అన్వేషించండి

CWC Qualifiers 2023: బాస్ డె లీడె ఆల్ రౌండ్ షో - వరల్డ్ కప్ ఆడనున్న నెదర్లాండ్స్ - స్కాట్లాండ్ ఔట్

అక్టోబర్ నుంచి భారత్ లో జరుగబోయే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో ఇప్పటికే నేరుగా అర్హత సాధించిన 8 జట్లతో కలిసి పోటీ పడబోయే రెండు జట్లేవో తేలింది.

CWC Qualifiers 2023: బౌలింగ్ లో ఐదు వికెట్లు.. తర్వాత బ్యాట్ తో వీరోచిత శతకం..  వెరసి బాస్ డె లీడె సూపర్ షో తో   నెదర్లాండ్స్ జట్టు..  కీలక మ్యాచ్ లో  స్కాట్లాండ్ ను ఓడించి ఈ ఏడాది భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్ కు అర్హత సాధించింది.  లీడ్  సూపర్ షో తో   డచ్ టీమ్  అయిదోసారి   వన్డే ప్రపంచకప్ కు అర్హత సాధించి  స్కాట్లాండ్ కు షాకిచ్చింది.  ఇదివరకే  ఈ టోర్నీలో శ్రీలంక.. వరల్డ్ కప్ కు క్వాలిఫై అయిన విషయం తెలిసిందే. 

బ్రాండన్ సెంచరీ.. 

జింబాబ్వేలో జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ సూపర్ సిక్సెస్  లో భాగంగా బులవాయో వేదికగా నిన్న (గురువారం) నెదర్లాండ్స్ - స్కాట్లాండ్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన డచ్ టీమ్ మొదలు బౌలింగ్ ఎంచుకుంది. స్కాట్లాండ్  వన్ డౌన్ బ్యాటర్ బ్రాండన్ మెక్ ముల్లెన్ (110 బంతుల్లో 106,  11 ఫోర్లు, 3 సిక్సర్లు)  , కెప్టెన్ బెర్రింగ్టన్ (84 బంతుల్లో 64, 3 ఫోర్లు, 2 సిక్సర్లు)  లు రాణించడంతో ఆ జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 277   పరుగులు చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డె లీడె 10 ఓవర్లు  బౌలింగ్ చేసి 52 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.  

అసాధ్యాన్ని సుసాధ్యం చేసి.. 

ఈ మ్యాచ్ లో  నెదర్లాండ్స్ కు గెలుపుతో పాటు నెట్ రన్ రేట్ పెంచుకోవడం కీలకమైంది.  స్కాట్లాండ్ కంటే  కాస్త తక్కువ  నెట్ రన్ రేట్ కలిగిన డచ్ టీమ్ కు ఈ మ్యాచ్ లో గెలిచి వరల్డ్ కప్ కు అర్హత సాధించాలంటే 44 ఓవర్లలోపే  లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చింది. అయితే లక్ష్య ఛేదనలో  నెదర్లాండ్స్ 30.5 ఓవర్లలో 163 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.  అప్పటికీ  లీడె.. 47 పరుగులతో క్రీజులో ఉన్నాడు.  ఈ పరిస్థితుల్లో అసలు నెదర్లాండ్స్  విజయంపై  ఆశలు అడుగంటాయి. ఒకవేళ ఏదైనా అద్భుతం  జరిగి గెలిచినా  అది 13 ఓవర్లలో అయితే అసాధ్యం అనుకున్నారు ఆ జట్టు అభిమానులు. కానీ లీడె అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ  డచ్ టీమ్ ను విజయతీరాలకు చేర్చాడు.  92 బంతులలోనే  ఏడు బౌండరీలు, ఐదు సిక్సర్ల సాయంతో 123 పరుగులు చేశాడు. ఆరో వికెట్ కు సకిబ్ (33 నాటౌట్) తో కలిసి  11.3 ఓవర్లలోనే 113 పరుగులు జతచేశాడు.విజయానికి రెండు పరుగుల ముందు లీడె నిష్క్రమించినా సకిబ్ లాంఛనాన్ని పూర్తి చేశాడు.  

 

ఈ విజయంతో నెదర్లాండ్స్ తన రన్ రేట్ ను కూడా పెంచుకుని వరల్డ్ కప్ కు అర్హత సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో శ్రీలంక 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా  నెదర్లాండ్స్, స్కాట్లాండ్, జింబాబ్వేలు ఆరు పాయింట్లు సాధించి తర్వాతి స్థానాలలో ఉన్నాయి.  కానీ  నెదర్లాండ్స్.. (+0.230) నెట్ రన్ రేట్.. స్కాట్లాండ్ (+0.102), జింబాబ్వే (-0.099) కంటే మెరుగ్గా ఉంది.  వన్డే వరల్డ్ కప్  ఆడుతుండటం నెదర్లాండ్స్ కు ఇది అయిదోసారి. గతంలో 1996, 2003, 2007, 2011 ప్రపంచకప్ లలో కూడా ఆ జట్టు ఆడింది.  భారత్ తో కూడా నెదర్లాండ్స్.. నవంబర్ 11న బెంగళూరు వేదికగా మ్యాచ్ ఆడనుంది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Posani Krishna Murali: పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
BRSLP : డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
New Immigration Bill: వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
Group 2 Results: తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DMK Uncivilised Heated Argument in Parliament | నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్..ఒళ్లు దగ్గర పెట్టుకోమన్న స్టాలిన్ | ABP DesamChampions Trophy 2025 Winners Team India | కాలు కదపకుండా ఆడి ట్రోఫీ కొట్టేశామా | ABP DesamRohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Posani Krishna Murali: పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
BRSLP : డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
New Immigration Bill: వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
Group 2 Results: తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
Pakistan Passenger Train Hijacked: పాకిస్తాన్‌లో ట్రైన్‌ హైజాక్ - బలూచిస్తాన్ రెబల్స్ వద్ద వందల మంది బందీలు 
పాకిస్తాన్‌లో ట్రైన్‌ హైజాక్ - బలూచిస్తాన్ రెబల్స్ వద్ద వందల మంది బందీలు 
Rajamouli: ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
Robots Into SLBC Tunnel: రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
Court: State vs A Nobody: నాని నిర్మించిన 'కోర్టు'పై పుష్పరాజ్ ఎఫెక్ట్... సంధ్య థియేటర్ ఘటనతో మార్పులు
నాని నిర్మించిన 'కోర్టు'పై పుష్పరాజ్ ఎఫెక్ట్... సంధ్య థియేటర్ ఘటనతో మార్పులు
Embed widget