అన్వేషించండి
Advertisement
ENG vs SA: దక్షిణాఫ్రికా చేతిలో ఇంగ్లండ్ చిత్తు, టార్గెట్ సగం కూడా రీచ్ కాని డిఫెండింగ్ ఛాంపియన్
ODI World Cup 2023: ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా ఘన విజయాన్ని నమోదు చేసింది. పూర్తి ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది.
ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా ఘన విజయాన్ని నమోదు చేసింది. పూర్తి ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. తొలుత దక్షిణాఫ్రికా బ్యాటర్లు విధ్వంసం సృష్టించిన... తర్వాత బౌలర్లు చెలరేగిపోయారు. ప్రొటీస్ విధించిన 400 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ 22 ఓవర్లలో కేవలం 170 పరుగులకే కుప్పకూలింది. దీంతో 229 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. అనంతరం 400 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బ్రిటీష్ జట్టు కేవలం 22 ఓవర్లలో 170 పరుగులకే కుప్పకూలింది. పసికూన నెదర్లాండ్స్ చేతిలో చిత్తయిన దక్షిణాఫ్రికా... డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను మట్టికరిపించి మళ్లీ సత్తా చాటింది.
దక్షిణాఫ్రికా బ్యాటర్ల ఊచకోత
కీలకమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్.. దక్షిణాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోసిన ప్రొటీస్ బ్యాటర్లు మరోసారి స్కోరు బోర్డును పరుగులు దాటించారు. అలా వచ్చి రాగానే ఓపెనర్ క్వింటన్ డికాక్.. తోప్లే వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే ఫోర్ కొట్టాడు. కానీ తర్వాతి బంతికే కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. స్కోరు బోర్డు మీద నాలుగు పరుగులు చేరాయో లేదో డికాక్ పెవిలియన్ చేరాడు. కానీ ఈ ఆనందం ఇంగ్లాండ్‌కు ఎక్కువసేపు నిలువలేదు. రెండో వికెట్‌కు హెన్రిక్స్-వాన్‌డేర్ డస్సెన్ జోడి 121 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. ప్రమాదకరంగా మారుతున్న హెన్రిక్స్-హెన్రిక్స్-వాన్‌డేర్ డస్సెన్ జోడి జోడిని అదిల్ రషీద్ విడదీశాడు. 61 బంతుల్లో 60 పరుగులు చేసిన వాన్‌డేర్ డస్సెన్‌ను రషీద్ అవుట్ చేశాడు. 85 పరుగులు చేసి సెంచరీ దిశగా సాగుతున్న రీజా హెన్డ్రిక్స్‌ను రషీద్ బౌల్డ్ చేశాడు.
ఆ తర్వాత క్లాసెన్, జాన్సన్ మెరుపు బ్యాటింగ్‌తో ప్రొటీస్ స్కోరు బోర్డును పరుగు పెట్టించారు. క్లాసెన్ మెరుపు శతకంతో చెలరేగాడు. కేవలం 67 బంతులు ఎదుర్కొన్న క్లాసెన్ 12 ఫోర్లు, 4 సిక్సులతో 109 పరుగులు చేసి అవుటయ్యాడు. జాన్సన్ 42 బంతుల్లోనే 75 పరుగులు చేశాడు. క్లాసెన్‌కు తోడు జాన్సన్ కూడా చివరి పది ఓవర్లలో విధ్వంసం సృష్టించాడు. క్లాసెన్‌తో పాటు చివర్లో జాన్సన్ మెరుపులు మెరిపించడంతో దక్షిణాఫ్రికా ఈ ప్రపంచకప్‌లో మరోసారి భారీ స్కోరు చేసింది. క్లాసెన్ అద్భుత శతకానికి తోడు హెన్డ్రిక్స్ 85 పరుగులు, వాన్‌డెర్ డస్సెన్ 60, మార్‌క్రమ్ 42, రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి దక్షిణాఫ్రికా 399 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో తోప్లే 3, అదిల్ రషీద్ రెండు వికెట్లు తీశారు.
పేకమేడలా కూలిన వికెట్లు
దక్షిణాఫ్రికా నిర్దేశించిన 400 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు ప్రొటీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. జట్టు స్కోరు 18 పరుగుల వద్ద బెయిర్ స్టో అవుటవ్వడంతో బ్రిటీష్ జట్ల వికెట్ల పతనం ప్రారంభమైంది. బెయిర్ స్టోను ఎంగిడి అవుట్ చేయగా... స్కోరు బోర్డుపై మరో అయిదు పరుగులు చేరాయో లేదో డేవిడ్ మలన్‌ను జాన్సన్ అవుట్ చేయడంతో 23 పరుగులకే ఇంగ్లాండ్ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా వికెట్ల పతనం కొనసాగింది. జో రూట్ రెండు పరుగులకే వెనుదిరగగా... ఎన్నో ఆశలు పెట్టుకున్న బెన్ స్టోక్స్ అయిదు పరుగులు చేసి రబాడ బౌలింగ్ అవుటవ్వడంతో 38 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత కాసేపు వికెట్ల పతనం ఆగింది. కానీ 17 పరుగులు చేసిన బ్రూక్‌ను..15 పరుగులు చేసిన బట్లర్‌ను వెంటవెంటనే అవుట్ చేసిన కోట్జే బ్రిటీష్‌జట్టును చావు దెబ్బ కొట్టాడు. 68 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు వందలోపే ఆలౌటయ్యేలా కనిపించింది.
కానీ బ్రిటీష్ జట్టను టెయిలెండర్లు ఆదుకున్నారు. డేవిడ్ విల్లీ 12 పరుగులు, అదీల్ రషీద్ 10 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. అటిక్సన్ 21 బంతుల్లో ఏడు ఫోర్లతో 35, మార్క్ వుడ్ 17 బంతుల్లో 2 ఫోర్లు, అయిదు సిక్సులతో 43 పరుగులతో అజేయంగా నిలిచాడు. తోప్లే అబ్సెంట్ హర్ట్ కావడంతో ఇంగ్లాండ్ కథ ముగిసింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
గాడ్జెట్స్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion