అన్వేషించండి

BCCI Age Test: క్రికెటర్ల వయసు విషయంలో చీటింగ్‌కు నో ఛాన్స్, BCCI కొత్త రూల్‌తో ఫుల్ క్లారిటీ

BCCI Rules | క్రికెట్లో వయస్సు మోసంపై కొత్త రూల్ అమలులోకి తెచ్చింది బీసీసీఐ. ఇక నుంచి మోసం చేయడానికి ఎలాంటి అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు.

BCCI Age Verification: క్రికెట్ లాంటి ఫేమ్ గేమ్‌లో వయసు సంబంధించి ఆరోపణలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. పలుమార్లు పాక్ ప్లేయర్స్ షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్ ఏజ్ మీద విమర్శలు రావడం తెలిపిందే. వారు వయసును తక్కువగా చూపించారని సోషల్ మీడియాలో విమర్శలు రావడం తెలిసిందే. ఇటీవల ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మీద సైతం ఏజ్ రిలేటెడ్ ఆరోపణలు వచ్చాయి. అయితే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) అన్ని టెస్టులు చేసి వెరిఫై చేశాకే ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తుంది. ఈ క్రమంలో ఆటగాళ్ల వయస్సు మోసాన్ని నిరోధించడానికి వయస్సు ధృవీకరణ ప్రోగ్రాం (AVP) లో మార్పులు చేసింది. ఈ ఏడాది నుంచి BCCI 'ఎముక వయస్సు' (Bone Test) నిర్ణీత పరిమితి కంటే ఎక్కువగా ఉన్న ఆటగాళ్లకు రెండోసారి బోన్ టెస్ట్ చేసేలా నిబంధనలు సవరించింది. 

చీటింగ్‌కు ఛాన్స్ లేదంటున్న బీసీసీఐ

BCCI ఇప్పటివరకు 14-16 సంవత్సరాల వయస్సు గల బాలురకు ఎముక పరీక్షలు (Bone Tests) నిర్వహిస్తోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఆటగాడి 'ఎముక వయస్సు' వెల్లడైన తర్వాత, అందులో ఒక సంవత్సరం కలుపుతారు. ఈ పెరిగిన వయస్సు ఆధారంగానే ఆ ఆటగాడిని సంబంధిత ఏజ్ రిలేటెడ్ క్రికెట్ టోర్నమెంట్లలో ఆడేందుకు అనుమతిస్తారు. ఉదాహరణకు, ఒక ఆటగాడి 'ఎముక వయస్సు' 14.8 అయితే, దానిని 15.8 ఏళ్లకు పెంచుతారు. ఈ 'ఎముక వయస్సు' (Bone Age) ప్రకారం, ఆ ప్లేయర్ అండర్-16 క్రికెట్‌లో తదుపరి సీజన్ ఆడటానికి అర్హత సాధిస్తాడని తెలిసిందే.

రూల్స్ సవరించిన బీసీసీఐ

వయసు ధృవీకరణ ప్రోగ్రాం (AVP) ప్రకారం, ఒక ఆటగాడు తన డేటాఫ్ బర్త్ సర్టిఫికెట్‌లో 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉంటే, అతను రెండవ 'ఎముక పరీక్ష' చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ టెస్టుల తర్వాత కూడా అతని వయస్సు 16 సంవత్సరాల కంటే తక్కువగా తేలితే, అతనికి తదుపరి సీజన్ ఆడటానికి అనుమతిస్తారు. అదేవిధంగా, 12-15 వయస్సు గల బాలికలకు కూడా ఇదే ప్రక్రియను అమలు చేయనున్నారు.

బోన్ టెస్ట్ ఫలితాలను 100 శాతం ఖచ్చితమైనవిగా పరిగణించలేము అని ఒక సాధారణ అభిప్రాయం ఉంది. కనుక రెండవ పరీక్ష నిర్వహించడానికి ఇది కూడా ఒక కారణం అయి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత వారంలో జరిగిన BCCI సమావేశంలో రెండవ బోన్ టెస్ట్ నిర్వహించే నిబంధనకు ఆమోదం లభించింది. ఈ పరీక్ష ఎక్స్-రే ద్వారా నిర్వహించనున్నారు. ప్రతి డొమోస్టిక్ సీజన్ ప్రారంభానికి ముందు ఆటగాళ్ళు ఈ పరీక్షకు హాజరు కావాలని బీసీసీఐ స్పష్టం చేసింది.

కాగా, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. రాజస్థాన్ జట్టు తరఫున ఆడుతున్న వైభవ్ అంతర్జాతీయ బౌలర్లను ఎదుర్కొని మరీ 35 బంతుల్లోనే గుజరాత్ టైటాన్స్ పై సాధించిన సమయంలో అతడి ఏజ్ విషయంలో విమర్శలు వచ్చాయి.

Also Read: IND vs Eng 1st Test: విదేశాల్లో గిల్ సెంచరీ, కోహ్లీ సరసన చేరిన యువ కెప్టెన్- టెస్ట్ చరిత్రలో సరికొత్త రికార్డు!

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Mahela Jayawardene Steps Down: 3 సార్లు కప్ కొట్టించిన కోచ్ కు గుడ్ బై..  హెడ్ కోచ్ పదవికి జయవర్ధనే రాజీనామా, హార్దిక్  ట్రేడింగ్ తో మొదలైన పెను మార్పులు
3 సార్లు కప్ కొట్టించిన కోచ్ కు గుడ్ బై..  హెడ్ కోచ్ పదవికి జయవర్ధనే రాజీనామా, హార్దిక్  ట్రేడింగ్ తో మొదలైన పెను మార్పులు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Vaas Bowling Mastermind: వరల్డ్ కప్ హీరోతో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కెచ్.. మునాఫ్  స్థానంలో లెజెండరీ పేసర్  ఎంట్రీ, గంగూలీ, యువరాజ్ కాంబోతో సరికొత్త టీమ్
వరల్డ్ కప్ హీరోతో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కెచ్.. మునాఫ్  స్థానంలో లెజెండరీ పేసర్ ఎంట్రీ, గంగూలీ, యువరాజ్ కాంబోతో సరికొత్త టీమ్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget