అన్వేషించండి

Shreyas Iyer: బీసీసిఐ కాంట్రాక్ట్‌నుంచి అయ్యర్‌ను త‌ప్పించ‌డంపై ఫ్యాన్స్ ఆగ్రహం

టీమిండియా క్రికెట‌ర్ శ్రేయస్ అయ్యర్ ని బీసీసిఐ సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌నుంచి త‌ప్పించ‌డంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు.

టీమిండియా క్రికెట‌ర్ శ్రేయస్ అయ్యర్ ని బీసీసిఐ సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌నుంచి త‌ప్పించ‌డంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. శ్రేయ‌స్ జ‌ట్టు కోసం ఆడే ఆట‌గాడు అని... మిడిలార్డ‌ర్‌లో కీల‌క స‌భ్యుడు అని, జ‌ట్టును ఎన్నో సంద‌ర్భాల్లో ఆదుకొన్న ఆట‌గాడు అనీ.. ఇలాంటి ప్లేయ‌ర్ ని క‌నీస గౌర‌వం ఇచ్చి, బీసీసిఐ కాంట్రాక్ట్‌లోకి తీసుకోక‌పోవ‌డాన్ని త‌ప్పుప‌డుతున్నారు.

శ్రేయ‌స్ అయ్య‌ర్  ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌నుంచి  గాయం కార‌ణంగా త‌ప్పుకొన్నాడు, అయితే అత‌న్ని రంజీ  మ్యాచ్ లు ఆడాల‌ని బీసీసిఐ ఆదేశించింది. వెన్నునొప్పి కార‌ణంగా  సాధ్యం కాద‌ని చెప్పాడు. కొంత‌కాలం నుంచి శ్రేయ‌స్ వెన్నునొప్పితోనే ఆడుతున్నాడు. అయితే ఈ సారి ఐపీయ‌ల్‌, టీ-20 ప్ర‌పంచ‌క‌ప్ కి ఎక్కువ స‌మ‌యం లేక‌పోవ‌డం, వ‌రుస‌గా మ్యాచ్ లు ఆడుతున్న‌ నేప‌థ్యంలో రంజీలు ఆడ‌లేను అని చెప్పాడు. అయినా విన‌ని బీసీసిఐ అత‌న్నిసెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌లోకి తీసుకోలేదు.

 అయితే శ్రేయ‌స్ అయ్య‌ర్ 2023 ప్రపంచ కప్ లో  ఆడటంకోస‌మే ఆ సంవ‌త్స‌రం ఐపీయ‌ల్‌ వ‌దులుకొన్నాడు. ప్ర‌పంచ క‌ప్ స‌మ‌యంలో కూడా  నొప్పి లేకుండా ఉండటానికి 3 కార్టిసోన్ ఇంజెక్షన్లు తీసుకున్నాడు. సెమీస్ & ఫైనల్స్ సమయంలో నొప్పి ఇబ్బంది పెట్టినా అప్ప‌టికే హార్ధిక్ పాండ్యా దూర‌మై టీం మిడిలార్డ‌ర్ బ‌ల‌హీన‌ప‌డ్డ నేప‌థ్యంలో నొప్పి భ‌రిస్తూనే జ‌ట్టుకోసం ఆడాడు. తర్వాత T20I సిరీస్, దక్షిణాఫ్రికా సిరీస్, ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్‌లో కూడా ఆడాడని ఫ్యాన్స్ గుర్తుచేస్తున్నారు.

  అంతేకాకుండా వ‌న్డేల్లో 50 స‌గ‌టుతో, టీ20ల్లో 30కి పైగా స‌గ‌టుతో బ్యాటింగ్ చేప్తోన్న శ్రేయ‌స్ ని ఇలా చిన్న‌కార‌ణంతో ప‌క్క‌కు పెట్ట‌బడం స‌రికాద‌నే చ‌ర్చ సాగుతోంది. ఈ సారి క‌రేబియ‌న్ దీవుల్లో టీ-20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో మిడిలార్డ‌ర్ లో అనుభ‌వం ఉన్న శ్రేయ‌స్ ఉండాల్సిందే అని ఫ్యాన్స్ అంటున్నారు. లాగే ఫామ్ ప‌రంగా చూసినా, ఫిట్‌నెస్ ప‌రంగా  చూసినా శ్రేయ‌స్ ఎప్పుడూ ముందుంటాడు. జ‌ట్టుకోసం ఆలోచించే శ్రేయ‌స్ గురించి బీసీసిఐ పున‌రాలోచ‌న చేయాల్సిందే అంటున్నారు. సీనియ‌ర్లు రోహిత్‌,విరాట్,రాహుల్‌ త‌ర్వాత  బ్యాటింగ్ భారాన్ని మోసే శ్రేయ‌స్‌ని ఇలా అవ‌మానించ‌డం బాధాక‌రం అంటున్నారు.
 
 ఒక్క రంజీమ్యాచ్ కోసం అంత‌ర్జాతీయ క్రికెట‌ర్ అయిన శ్రేయ‌స్ పై ఇలాంటి చ‌ర్య తీసుకోవ‌డం ప‌ట్ల ఫ్యాన్స్ మాత్ర‌మే కాదు క్రికెట్ విశ్లేష‌కులు కూడా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్పుడు శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు ఏంటి అన్న సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. కాంట్రాక్ట్ మ‌ళ్ళీ పున‌రుద్ధ‌రిస్తారా? ఐపీయ‌ల్ లో రాణించినా టీ-20 ప్ర‌పంచ‌క‌ప్‌కి ఎంపిక చేస్తారా చేయ‌రా అన్న సందేహం క‌లుగుతోంది. 

  శ్రేయ‌స్ అయ్య‌ర్‌, ఇషాన్ కిష‌న్ కార‌ణాల‌ను క‌లిపి చూడొద్దని, ఎంతో భ‌విష్య‌త్తు ఉన్న‌ శ్రేయ‌స్ ప‌ట్ల నిర్ణ‌యంపై మ‌ళ్లీ ఆలోచించాల్సిందిగా ఫ్యాన్స్ విజ్ణప్తి చేస్తున్నారు. అస‌లు ఎంతమంది సీనియ‌ర్ క్రికెట‌ర్లు రంజీలు ఆడుతున్నారు అంటూ ప్ర‌శ్నిస్తున్నారు ఫ్యాన్స్‌.  ఏది ఏమైనా కీల‌క ఆట‌గాడి ప‌ట్ల ఇంత నిర్ద‌య‌గా వ్య‌వ‌హ‌రించ‌డం అత‌డి మాన‌సిక స్థైర్యాన్ని దెబ్బ‌తీస్తుంద‌ని, క‌మిట్మెంట్ ఉన్న ఆట‌గాడి ప‌ట్ల ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం బీసీసిఐ కి క‌రెక్ట్ కాద‌ని ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

IND VS ENG Historic Lords Test: లార్డ్స్ హిస్టారికల్ టెస్ట్ కు హర్మన్‌ప్రీత్ కౌర్ సేన రెడీ.. 142 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఇంగ్లాండ్‌తో చారిత్రాత్మక పోరు, శ్రీ చరణి డెబ్యూ ఫిక్స్!
హిస్టారికల్ లార్డ్స్ టెస్ట్ కు హర్మన్‌ప్రీత్ కౌర్ సేన రెడీ.. 142 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఇంగ్లాండ్‌తో చారిత్రాత్మక పోరు, శ్రీ చరణి డెబ్యూ ఫిక్స్!
Yograj VS Kapil Dev Controversy: యోగ్‌రాజ్ పిస్టల్ వార్నింగ్ పై కపిల్ దేవ్ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్.. యువరాజ్ తండ్రి గన్ పట్టుకుని, కపిల్ ఇంటికి వచ్చి..
యోగ్‌రాజ్ పిస్టల్ వార్నింగ్ పై కపిల్ దేవ్ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్.. యువరాజ్ తండ్రి గన్ పట్టుకుని, కపిల్ ఇంటికి వచ్చి..
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Dada Sourav Ganguly Comments: గంగూలీ 54వ బర్త్‌డే వేళ టీమిండియా ఓటమిపై సంచలన కామెంట్స్.. సంజూ శాంసన్ వివాదంపై 'దాదా' సేఫ్ గేమ్, రాజ్ కుమార్ రావు 'బయోపిక్' పోస్టర్ లాంచ్!
గంగూలీ 54వ బర్త్‌డే వేళ టీమిండియా ఓటమిపై Hot కామెంట్స్.. సంజూ శాంసన్ వివాదంపై 'దాదా' సేఫ్ గేమ్, రాజ్ కుమార్ రావు 'బయోపిక్' పోస్టర్ లాంచ్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MS Raju vs Thopudurthi Prakash Reddy: అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Sai Pallavi : కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
Embed widget