అన్వేషించండి
Advertisement
Praveen Kumar: మన క్రికెటర్లు అందరూ తాగోబోతులే,ప్రవీణ్‌కుమార్ సంచలన ఆరోపణ
Indian cricket legends: టీమిండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతంలో జట్టులో ఉన్న ఆటగాళ్లందరికీ మద్యం అలవాటు ఉండేదని తెలిపాడు.
టీమిండియా(Team India) మాజీ పేసర్(Former Indian pacer) ప్రవీణ్ కుమార్(Praveen Kumar) సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనపై అకారణంగా తాగుబోతనే నింద పడిందని ఆవేదన వ్యక్తం చేస్తూ గతంలో జట్టులో ఉన్న ఆటగాళ్లందరికీ మద్యం అలవాటు ఉండేదని తెలిపాడు. 2007-2012 మధ్య ప్రవీణ్ భారత జట్టులో కొనసాగాడు. ఆ సమయంలో టీమిండియాలో ఉన్నప్పుడు మందు తాగొద్దని సీనియర్లు సలహా ఇచ్చేవారని... కానీ ఆ పని అందరూ చేసేవారని ప్రవీణ్‌కుమార్ అన్నాడు. మరోవైపు తానొక్కడినే తాగుతాననే చెడ్డపేరు వచ్చేలా చేశారని ప్రవీణ్ తెలిపాడు. సచిన్, ద్రవిడ్, గంగూలీలాంటి వారు అలా చెప్పేవారా... అనే ప్రశ్నకు.. పేరు చెప్పను కానీ.. ఆ క్రికెటర్ ఎవరో అందరికీ తెలుసని ప్రవీణ్ వ్యాఖ్యానించాడు.
అందరూ తాగేవారే..
ది లలన్‌టాప్ ఓనర్ సౌరభ్ ద్వివేది నిర్వహిస్తున్న ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ప్రవీణ్ కుమార్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలోనే భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఆడినప్పుడు ఉన్న జట్టులో అందరూ మద్యం తాగేవాళ్లని, ఏ ఒక్కరూ అందుకు మినహాయింపు కాదని తెలిపాడు. తాను భారత జట్టులో ఉన్నప్పుడు తాగొద్దు. ఇలా ఉండొద్దు.. అలా ఉండొద్దని సీనియర్లు తనతో చెప్పేవాళ్లని... కానీ అప్పుడు టీమ్‌లో అందరూ తాగేవాళ్లని ప్రవీణ్ తెలిపాడు. కానీ వాళ్లంతా తాను మాత్రమే తాగేవాడిని అని నన్ను బద్నాం చేశారని వాపోయాడు. వీరిలో ఎవరైనా తాగొద్దని సలహాలు ఇచ్చారా అన్న ప్రశ్నకు కూడా ప్రవీణ్ కుమార్ స్పందించాడు. తాను పేరు చెప్పను కానీ అందరూ తనకు సలహాలు ఇచ్చేవారని... అలా చెప్పినవాళ్లు ఎవరో ప్రజలందరికీ తెలుసని అన్నాడు. ప్రవీణ్‌కు ఆ సలహాలు ఇచ్చింది ఎవరు..? తన పేరును బద్నాం చేసిందెవరు..? అన్నది మాత్రం అతడు వెల్లడించలేదు.
లలిద్ మోడీ భయపెట్టాడు..
ఇవేకాకుండా ప్రవీణ్‌కుమార్ మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీ తనను భయపెట్టాడని, కెరీర్ నాశనం చేస్తానని బెదిరించాడని ప్రవీణ్ అన్నాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కాంట్రాక్టుపై సంతకం చేయకుంటే తన కెరీర్‌ను నాశానం చేస్తానని లలిత్ మోడీ బెదిరించాడని ప్రవీణ్ తెలిపాడు. ఐపీఎల్ తొలి సీజన్‌లో ఆర్సీబీకి బదులు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడాలనుకున్నానని... కానీ లలిత్ మోడీ బెదిరించాడని తెలిపాడు. అప్పుడు ఒకతను తనను కాంట్రాక్టుపై సంతకం చేయమన్నాడని.. ఆ పేపర్స్ ఆర్సీబీ కాంట్రాక్టు సంబంధించినవని తెలిసి తాను ఒప్పుకోలేదని గుర్తు చేసుకున్నాడు. లలిత్ మోడీ తనను పక్కకు పిలిచి.. బెంగళూరుకే ఆడాలని బెదిరించాడు. కాంట్రాక్ట్‌పై సంతకం పెట్టకుంటే తన కెరీర్ నాశనం చేస్తానని భయపెట్టాడని ప్రవీణ్ వెల్లడించాడు.
ప్రవీణ్ కుమార్ కెరీర్‌లో సచిన్, ద్రావిడ్, గంగూలీ, ధోని, సెహ్వాగ్, గంభీర్, యువరాజ్ వంటి ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాడు. ప్రవీణ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయిదేళ్ల కెరీర్‌లో ప్రవీణ్ కుమార్.. ఆరు టెస్టులు, 68 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. టీమిండియా తరఫున ఆరు టెస్టులు, 68 వన్డేలు, 10 టీ20లు మాత్రమే ఆడాడు. ఇక ఐపీఎల్‌లో ఆర్సీబీ, కింగ్స్ లెవన్ పంజాబ్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్ ఫ్రాంచైజీలకు ఆడాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
హైదరాబాద్
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement