అన్వేషించండి

DC vs RCB WPL : ఊపిరి బిగపట్టి మునివేళ్లపై నిలబెట్టి, ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ విజయం

DC vs RCB WPL 2024: వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌  మరో ఉత్కంఠభరిత పోరు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై... ఢిల్లీ కేవలం ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.

 Delhi Capitals Edge Past Royal Challengers Bangalore in a Last ball Thriller: వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌(WPL)  మరో ఉత్కంఠభరిత పోరు క్రికెట్‌(Cricket) అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB)పై... ఢిల్లీ(DC) కేవలం ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ 181 పరుగుల భారీ స్కోరు చేసింది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన RCB నిర్ణీత ఓవర్లలో 180 పరుగులకే పరిమితమైంది. కేవలం ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ విజయం సాధించింది.

మ్యాచ్‌ సాగిందిలా..
 టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్లు మెగ్‌ లానింగ్‌ 29 పరుగులు, షఫాలీ వర్మ 23 పరుగులతో.. ఢిల్లీకి పర్వాలేదనిపించే ఆరంభం ఇచ్చారు. ఆ తర్వాత జెమీమా రోడ్రిగ్స్‌  కేవలం 36 బంతుల్లో 8 ఫోర్లు... ఒక సిక్సుతో 58 పరుగులు చేసి రాణించింది. అనంతరం అలీస్‌ క్యాప్సీ 48 కూడా ధాటిగా ఆడింది. వీరి విధ్వంసంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానకిి 181 పరుగులు చేసింది. ఆర్సీబీ శ్రేయంకా పాటిల్ నాలుగు, శోభన ఒక వికెట్ పడగొట్టారు.

లక్ష్యం దిశగా సాగినా..
182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులకే పరిమితమైంది. చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన సమయంలో రిచా ఘోష్‌ రనౌట్‌ కావడంతో ఢిల్లీ గెలుపొందింది. రిచా ఘోష్‌ చివరి బంతి వరకూ పోరాడినా ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. రిచా కేవలం 29 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్సులతో 51 పరుగులు చేసి చివరి బంతికి రనౌట్‌గా వెనుదిరిగింది. బెంగళూరు గెలవాలంటే చివరి 18 బంతుల్లో 40 పరుగులు చేయాలి. ఈ దశలో ఆర్సీబీ గెలుస్తుందని ఎవరూ ఊహించనే లేదు. కానీ రిచా ఘోష్‌ 18, 19 ఓవర్లలో 23 పరుగులు రాబట్టింది. చివరి ఓవర్‌లో గెలుపునకు 17 పరుగులు అవరమవ్వగా... తొలి బంతినే సిక్సుగా మలచిన రిచా... మూడో బంతికి పరుగు తీసే క్రమంలో దిశా కాసత్‌ రనౌట్‌ అయింది. లక్ష్యం మూడు బంతుల్లో 10 పరుగులుగా మారింది. నాలుగో బంతికి రెండు పరుగులు తీయగా, ఐదో బంతికి రీచా మళ్లీ సిక్స్‌ కొట్టింది. సమీకరణం  చివరి బంతికి రెండు పరుగులుగా మారింది. ఇరుజట్లతో పాటు మ్యాచ్‌ చూస్తున్న వారిలో ఉత్కంఠ తారా స్థాయికి చేరింది. అయితే చివరి బంతికి పరుగు తీసే క్రమంలో రిచా రనౌట్‌ కావడంతో ఆర్సీబీ కథ ముగిసింది. బెంగళూరు బ్యాటర్లలో ఎలిస్‌ పెర్రీ(49), సోఫీ మోలినెక్స్‌ (33), సోఫీ డివైన్‌ (26) విలువైన పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో మారిజానె కాప్‌, ఎలిస్‌ క్యాప్సీ, షిఖా పాండే, అరుంధతీ రెడ్డి తలో వికెట్‌ తీశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Weak Passwords: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Pawan Kalyan: తిరుపతి ప్రజలకు ఆ రోజు శ్రీవారి దర్శనం - టీటీడీ నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం
తిరుపతి ప్రజలకు ఆ రోజు శ్రీవారి దర్శనం - టీటీడీ నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం
Embed widget