By: ABP Desam | Updated at : 01 Dec 2022 07:42 PM (IST)
సెంచరీ చేసిన ఓలీ పోప్‌ను అభినందిస్తున్న హ్యారీ బ్రూక్ (Image Credits: ECB)
పాకిస్తాన్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో ఇంగ్లండ్ పరుగుల వరద పారించింది. రావల్పిండి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసేసరికి 75 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది. టాప్-5లో ఏకంగా నలుగురు బ్యాటర్లు సెంచరీలు చేయడం విశేషం. వెలుతురు సరిగ్గా లేకపోవడంతో 15 ఓవర్ల ముందే ఆట నిలిపివేశారు. లేకపోతే ఇంకెన్ని రికార్డులు బద్దలయ్యేవో మరి!
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు జాక్ క్రాలే (122: 111 బంతుల్లో, 21 ఫోర్లు), బెన్ డకెట్ (107: 110 బంతుల్లో, 15 ఫోర్లు) చెలరేగి ఆడారు. లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ 29 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 174 పరుగులు చేసింది. అయితే మొదటి సెషన్‌లో జాక్ క్రాలే 38 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకోగా, బెన్ డకెట్ హాఫ్ సెంచరీకి 50 బంతులు అవసరం అయ్యాయి.
ఇక రెండో సెషన్‌లో ఇంగ్లండ్ వేగం కాస్త తగ్గింది. జాక్ క్రాలే 86 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం బెన్ డకెట్ కూడా తన మొదటి సెంచరీని సాధించాడు. మొదటి వికెట్‌కు 216 బంతుల్లోనే 233 పరుగులు జోడించాక బెన్ డకెట్, జాక్ క్రాలే ఇద్దరూ వరుస ఓవర్లలో అవుటయ్యారు. బెన్ డకెట్‌ను జహీద్ మహమూద్, జాక్ క్రాలేని హరీస్ రౌఫ్ అవుట్ చేశారు. ఆ తర్వాత వచ్చిన జో రూట్ (23: 31 బంతుల్లో, మూడు ఫోర్లు) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. జహీద్ మహమూదే రూట్‌ను కూడా అవుట్ చేశాడు. ఈ సెషన్‌లో 27 ఓవర్లలో ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయి 158 కోల్పోయింది. దీంతో ఇంగ్లండ్ స్కోరు 54 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 332 పరుగులకు చేరుకుంది.
ఇక మూడో సెషన్‌లో ఇంగ్లండ్ బ్యాటింగ్ టాప్ గేర్‌కు చేరుకుంది. ఓలీ పోప్ (108: 104 బంతుల్లో, 14 ఫోర్లు), హ్యరీ బ్రూక్‌లు (101 బ్యాటింగ్: 81 బంతుల్లో, 14 ఫోర్లు, రెండు సిక్సర్లు) చెలరేగి ఆడుతూ స్కోరును పరుగులు పెట్టించారు. ఈ దశలోనే 91 బంతుల్లోనే ఓలీ పోప్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇదే ఓవర్లో 51 బంతుల్లోనే బ్రూక్ అర్థ సెంచరీ కూడా పూర్తయింది. సౌద్ షకీల్ వేసిన ఇన్నింగ్స్ 68వ ఓవర్లో హ్యారీ బ్రూక్ ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టేశాడు.
ఆ తర్వాత మహ్మద్ అలీ బౌలింగ్‌లో ఓలీ పోప్ అవుటయ్యాడు. ఇన్నింగ్స్ 74వ ఓవర్లో బౌండరీతో హ్యారీ బ్రూక్ 80 బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు. ఆ తర్వాత వచ్చిన బెన్ స్టోక్స్ (34 బ్యాటింగ్: 15 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) కూడా సిక్సర్లు, ఫోర్లతో చెలరేగాడు. దీంతో ఇంగ్లండ్ 75 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 506 పరుగులు సాధించింది. చివరి సెషన్‌లో కేవలం 21 ఓవర్లలోనే ఇంగ్లండ్ 74 పరుగులు సాధించడం విశేషం. పాకిస్తాన్ బౌలర్లలో జహీద్ మహమూద్‌కు రెండు వికెట్లు దక్కగా, హరీస్ రౌఫ్, మహ్మద్ అలీ చెరో వికెట్ పడగొట్టారు.
కేవలం 75 ఓవర్లే బ్యాటింగ్ చేసినా టెస్టుల్లో మొదటి రోజు అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. 1910లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా సాధించిన 494 పరుగుల రికార్డును ఇంగ్లండ్ బద్దలు కొట్టింది. దాదాపు 112 సంవత్సరాల తర్వాత ఇంగ్లండ్ ఈ రికార్డును బద్దలు కొట్టడం విశేషం.
Shaheen Afridi Marriage: షాహిద్ అఫ్రిది కుమార్తెను వివాహమాడిన పాక్ యువ బౌలర్ షహీన్
IND Vs AUS: మొదటి టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ - గాయంతో కీలక ఆటగాడు దూరం!
IND vs NZ: ఆ రికార్డు సృష్టించిన మొదటి భారత ఆల్‌రౌండర్ హార్దికే - ఏంటో తెలుసా?
Ashwin On Steve Smith: మీ స్లెడ్జింగ్, మైండ్‌గేమ్స్ మాకు తెలుసులే! ఆసీస్‌కు యాష్ పవర్ఫుల్ పంచ్!
IND vs AUS: విశాఖలో మ్యాచ్ ఉందని గుర్తుందా! బోర్డర్-గావస్కర్ ట్రోఫీ షెడ్యూలు, టైమింగ్స్, వేదికలు ఇవే!
Government Websites Hacked: ప్రభుత్వ వెబ్సైట్లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు,అలెర్ట్ అవుతున్న అధికారులు
Amigos Pre Release - NTR Jr : అన్నయ్య కోసం వస్తున్న ఎన్టీఆర్ - రేపే కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ప్రీ రిలీజ్
Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?
Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!