వార్నర్ లెక్కే వేరు- మరోసారి వైరల్‌గా మారిన సోషల్ మీడియా పోస్ట్
ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ భారత ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో ఫొటో షేర్ చేసి తన శుభాకాంక్షలను తెలియజేశాడు.

డేవిడ్ వార్నర్ ఈ పేరు ఆస్ట్రేలియన్లకే కాదు భారతదేశ ప్రజలకు, ముఖ్యంగా తెలుగువారికి బాగా సుపరిచితమే. తెలుగు సినిమాలు, పాటలతో రీల్స్ చేసి తరచూ ఇన్ స్టాలో పంచుకుంటుంటాడీ ఓపెనర్. అలా మనవారికి చాలా దగ్గరయ్యాడు. గతేడాది వరకు ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరఫున ఆడిన ఈ ఆసీస్ బ్యాటర్ ఈ సంవత్సరం దిల్లీకి ఆడాడు. హైదరాబాద్ ఫ్రాంచైజీతో తనకు విభేదాలున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వార్నర్ ను ఇప్పటికీ సన్ రైజర్స్ ఫాన్స్ తమవాడిలానే చూస్తుంటారు. వార్నర్ కూడా తన రీల్స్, పోస్టులతో అభిమానులకు దగ్గరగానే ఉంటుంటాడు.
ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ భారత ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో ఫొటో షేర్ చేసి తన శుభాకాంక్షలను తెలియజేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram




















