
పోక్సో చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు
పోలీస్ అధికారి అనిల్ జైమన్ మాట్లాడుతూ.. బాలిక 17 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు, యశ్ దయాల్ మాటలతో నమ్మించి తనపై అత్యాచారం చేశాడని చెప్పింది. క్రికెటర్ లేకపోవడం, మరోవైపు లైంగిక, మానసిక వేధింపులు భరించలేక ఫిర్యాదు చేసిందన్నారు. ఈ క్రమంలో పోలీసులు యష్ దయాల్‌పై పోక్సో చట్టం కింద సైతం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
కాగా, కొన్ని రోజుల కిందట యశ్ దయాల్ పై ఇలాంటి కేసు నమోదు అయింది. యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన ఒక అమ్మాయి క్రికెటర్ యష్ దయాల్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపించింది. ఆధారాలు సమర్పించిన తరువాతే పోలీసులు కేసు నమోదు చేశారని తెలసిందే. ఆ కేసులో అలహాబాద్ హైకోర్టు యష్‌కు ఊరటనిచ్చింది. తాజాగా జైపూర్‌లోనూ యశ్ దయాల్ పై అత్యాచారంతో పాటు పోక్సో కేసు సైతం నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




















