Asia Cup 2023: భారత్, పాక్ మ్యాచ్‌లో డేంజరస్ 5 ప్లేయర్స్ వీరే - ఎవరు ప్రమాదంగా మారతారు?
భారత్, పాకిస్తాన్ ఆసియా కప్ మ్యాచ్‌లో అందరి దృష్టి ఈ ఐదుగురు ఆటగాళ్ల పైనే ఉంటుంది.
IND vs PAK, Asia Cup 2023: 2023 ఆసియా కప్‌లో అతిపెద్ద మ్యాచ్ శనివారం (సెప్టెంబర్ 2వ తేదీ) జరగనుంది. క్యాండీలోని పల్లెకెలె స్టేడియంలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో కొందరు ఆటగాళ్ల ప్రదర్శనపై అందరి చూపు ఉంది.
1. బాబర్ ఆజం
2023 ఆసియా కప్‌లో తన మొదటి మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ 151 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. బాబర్ ఆజం పాక్ బ్యాటింగ్‌కు మూలస్థంభం. అతను సింగిల్‌గా మ్యాచ్‌ను మలుపు తిప్పగలడనడంలో సందేహం లేదు. అయితే భారత్‌తో జరిగిన వన్డేల్లో బాబర్ ఆజం ఇప్పటివరకు భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయాడు. ఏదేమైనా ఈ గొప్ప పోరాటంలో అందరి చూపు బాబర్‌పైనే ఉంటుంది.
2. విరాట్ కోహ్లీ
2023 ఆసియాకప్‌ను టీమిండియా విజయంతో ప్రారంభించాలంటే... విరాట్ కోహ్లీ క్రీజులో నిలబడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా పాకిస్థాన్‌పై కింగ్ కోహ్లి డిఫరెంట్ రిథమ్‌లో బ్యాటింగ్ చేశాడు. చాలా కాలం తర్వాత భారత్, పాక్ మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో కింగ్ కోహ్లి కచ్చితంగా భారీ ఇన్నింగ్స్ ఆడాలని అతని అభిమానులు, భారత క్రికెట్ జట్టు అభిమానులు ఆశిస్తున్నారు.
3. షహీన్ షా ఆఫ్రిది
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్ షహీన్ షా అఫ్రిది తొలి ఓవర్లోనే వికెట్లు తీయడంలో నిపుణుడు. భారత్‌పై షహీన్ బౌలింగ్ ఎలా ఉంటుందో చూడాలని అందరూ కోరుకుంటున్నారు. గతంలో కూడా షహీన్ భారత్‌పై చాలాసార్లు ప్రమాదకరమైన బౌలింగ్‌ను కనబరిచాడు. అయితే ఈసారి ఫార్మాట్ భిన్నంగా ఉంది. మరి ఈసారి షాహీన్ ఎలా రాణిస్తాడో చూడాలి.
4. రోహిత్ శర్మ
ఆసియా కప్ వన్డే ఫార్మాట్‌లో టీమిండియా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు ఎనలేని రికార్డు ఉంది. ఇది కాకుండా అతను పాకిస్తాన్‌పై డిఫరెంట్ స్థాయిలో బ్యాటింగ్ చేస్తాడు. రోహిత్ 10 ఓవర్లు నిలబడితే అతడిని అవుట్ చేయడం కష్టమవుతుందని అందరికీ తెలుసు. వన్డేల్లో రోహిత్ శర్మ మూడు డబుల్ సెంచరీలు సాధించాడు. పాకిస్థాన్‌పై హిట్‌మ్యాన్ ప్రదర్శనపై అందరి దృష్టి ఉంటుంది.
5. నసీమ్ షా
గత ఆసియా కప్‌లో భారత్‌పై నసీమ్ షా అద్భుత ప్రదర్శన చేశాడు. కొత్త బంతిని వికెట్‌కు రెండు వైపులా స్వింగ్ చేయడం నసీమ్ షా ప్రత్యేకత. వన్డేల్లో అతనిపై పరుగులు చేయడం చాలా కష్టం. అతను తరచుగా ప్రారంభ ఓవర్లలో చాలా పొదుపుగా బౌలింగ్ వేస్తాడు. దీంతో ఇతనిపై భారత బ్యాటర్లు ప్రత్యేక దృష్టి పెట్టారు.
మరో వైపు పాకిస్తాన్ తమ తుది జట్టును కూడా ఇప్పటికే ప్రకటించింది. ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ అఘా, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, హరీస్ రవూఫ్, నసీమ్ షా, షహీన్ షా ఆఫ్రిదిలు జట్టులో ఉన్నారు. వీరిలో బాబర్ ఆజం కెప్టెన్ కాగా, మహ్మద్ రిజ్వాన్ వికెట్ కీపర్‌గా వ్యవహరించనున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial