అన్వేషించండి

T20 World Cup 2024: వన్డే వరల్డ్ కప్ చేజారింది, కానీ బార్బడోస్‌లో జెండా పాతుతాం- ఎప్పుడో చెప్పిన జై షా

IND Vs SA: బార్బడోస్‌లో మరికాసేపట్లో మహా సమరం మొదలుకానుంది. విజేత ఎవరో అందరూ లెక్కలు వేసి చూస్తున్నారు. అయితే బీసీసీఐ కార్యదర్శి జై షా ఈసారి టీ 20 ప్రపంచకప్‌ విజేత ఎవరో ముందే చెప్పేశారు.

BCCI Secy Jay Shah Prediction: బార్బడోస్‌లో మరికాసేపట్లో మహా సమరం జరగనుంది. ఈ సమరంలో గెలిచిన జట్టు జగజ్జేతగా నిలవనుంది. టీమిండియా-సౌతాఫ్రికా(IND Vs SA) మధ్య జరగనున్న టీ 20 ప్రపంచ కప్‌(T20 World Cup) ఫైనల్లో ఎవరు విజయం సాధిస్తారనే దానిపైనే ఇప్పుడు క్రికెట్‌ ప్రపంచం దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఎవరి బలాలేంటీ..? బలహీనతలెంటీ..। చెలరేగి ఆడేదవరు ఇలా ఎవరి లెక్కలు వారేసుకుని విజేతలుగా నిలిచేది ఎవరో అంచనా వేస్తున్నారు. అయితే వీళ్లందరి కంటే ముందు బీసీసీఐ కార్యదర్శి జై షా ఈసారి టీ 20 ప్రపంచకప్‌ విజేత ఎవరో ముందే చెప్పేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
 

 
ఎప్పుడన్నారు.. ఏమన్నారు
బార్బడోస్‌లో టీమిండియా జెండా పాతుతుందని బీసీసీఐ కార్యదర్శి జై షా ముందే ఊహించారు. చాలా నెలల క్రితమే జై షా ఈ జోస్యం చెప్పారు. అహ్మదాబాద్‌లో 2023 వన్డే క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమి ఎదురై అప్పుడే ఏడు నెలలు గడిచిపోయింది. ఆ సమయంలోనే జై షా కీలక ప్రకటన చేశారు. వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ ఓడిపోయినా.. టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా కచ్చితంగా గెలుస్తుందని జై షా జోస్యం చెప్పారు. వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఓటమితో తీవ్ర భావోద్వేగానికి గురైన జైషా... అప్పట్లోనే ఈ ప్రకటన చేశారు. టీ 20 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ విజయం సాధిస్తుందని అంచనా వేశారు. తాను ప్రపంచకప్ ఓటమిపై ఇప్పుడు ప్రకటన ఇస్తున్నానని... 2023లో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచిన తర్వాత కూడా టీమిండియా ట్రోఫీని ఎత్తలేకపోవచ్చని... ఇప్పుడు తాము హృదయాలను గెలిచామని 2023 ఫైనల్లో ఓటమి అనంతరం జై షా అన్నాడు. ఈ ఓటమితో ఆగిపోమని... 2024లో రోహిత్ శర్మ సారథ్యంలో బార్బడోస్‌లో కచ్చితంగా భారత జెండా పాతుతామని అప్పుడే జై షా ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ మాటలు నిజం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. జై షా మాట్లాడిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. ఈసారి ఎన్ని అవంతరాలు ఎదురైనా టీమిండియానో విజయం సాధిస్తుందని... అందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.
 

 
అజేయంగా భారత్‌...
2023 వన్డే ప్రపంచకప్‌లాగానే 2024 టీ20 ప్రపంచకప్‌లో కూడా భారత్ ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోలేదు. 2023 వన్డే ప్రపంచ కప్‌లో గ్రూప్ దశలో టీమ్ ఇండియా 9 మ్యాచ్‌ల్లో గెలిచి, సెమీ-ఫైనల్‌లోనూ విజయం సాధించింది. కానీ అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో రోహిత్ సేన ఆస్ట్రేలియా ముందు తలవంచింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు ఇదే పరిస్థితిలో ఉంది. కానీ ప్రత్యర్థి మారింది. దక్షిణాఫ్రికా.. భారత్‌కు.. ప్రపంచకప్‌నకు మధ్య ఉంది. ప్రొటీస్‌ను ధాటి టీమిండియా కప్పును గెలుచుకునేందుకు సిద్ధంగా ఉంది.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget